Divvela Maduri: తనపై, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై అసభ్యకర పోస్టులు, కామెంట్లు పెడుతున్నారంటూ దివ్వెల మాధురి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని టెక్కలి పోలీస్ స్టేషన్ లో సీఐకి కంప్లెంట్ ఇచ్చారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వం మహిళల రక్షణకు పెద్దపీఠ వేస్తామని అసెంబ్లీలో ప్రకటించిందని చెప్పారు. హోంమంత్రి అనిత కూడా ఎవరైనా మహిళలపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారని అన్నారు. అవి చూశాక తమకు కూడా నమ్మకం కలిగిందని, తమపైన కూడా కొంతమంది జనసేన పార్టీ వాళ్లు ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపించారు.
Also read: ఆ ఒక్కటి అడక్కు అంటున్న వైసీపీ నేతలు.. మీడియా కనిపిస్తే దూరం దూరం అనేస్తున్నారట..
అసభ్యకరమైన పోస్టులు పెడుతన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి ఆధారాలతో వచ్చి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశామని చెప్పారు. పోలీసులు చర్యలు తీసుకుంటారా? లేదా? అనేది చూడాల్సి ఉందన్నారు. ఎమ్మెల్సీ దువ్వాడపై, తనపై కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని చెప్పారు. గతంలో ఎప్పుడో దువ్వాడ శ్రీనివాస్ చెప్పుచూపించి కొడతామని చెబితే ఆయనకు నోటీసులు ఇచ్చారని అన్నారు.
గతంలో తనకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయని దువ్వాడ ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు పోలీసులు పట్టించుకోవడంలేదని అన్నారు. తనను చంపేస్తానని కూడా బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కు ఇప్పటికే వివాహం జరగ్గా ఇద్దరు కూతుళ్లు ఉన్న సంగతి తెలిసిందే.
ఆయన కుటుంబ సభ్యులను ఇంట్లోకి రానివ్వకుండా ప్రస్తుతం దివ్వెల మాధురితో కలిసి ఉంటున్నారు. త్వరలోనే తాము వివాహం కూడా చేసుకుంటామని వీరిద్దరూ ప్రకటించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా దువ్వాడ, దివ్వెల మాధురి వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఈ క్రమంలో వీరిద్దరిపీ సోషల్ మీడియాలో ట్రోల్స్ సైతం పెరిగిపోయాయి. కుటుంబాన్ని వదిలి మాధురితో ఉండటంతో దువ్వాడపై విమర్శలు వస్తున్నాయి.