Ranbir Kapoor: బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న రణబీర్ కపూర్ (Ranbir Kapoor) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ఒకప్పుడు అమ్మాయిల కలల రాకుమారుడు.. అయినా ఇప్పటికీ కూడా అనుకోండి.. కానీ ఇప్పుడు వివాహం అయిపోయింది కాబట్టి అమ్మాయిలలో ఆ క్రేజ్ కాస్త తగ్గిందనే చెప్పాలి. అయినా సరే రణబీర్ కపూర్ అంటే పడి చచ్చిపోయే ఒక వర్గం అమ్మాయిలు కూడా ఉన్నారు. ఇక ఇప్పుడు వరుస సినిమాలలో నటిస్తూ భాషతో సంబంధం లేకుండా పాన్ ఇండియా నటుడిగా పేరు దక్కించుకున్నారు. అటు ఈయన భార్య ప్రముఖ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ (Alia Bhatt) కూడా వరుస సినిమాలు చేస్తూ భారీ క్రేజ్ సొంతం చేసుకుంది. ఆలియా మహేష్ భట్ కూతురు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే రణబీర్ కపూర్ ఆలియా భట్ వివాహానికి ముందే ప్రేమించుకుని.. పెళ్లికి ముందే కాస్త తొందరపడి పెళ్లయిన ఎనిమిది నెలలకే ఆలియా పండంటి పాపకు జన్మనిచ్చింది.
వీరు తమ పాపకు రాహా అని నామకరణం కూడా చేశారు. ఇక పాప కూడా ఇప్పటికే పెద్దదైపోగా.. పాప కూడా చాలా అందంగా ఉంది. ఇలా హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్న ఈ కుటుంబానికి సంబంధించిన పాత ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పెళ్లి చేసుకోవాలనుకున్న రణబీర్ కపూర్ – దీపికా పదుకొనే
.
అదేంటంటే గతంలో రణబీర్ కపూర్.. స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే (Deepika Padukone) ప్రేమించుకునేటప్పుడు తీసుకున్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఇక దీనిపై రణబీర్ కపూర్ తల్లి స్పందిస్తూ.. అందుకే దీపిక నా ఇంటి కోడలు కాలేకపోయింది అంటూ గతంలో చెప్పిన ఒక క్లిప్ కూడా వైరల్ గా మారుతోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..అసలు విషయంలోకి వెళ్తే.. బాలీవుడ్ జంటలలో భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న రణబీర్ కపూర్, దీపికా పదుకొనే జంట కూడా ఒకటి. వీరిద్దరూ ‘తమాషా’ అనే సినిమాతో పాటు చాలా సినిమాలలోనే కలిసి నటించారు. దీంతో వీళ్లిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా వర్క్ అవుట్ అయ్యింది.. ఇక తర్వాత నిజ జీవితంలో కూడా ఒక్కటి కావాలనుకున్నారు. అలా మీరిద్దరూ ఎంతోకాలం రిలేషన్షిప్ లో కూడా కొనసాగారు.. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా నడుచుకున్నారు.
Akshay Kumar: తలనొప్పిగా మారిన ‘కేసరి 2’ వివాదం.. అక్షయ్ రియాక్షన్ ఏంటంటే..?
వీరి బ్రేకప్ పై స్పందించిన రణబీర్ కపూర్ తల్లి..
అయితే ఏమైందో తెలియదు కానీ అంత ప్రేమ ఉన్న వీరిద్దరి మధ్య 2009లో విభేదాలు వచ్చాయి. దీంతో బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక వీళ్ళ బ్రేకప్ అభిమానులను కూడా ఆశ్చర్యపరిచింది. ఇక పెళ్లి కూడా చేసుకోవాలనుకున్న ఈ జంట సడన్గా విడిపోవడానికి కారణం ఏంటి అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోయారు. కానీ తాజాగా రణబీర్ కపూర్ తల్లి నీతో కపూర్ వెల్లడించారు. సిమీ గ్రేవాల్ చాట్ షో ఇండియాస్ మోస్ట్ డిజైనబుల్ త్రో బ్యాక్ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో దీపికా పదుకొనే – రణబీర్ కపూర్ రిలేషన్ పై నీతూ మాట్లాడుతూ.. రణబీర్ కి ఎంతోమంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారని నేను అనుకోను. ఎందుకంటే ఆయనకున్నది ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్. అది కూడా దీపిక. వాళ్ళ రిలేషన్ లో ఏదో మిస్సయింది. వాళ్ళ మధ్య ఏదో జరగకూడనిది జరిగింది. బహుశా వాళ్ళిద్దరూ వాళ్ళుగా లేరు. అందుకే తమ బంధాన్ని కట్ చేసుకున్నారు.ఎవరికైనా సరే రిలేషన్స్ ఉంటాయి. వాళ్ళు ముందుకు సాగిపోతారు. అయితే వాళ్ల రిలేషన్ కరెక్ట్ అయితే ఎందుకు బ్రేకప్ చెప్పుకుంటారు. అందుకే రణబీర్ ఆ రిలేషన్ లో లేడు అందుకే దీపిక కూడా నా ఇంటి కోడలు కాలేక పోయింది” అంటూ నీతూ చెప్పుకొచ్చింది. ఇకపోతే ఆ తర్వాత కాలంలో రణబీర్ ఆలియాను వివాహం చేసుకోగా.. దీపికా రన్వీర్ సింగ్ ను పెళ్లి చేసుకుంది.. ఈమెకు గత ఏడాది దువా అనే అమ్మాయి కూడా జన్మించిన విషయం తెలిసిందే.