NBK109teaser : తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ముందు రచయితగా అడుగు పెట్టాడు బాబి. అయితే చాలా సినిమాలకు రచయితగా వర్క్ చేసిన బాబి పవర్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చాడు. అయితే బాబి మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకొని తనకంటూ దర్శకుడిగా ఒక ప్రత్యేకమైన గుర్తింపును సాధించుకున్నాడు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ రైటర్ గా వర్క్ చేసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకి దర్శకుడుగా వర్క్ చేశాడు. ఆ సినిమా ఫెయిల్ అయినా కూడా ఒక దర్శకుడుగా బాబి ఆ సినిమాతో ఫెయిల్ కాలేదు.
ఆ తర్వాత ఎన్టీఆర్ తో జై లవకుశ అనే సినిమాను తెరకెక్కించాడు. అయితే ఎన్టీఆర్ లోని పరిపూర్ణమైన నటుడిని బయటికి తీసిన సినిమా అదే అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ ని మూడు పాత్రల్లో చూపించి ప్రేక్షకులను విపరీతంగా మెప్పించాడు బాబి. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద బీభత్సమైన హిట్ ను సాధించింది.
తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఏ దర్శకుడికి దక్కని అరుదైన అవకాశం, మరియు మంచి ఛాన్సులన్నీ బాబీ కే దక్కాయి అని చెప్పొచ్చు. ఎందుకంటే రెండవ సినిమా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన తర్వాత మూడవ సినిమా ఎన్టీఆర్ తో తీయడం ఆ తర్వాత నాలుగువ సినిమాని మల్టీస్టారర్ చేయటం బాబి కి దక్కిన అదృష్టం. నాగచైతన్య విక్టరీ వెంకటేష్ కలిసిన నటించిన వెంకీ మామ సినిమాకి దర్శకత్వం వహించాడు బాబి. ఆ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాన్ని సాధించింది. ఇక బాబీ కి ఎనలేని కీర్తిని తీసుకొచ్చిన సినిమా వాల్తేరు వీరయ్య. మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన కలెక్షన్స్ రాబట్టింది. ఎప్పటినుంచో చిరంజీవి లో మిస్ అవుతున్న ఎంటర్టైన్మెంట్ యాంగిల్ ని అద్భుతంగా బయటికి తీసి ప్రాపర్ గా పక్కా కమర్షియల్ సినిమాను అందించాడు బాబి.
లీక్ అయిన టైటిల్ కి ఇంత హాడావిడా..
బాబీ ప్రస్తుతం బాలకృష్ణ తో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నాగ వంశీ అలానే త్రివిక్రమ్ శ్రీనివాస్ భార్య సౌజన్య శ్రీనివాస్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకి డాకు మహారాజ్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఈ టైటిలే ఫిక్స్ చేసినట్లు అందరికీ ఒక క్లారిటీ కూడా వచ్చేసింది. అయినా కానీ నవంబర్ 15న టీజర్ తో పాటు టైటిల్ అనౌన్స్మెంట్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది చిత్ర యూనిట్. ఆల్రెడీ లీక్ అయిన టైటిల్ ను ఇంతలా హోల్డ్ చెయ్యడం ఏంటో అని నెటిజన్స్ పెదవి విరుస్తున్నారు. రిలీజ్ చేసిన పోస్టర్ లో ఆయుధాలతో పాటు బాలకృష్ణ లాంగ్ హెయిర్, చెవి పోగు కనిపిస్తున్నాయి. పోస్టర్ చూస్తుంటే హిట్టు కల కనిపిస్తుంది.
Also Read : Siddharth: ‘మిస్ యూ’ అంటున్న సిద్దార్థ్.. టీజర్ అదిరింది