DaakuMaharaaj:సీనియర్ స్టార్ హీరోలలో ఒకరైన నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna)వరుస సినిమాలతో ఆకట్టుకుంటున్నారు. ఆరుపదుల వయసులో కూడా భారీ విజయాలు అందుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ముఖ్యంగా యంగ్ హీరోలకు పోటీ ఇస్తూ వరుస బ్లాక్ బాస్టర్ విజయాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే చివరిగా ‘భగవంత్ కేసరి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య ఇప్పుడు ‘డాకు మహారాజ్'(Daaku Maharaaj) సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. జనవరి 12వ తేదీన అనగా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కాంబోతోంది.
ఇండియాలో డాకు మహరాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్..
ప్రముఖ డైరెక్టర్ బాబి(Bobby)ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. బాలయ్య 109వ చిత్రం గా వస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. సినిమా నుంచి విడుదల చేసిన బాలకృష్ణ లుక్, టైటిల్ , గ్లింప్స్,పోస్టర్స్ అన్నీ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ప్రముఖ బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ (Bobby Deol) కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. అలాగే శ్రద్ధా శ్రీనాథ్(Shraddha shrinath) హీరోయిన్గా నటిస్తోంది. ఇకపోతే ఈ సినిమా ఈవెంట్ ను రెండు తెలుగు రాష్ట్రాలలో ఏదో ఒక ప్లేస్ ఫిక్స్ చేసి విడుదల చేస్తారని అభిమానులు ఎంతగానో కలలు కన్నారు. అంతేకాదు తమ అభిమాన హీరోని నేరుగా చూసే అవకాశం లభిస్తుందని ఆశలు కూడా పెట్టుకున్నారు. అయితే అభిమానుల ఆశలపై నీళ్లు చల్లుతూ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఇండియాలో క్యాన్సిల్ చేశారు నిర్మాత నాగ వంశీ (Naga Vamsi).
ఘనంగా డల్లాస్ లో జనవరి 4న ప్రీ రిలీజ్ ఈవెంట్..
ప్రస్తుతం స్టార్ హీరోలు అందరూ కూడా తమ సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ను అమెరికాలో నిర్వహిస్తూ భారీ క్రేజ్ దక్కించుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఇదే విషయాన్ని నిర్మాత నాగవంశీ కూడా ఫాలో అవుతున్నారు. రానున్న నూతన సంవత్సరంలో అభిమానులలో మరింత జోష్ నింపడానికి వచ్చే యేడాదికి జనవరి 4వ తేదీన యూఎస్ఏ లోని డల్లాస్, టెక్సాస్ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను సాయంత్రం 6:00 గంటలకు నిర్వహించనున్నారు. డాకు మహారాజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో అమెరికాలో నిర్వహిస్తూ ఉండడం గమనార్హం.
నిరాశ వ్యక్తం చేస్తున్న ఫ్యాన్స్..
ఇకపోతే ఈ విషయాన్ని పోస్టర్ తో సహా వెల్లడించింది చిత్ర బృందం. ఇక దీనిపై డైరెక్టర్ బాబీ కూడా గతంలో డాకు మహారాజ్ సినిమాపై స్పందిస్తూ..” మునుపెన్నడూ లేని విధంగా మాస్ దేవుడి సాక్షిగా.. నందమూరి బాలకృష్ణ గారిని డాకు మహారాజ్ గా ప్రజెంట్ చేస్తున్నాను” అంటూ బాబి తెలిపారు. మొత్తానికైతే యూఎస్ఏ లో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్నారు. ఇదంతా బాగానే ఉంది కానీ ఇక్కడ అభిమానులకు నిరాశ మిగిల్చారు అని చెప్పవచ్చు. అయితే ఆయన అభిమానులు కాబట్టి ఎక్కడైనా సరే ఈవెంట్ గ్రాండ్ గా జరగాలి అని కోరుకుంటున్నారు. మరి ఈ సినిమాతో బాలయ్య మరో సంచలనం సృష్టించడానికి సిద్ధమయ్యారు అని చెప్పవచ్చు.