Allu Aravind: ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతున్నా పరిణామాలు అందరికి తెలిసినవే. పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లు రిలీజ్ టైం లో థియేటర్లు మూసివేయాలంటూ వస్తున్న వార్తలు, దీని వెనుక ఓ నలుగురు నిర్మాతలు ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. ఇండస్ట్రీలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ మీట్ లో అల్లు అరవింద్ మాట్లాడారు.తాజాగా ఈ విషయాలకు సంబంధించి అల్లు అరవింద్ ప్రెస్ మీట్ లో కొన్ని ప్రశ్న లకు క్లారిటీ ఇచ్చారు. ఆ వివరాలు చూద్దాం..
ఆ నలుగురికి నాకు సంబంధం లేదు..
అల్లు అరవింద్ మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు జరిగింది వింటుంటే నాకు ఆశ్చర్యం గా వుంది ఇండస్ట్రీలో ఓ నలుగురు వెనక ఉండి అంతా చేయిస్తున్నారనే మాట ఎక్కువ వినిపిస్తుంది. ఆ నలుగురిలో నేను లేను, నాకు వారికి సంబంధం లేదు. అసలు ఆ నలుగురు అనే మాట 15 ఏళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇప్పుడు నలుగురు కాస్త పదిమంది అయ్యారు. సంఖ్య పెరిగిపోతున్న ఎవరూ పట్టించుకోవట్లేదు. నేను ఆ నలుగురితో వ్యాపారం చేయడం మానేశాను. అప్పట్లో వారితో సన్నిహితంగా ఉండేవాడిని, కోవిడ్ సమయంలో నేను వారి నుండి పక్కకు వచ్చేసా, ఇక థియేటర్లో విషయానికి వస్తే నాకు తెలంగాణలో ఒక ధియేటర్ మాత్రమే ఉంది. AAA సినిమాస్ ఒకటే అక్కడ ఉంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో నాకు థియేటర్స్ 15 లోపే ఉన్నాయి. భవిష్యత్తులో వాటిని కూడా తీసివేయాలని అనుకుంటున్నాను. ఇప్పటికే మా స్టాఫ్ తో చెబుతూ ఉంటాను రెన్యువల్ చేయించవద్దు,లీజు పూర్తయిన వెంటనే ఆపేసేయండి అని, మెల్లిగా థియేటర్స్ సంఖ్యని తగ్గిస్తాను. నాకు సినిమాలు నిర్మించడమే తెలుసు గత 50 సంవత్సరాలుగా నేను అదే వృత్తిలో ఉన్నాను. జూన్ 1 నుంచి ధియేటర్లు మూసివేస్తామని ఎగ్జిబిటర్లు నిర్ణయించడం దానిపై ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడడం, అదంతా సమంజసమే, ఆయన కలగజేసుకోవడం తో నేను ఏకీభవిస్తున్నాను.ఇక పవన్ సినిమా ఆపటం అనేది దుస్సహసమే ,ఆయన మనకోసం ఇండస్ట్రీ తరపున నిలబడ్డారు అయన సినిమా ఆపే సహసం ఎవరు చేయరు. అని అల్లు అరవింద్ తెలిపారు.
పవన్ ఫ్యాన్స్ కి అల్లు అరవింద్ వార్నింగ్..
ఇక తాజాగా అల్లు అరవింద్ చేసిన వ్యాఖ్యలు పవన్ ఫాన్స్ కి గట్టి కౌంటర్ గా ఉన్నాయి. ఇప్పటివరకు పవన్ ఫ్యాన్స్ ఆయన సినిమాను అడ్డుకోవడంలో అల్లు అరవింద్ ఉన్నారంటూ ట్రోల్స్ చేశారు. దాన్ని వైరల్ చేసి, సోషల్ మీడియాలో ఆయనపై కామెంట్స్ కూడా చేశారు అదంతా దృష్టిలో ఉంచుకొని అల్లు అరవింద్ ఈ రోజు బయటికి వచ్చి ఆ నలుగురిలో నేను లేను వారితో నాకు సంబంధం లేదు అని తేల్చి చెప్పడంతో పవన్ ఫ్యాన్స్ కి గట్టి వార్నింగ్ ఇచ్చినట్లు అర్థమైంది. ఏదైనా ఇండస్ట్రీకి సంబంధించి చిన్న చిన్న అపార్ధాలు రావడం సమంజసం. అయితే ఫ్యాన్స్ కొంచెం ఉన్నదాన్ని ఇంకాస్త పెద్దది చేసి రచ్చ చేస్తూ ఉంటారు. ఇప్పుడు అల్లు అరవింద్ బయటికి వచ్చి ఆ నలుగురిలో నేను లేను అని చెప్పే వరకు పవన్ ఫ్యాన్స్ ట్రోల్స్ ఆపలేదు. ఇక ఇప్పుడు ఆయన చెప్పిన తర్వాత అయిన ను అర్థం చేసుకుంటారు లేదంటే ఇంకోలా కామెంట్ చేస్తారో చూడాలి.