Allu Arjun – Pawan Kalyan : ప్రస్తుత కాలంలో కేవలం రాజకీయాల్లోనే కాకుండా మరోవైపు సినిమా రంగంలో కూడా పవన్ కళ్యాణ్ రాణిస్తున్నారు. సినిమాల్లో పవన్ కళ్యాణ్ రాణించటం పెద్ద విశేషం కాదు. ఎందుకంటే సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ ఏ స్థాయిలో ఉన్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఒక హిట్ సినిమా ఒక ప్లాప్ సినిమా పవన్ కళ్యాణ్ కెరియర్ ను డిజైన్ చేయదు. వరుసగా డిజాస్టర్ సినిమాలు పడినా కూడా పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ పెరిగింది తప్ప పవన్ కళ్యాణ్ రెమ్యూనరేషన్ తగ్గలేదు. అలానే పవన్ కళ్యాణ్ మార్కెట్ కూడా పెరుగుతూ వచ్చింది. 2014లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన అనే పార్టీని స్థాపించి దాదాపు 10 ఏళ్లపాటు కష్టపడి నేడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎం గా బాధ్యతలు కొనసాగిస్తున్నారు.
ఒకవైపు రాజకీయాల్లోనూ మరోవైపు సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ బిజీగా మారారు. ప్రస్తుతం హరిహర వీరమల్లు సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడు కళ్యాణ్. అయితే ఈ షూటింగ్ గ్యాప్ దొరికే తరుణంలో ఒక పొలిటికల్ మీటింగ్ కి హాజరయ్యాడు పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ లో స్వర్ణాంధ్ర – 2047 డాక్యుమెంట్ ఆవిష్కరణ సభ జరుగుతుంది. ఈ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అయితే ఈ సభ జరుగుతున్న తరుణంలో మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో అల్లు అర్జున్ ను పుష్ప సినిమా విషయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనలో భాగంగా అరెస్టు చేశారు. అయితే ఈ విషయం సభలో ఉన్న పవన్ కళ్యాణ్ కి తెలియదు. ఈ సభను కూడా కొంతమంది లైవ్ లో వీక్షిస్తున్నారు.
ఈ సభలో ఒక వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ ఏంటంటే, అల్లు అర్జున్ ను తెలంగాణ పోలీసులు అరెస్టు చేసినట్లు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పవన్ కళ్యాణ్ తో చెబుతున్నట్లు ఉన్నారు. అయితే ఆ విషయం విన్న వెంటనే పవన్ కళ్యాణ్ చాలా ఆశ్చర్యంగా అవునా అంటూ అడిగారు.? అంతేకాకుండా ఇది ఎప్పుడు జరిగింది అంటూ పవన్ కళ్యాణ్ తిరిగి ప్రశ్నిస్తున్నట్లు కూడా ఆ వీడియోలో తెలుస్తుంది. ఇప్పుడు కేవలం ఆ ఒక్క విషయం మాత్రమే ఆశ్చర్యపడేలా ఉంది అయితే చంద్రబాబు నాయుడు అదే విషయాన్ని ప్రస్తావించారా లేకపోతే ఇంకేదైనా పవన్ కళ్యాణ్ కి చెప్పారా అని చర్చలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ తరుణంలోనే పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అఫీషియల్ హేండిల్ నుంచి పవన్ కళ్యాణ్ మాట్లాడిన స్పీచ్ లో కొటేషన్స్ ను ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. దీనిని కొందరు మాట్లాడుతూ ఇది అల్లు అర్జున్ ఉదేశిస్తే చెప్పాడు అని కథనాలు ప్రచురించడం మొదలుపెట్టారు.
Also Read : Allu Arjun Arrest: భాయ్ ఇప్పుడు పోలీసులను డబ్బులిచ్చి కొంటాడా.?