Sai Pallavi: నటీనటుల జీవితాలు ఎలా ఉంటాయి అంటే.. రాత్రీపగలు అని తేడా లేకుండా షూటింగ్ చేయాల్సి వస్తుంది. పాత్ర ప్రకారం ఎలాంటి కాస్ట్యూమ్ వేసుకోవాల్సివస్తుంది. చిన్న చిన్న లొకేషన్స్ కు వెళితే.. అక్కడ బట్టలు మార్చుకోవడానికి కూడా ప్లేస్ లేకుండా ఉంటుంది. ఇలాంటి పరిస్థితులు అన్ని తట్టుకున్నప్పుడే స్టార్స్ గా మారతారు. కానీ, అలాంటి సిట్యువేషన్స్ పేస్ చేసినప్పుడు మాత్రం నావల్ల కాదు.. నేను చేయలేను అని ఏడ్చేస్తారు.
మొన్నటికి మొన్న సమంత.. రాజ్ అండ్ డీకే తో పనిచేయలేక మేనేజర్ తో చెప్పుకొని ఏడ్చినట్లు చెప్పుకొచ్చిన విషయం తెల్సిందే. తెలుగు, తమిళ్ భాషల్లో ఒకరోజులో రెండు మూడు సీన్స్ మాత్రమే షూట్ చేస్తారు.. కానీ రాజ్ అండ్ డీకే షెడ్యూల్ మొత్తం ఒక రోజులోనే అవ్వాలని చూస్తారు. దానికోసం ప్రతిఒక్కరిని షూట్ చేయాలనీ కంగారుపెడతారు. దానివలన నేను చేయలేక మేనేజర్ తో చెప్పుకొని ఏడ్చాను. ఆ తరువాత వారి పనికి అలవాటు పడ్డాను అని చెప్పుకొచ్చింది.
Lokesh Kanagaraj: బాలీవుడ్ స్టార్‌తో లోకేశ్ కనకరాజ్.. అనుకుంది సాధించిన యంగ్ డైరెక్టర్
ఇక ఇప్పుడు సమంతలానే సాయిపల్లవి కూడా ఒక డైరెక్టర్ ఏడ్పించాడట. ఆ డైరెక్టర్ ఎవరో కాదు శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్. నాని, సాయిపల్లవి జంటగా నటించిన ఈ సినిమా ఏ రేంజ్ లో హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా ఈ సినిమా తరువాతనే సాయిపల్లవికి లేడీ పవర్ స్టార్ అనే బిరుదు వచ్చింది. ఆ డ్యాన్స్ కు, ఆమె నటనకు ఫ్యాన్స్ అంతా ఫిదా అయ్యారు. అయితే ఆ సినిమా మొత్తంలో సాయిపల్లవి సీన్స్ అన్ని నైట్ సమయంలోనే జరిగాయి. ఇక ఆ టైమ్ లో ఆమె చాలా ఏడ్చినట్లు చెప్పుకొచ్చింది.
” నాకు నైట్ పడుకోకపోతే ఉదయం నిద్ర పట్టదు. శ్యామ్ సింగరాయ్ షూట్ అంతా నైట్ జరిగింది. అన్ని సీన్స్ అయ్యేవరకు రాహుల్ వదిలేవాడు కాదు. అవన్నీ అయ్యేవరకు అలానే మెలకువతో ఉండేదాన్ని. ఉదయమే నిద్ర వచ్చేది కాదు. చాలా ఇబ్బందిపడ్డాను. ఒకరోజు సెట్ కు చెల్లి వస్తే.. తనను పట్టుకొని ఏడ్చేసాను. వెంటనే తను వెళ్లి, డైరెక్టర్, ప్రొడ్యూసర్ తో మాట్లాడింది. ఒక రెండు రోజులు అక్కకు రెస్ట్ కావాలి అని అడిగింది. వారు రెండు రోజులు కాదు.. పదిరోజులు తీసుకోండి పర్లేదు అని చెప్పారు” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.
Actor Noel Sean:16 రోజులకే విడాకులు.. నా జీవితం నాశనమైంది.. ఎస్తేర్ ఎలాంటిదంటే ..?
ఇక సాయిపల్లవి కెరీర్ విషయానికొస్తే.. ఈ మధ్యనే అమరన్ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈ చిన్నది.. తెలుగు, హిందీ బాధల్లో పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లో నటిస్తోంది. మరి ఈ సినిమాలతో అమ్మడు ఎలాంటి విజయాలను అందుకుంటుందో చూడాలి.