Niharika : నిహారిక (Niharika).. ఈ పేరు చెప్పగానే అందరికీ మెగా డాటర్ నిహారిక గుర్తుకొస్తుంది. ఈమె ఇప్పుడు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకుంటోంది. ఇకపోతే ఇప్పుడు చెప్పబోయే నిహారిక ఈమె కాదు.. ఆమె సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నిహారిక N.M (Niharika NM) సోషల్ మీడియాలో పలు రీల్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈమె.. ఆ తర్వాత కాలంలో మహేష్ బాబును మొదలుకొని అడవి శేషు వరకు పలువురు స్టార్ హీరోల సినిమా ప్రమోషన్స్ లో పాల్గొనింది. అంతేకాదు క్రికెటర్స్ తో కూడా ఇంటర్వ్యూలు చేసి భారీ పాపులారిటీ సొంతం చేస్తుంది నిహారిక.
పెరుసు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన నిహారిక..
ఇక నిహారిక డిజిటల్ కంటెంట్ క్రియేటర్ గా కూడా పేరు దక్కించుకుంది. హాస్యభరితమైన ఇంస్టాగ్రామ్ రీల్స్ చేస్తూ సోషల్ మీడియా కంటెంట్ కి ప్రసిద్ధి చెందింది. వినోదాత్మక వీడియోలకు అలాగే గ్లోబల్ నెట్ఫ్లిక్స్ సిరీస్ ‘బిగ్ మౌత్’ లో కూడా కనిపించి గుర్తింపు సొంతం చేసుకుంది. అంతే కాదు పలువురు ప్రముఖులతో పాటు పలు బ్రాండ్లకు కూడా పనిచేసిన ఈమె డిజిటల్ రంగానికి విశేషమైన సేవలు అందించింది. ఈ నేపథ్యంలోని 2022 ఫోర్బ్స్ ఆసియా 30 అండర్ 30 కి గౌరవంగా ఎంపికయింది. ఇక ఈమె ఇప్పుడు నటిగా కూడా మారిన విషయం తెలిసిందే. ఇటీవల ‘పెరుసు’ అనే చిత్రంలో కూడా నటించింది.
లక్కీ ఛాన్స్ కొట్టేసిన నిహారిక..
ఈ పెరుసు మూవీ విషయానికి వస్తే.. ఇది నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమాలో ఈమె వైభవ్ సరసన నటించింది . మార్చి 14వ తేదీన విడుదలైన ఈ సినిమా వినోదం ,కుటుంబం, అంతక్రియల అంశాలతో చాలా సరదాగా హాస్య భరితమైన చిత్రంగా సాగింది. ఈ సినిమాతోనే నిహారిక తొలిసారి వెండితెర పై అడుగుపెట్టడం గమనార్హం.మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది నిహారిక. ఈ సినిమా కూడా నెట్ఫ్లిక్స్ లో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే .. ఒక గ్రామానికి పెద్దగా వ్యవహరిస్తూ ఉంటాడు పరంధామయ్య. అనుకోకుండా ఒక రోజు టీవీ చూస్తూ తుది శ్వాస విడుస్తాడు. ఆయన చావు కుటుంబానికి పెద్ద సమస్యను తెచ్చిపెడుతుంది. ఇంటి పెద్ద పోయాడనే బాధ ఒకవైపు.. ఆ సమస్య గురించి ఊరి వాళ్లకు తెలిస్తే పరువు పోతుందనే భయం మరోవైపు.. పక్కింటి వారికి విషయం పొక్కకుండా అంత్యక్రియలు నిర్వహించాలనుకుంటారు పరంధామయ్య కుమారులు స్వామి, దురై..ఆ తరుణంలో వారికి ఎలాంటి పరిణామాలు ఎదురయ్యాయి. తాము అనుకున్నట్టే తండ్రికి తుది వీడ్కోలు పలికారా? ఆయన చావుకి, కుటుంబ గౌరవానికి ఉన్న లింక్ ఏంటి? అనే విషయాలను చాలా చక్కగా చూపించారు. ఇందులో నిహారిక కూడా తన లెవల్ కి మించి నటించి ఆకట్టుకుంది. ఈ సినిమాతో భారీ గుర్తింపు తెచ్చుకోవడంతో ఇప్పుడు తెలుగులో ఒక యంగ్ హీరో సరసన హీరోయిన్గా నటించే అవకాశం ఈమెకు లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇక దీనిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Aishwarya Rajesh: ఐశ్వర్య ఫస్ట్ ఫోటో షూట్ చూశారా.. ఇలా ఉందేంటి గురూ..!