Thiruvananthapuram: రోడ్లపై వెళ్లేటప్పుడు జాగ్రత్త అంటూ పోలీసులు పదేపదే వాహనదారులను హెచ్చరిస్తూనే ఉంటారు. అయినా అడ్డదిడ్డంగా వాహనాలు నడుపుతారు. దీనివల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీ కొట్టే అవకాశముందని ట్రాఫిక్ సిగ్నల్ వద్ద మైక్‌లతో చెబుతారు. అయినా వాహనదారుల తీరు మారలేదు. ఇలాంటి ఘటన ఒకటి కేరళ సీఎం విజయన్‌కు ఎదురైంది. ఆ ఘటనలో ఆయన తృటితో తప్పించుకున్నారు.
కేరళ సీఎం విజయన్ కాన్వాయ్ వామనపురం నుంచి రాజధాని తిరువనంతపురం వస్తోంది. సీఎం కాన్వాయ్ రోడ్డు మధ్యలో వెళ్తోంది. రోడ్డుకు ఇరువైపులా వాహనాలు వెళ్తున్నాయి. రోడ్డు క్రాస్ చేసే క్రమంలో స్కూటీపై వెళ్తున్న ఓ మహిళ అనుకోకుండా కుడివైపు మలుపు తీసుకుంది.
ఆమె వెనకాలే సీఎం కాన్వాయ్ వస్తోంది. మహిళను కాపాడేందుకు పైలెట్ వాహనం ఒక్కసారి బ్రేక్ వేసింది. వెనుక వేగంగా వస్తున్న ఆరు వాహనాలు వెనుక ఒకదాని వెనుక మరొకటి ఢీ కొట్టాయి. ఈ ఘటనలో ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న కారు స్వల్పంగా డ్యామేజ్ అయ్యింది. సీఎం విజయన్ తృటిలో తప్పించుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే భద్రతా సిబ్బంది వెంటనే వాహనాల పరిస్థితిని పరిశీలించారు. కాన్వాయ్ వెనుక వస్తున్న అంబులెన్స్ సిబ్బంది బయటకు వచ్చి అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం బైక్ నడిపిన మహిళలను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు పోలీసులు.
ALSO READ: బాబోయ్ చంపేస్తాడు.. మొన్న బిష్ణోయ్‌పై సెటైర్లు, నేడు కాపాడండి అంటూ పోలీసులకు పప్పు యాదవ్ విన్నపం
నార్మల్‌గా అయితే సీఎం కాన్వాయ్ వస్తుందంటే వాహనాలు నిలిపి వేస్తారు. వామనపురం ప్రాంతంలో రోడ్డు మధ్యలో కాన్వాయ్ వెళ్లడంతో ఈ ఘటన జరిగిందని అంటున్నారు. కాసేపు వాహనాలు నిలిపి ముఖ్యమంత్రి కాన్వాయ్ పంపితే ఇలాంటి పరిస్థితి ఉండేది కాదన్నది స్థానికుల మాట. దీనికితోడు రోడ్డు మధ్యలో డివైడర్లు లేకపోవడం వల్ల ఇలాంటి ఘటనలు తరచూ జరుగుతున్నాయని అంటున్నారు.
🚨 Kerala CM convey met with an accident. Who's fault is it? pic.twitter.com/bBcDFzTE3y
— Indian Tech & Infra (@IndianTechGuide) October 28, 2024