BigTV English

Kangana Ranaut: నటి కంగనపై అభ్యంతరకర పోస్టు.. ఈసీకి జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు!

Kangana Ranaut: నటి కంగనపై అభ్యంతరకర పోస్టు.. ఈసీకి జాతీయ మహిళా కమిషన్ ఫిర్యాదు!
Kangana Ranaut
Kangana Ranaut

Congress Leader Comments on Kangana Ranaut: బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అటు సినిమాలే కాకుండా సోషల్ మీడియాలోను ప్రపంచ దేశాల్లో జరిగే సంఘటనలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ ఉంటారు. తాజాగా సినిమాల నుంచి రాజకీయాలపై కంగనా ఫోకస్ మళ్లింది. లోక్ సభలు ఎన్నికలు 2024 సమీపిస్తున్న వేళ బీజేపీ పార్టీ నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ మేరకు హిమాచల్ ప్రదేశ్ మండి నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు బీజేపీ అధిష్టానం టిక్కెట్ ప్రకటించింది. ఈ మేరకు బీజేపీ ఎంపీ అభ్యర్థుల లిస్టులో కంగనా పేరును కూడా అధిష్టానం ప్రకటించింది. ఈ తరుణంలో తాజాగా కంగనా రనౌత్ పై సోషల్ మీడియాలో ఓ పోస్టు వివాదానికి దారి తీసింది.


కంగనా రనౌత్‌పై సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టుపై జాతీయ మహిళా కమిషన్ కూడా స్పందించింది. ఓ మహిళపై ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని పేర్కొంటూ జాతీయ మహిళా కమిషన్ కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. కంగనాపై వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతపై చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ లేఖను రాసింది.

కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనతే అకౌంట్ నుంచి ఈ పోస్ట్ అప్లోడ్ అయినట్లు గుర్తించారు. అంతేకాదు ఫిర్యాదు కాపీలో హెచ్.ఎస్.అహిర్ పేరును కూడా మహిళా కమిషన్ పేర్కొంది. ఓ మహిళ అయి ఉండి.. మహిళల గౌరవానికి భంగం కలిగించే ప్రవర్తన సహించరాదని ఆగ్రహం వ్యక్తం చేసింది.


Also Read: బిగ్ బాస్ ఫేమ్‌కి 14 రోజుల కస్టడీ.. సెంట్రల్ జైలుకు తరలింపు

బీజేపీ ఎంపీ అభ్యర్థిగా కంగనాను అధిష్టానం ప్రకటించిన కొద్ది రోజులకే సుప్రియా అభ్యంతరకర పోస్టు చేయడంపై బీజేపీ నేతలు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ఆమెపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు ఫిర్యాదులు చేస్తున్నారు. కాగా, కంగనాపై గుజరాత్ కాంగ్రెస్ నేతలు అభ్యంతరకర పోస్టులు చేసినట్లు కూడా బీజేపీ గుర్తించింది. ఈ మేరకు తనపై వచ్చిన పోస్టులపై కంగనా కూడా స్పందించింది.

ప్రతీ మహిళలకు రెస్పెక్ట్ అనేది అర్హతే అని పేర్కొంటూ కంగనా ఓ పోస్ట్ చేశారు. ‘ఒక యువకుడికి టికెట్ వస్తే అతడి సిద్ధాంతాలను విమర్శిస్తారు. అదే ఓ యువతికి టికెట్ వస్తే లైంగికతపై దాడి చేస్తారు. ఇలాంటి అసభ్యకర ధోరణిని కాంగ్రెస్ ప్రదర్శించడం సిగ్గుచేటు’ అని పేర్కొన్నారు. మరోవైపు ఈ పోస్టుపై సుప్రియా కూడా స్పందించింది. తన సోషల్ మీడియా అకౌంట్ల యాక్సెస్ చాలా మంది వద్ద ఉందని తెలిపింది. వారిలో ఎవరో ఈ పోస్టు పెట్టి ఉంటారని.. తనకు తెలియగానే డిలీట్ చేశానంటూ చెప్పింది. అంతేకాదు దీనిపై ట్విట్టర్ లో కంప్లైంట్ ఇచ్చినట్లు కూడా చెప్పింది.

Related News

Dharsha Guptha: ఇంస్టాగ్రామ్ ద్వారా నెలకు లక్షల్లో ఆదాయం..ఈ ముద్దుగుమ్మ పనే బాగుందే!

Vithika sheru: మట్టి వినాయకుడిని చేసిన హీరోయిన్.. వామ్మో ఈ టాలెంట్ కూడా ఉందా?

Dethadi Alekhya Harika: మన క్యారెక్టర్ ని డిసైడ్ చేసేది అదే.. బుల్లి కథతో హారిక పోస్ట్!

Big TV kissik talks : స్టేజ్ పై అమ్మాయిలతో పండు అలా.. అడ్డంగా పరువుతీసేసిన వర్ష…

Big TV kissik talks : శేఖర్ మాస్టర్ అలాంటి వాడే.. షాకింగ్ విషయాలను బయట పెట్టిన పండు..!

The Big Folk Night 2025 : జానపదంతో దద్దరిల్లిన ఎల్బీ స్టేడియం.. ఘనంగా బిగ్ టీవీ ఫోక్ నైట్

Big Stories

×