BigTV English

Allu Arjun’ Statement : పోలీసులకు అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్… ఏం చెప్పారంటే?

Allu Arjun’ Statement : పోలీసులకు అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్… ఏం చెప్పారంటే?

Allu Arjun’s Statement : అల్లు అర్జున్ అరెస్ట్ తో ఇప్పుడు టాలీవుడ్ లో టెన్షన్ టెన్షన్ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి అన్న విషయం బయటకు వచ్చింది. మరి విచారణలో ఆయన ఏం చెప్పారో ఇప్పుడు తెలుసుకుందాం.


పోలీసుల విచారణలో అల్లు అర్జున్ స్టేట్మెంట్ ప్రకారం తనకు సంధ్య థియేటర్లో జరిగిన ఘటనతో ఎలాంటి సంబంధం లేదని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తను రావడం వల్ల ఈ సంఘటన జరిగింది అనేది పూర్తిగా ఆ వాస్తవమని, సినిమా విడుదల సందర్భంగా తను థియేటర్ కి రావడం సహజమేననే విషయాన్ని అల్లు అర్జున్ పోలీసుల ముందు వెల్లడించారు. నిజానికి ఇలాంటి సంఘటన జరుగుతుందని తను ఊహించలేదని, ఎందుకంటే గతంలో కూడా తాను ఎన్నో సినిమాల రిలీజ్ టైం లో థియేటర్ కు వెళ్లానని గుర్తు చేశారు అల్లు అర్జున్. గతంలోలాగే ‘పుష్ప 2’ ప్రీమియర్ షో టైంలో తాను సంధ్య థియేటర్ దగ్గరకు వెళ్లానని, అయితే సంఘటన జరిగిన చాలాసేపటికి తన వ్యక్తిగత సిబ్బంది వచ్చి ఈ విషయం చెప్పడంతో తెలిసిందని అల్లు అర్జున్ స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది.

ఇక సంధ్య థియేటర్ వద్ద జరిగిన ‘పుష్ప 2’ ప్రీమియర్ షో ఘటనలో రేవతి అనే మహిళ కన్నుమూసిన సంగతి తెలిసిందే. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో ఈ మేరకు అల్లు అర్జున్ పై 105, 118 (1 ) రెడ్ విత్ 3/5 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. నేడు విచారణ నిమిత్తం పోలీసులు అల్లు అర్జున్ ని అరెస్ట్ చేశారు.  దీంతో ప్రస్తుతం అల్లు అర్జున్ కు ఈ సెక్షన్ల ప్రకారం పదేళ్ల శిక్ష పడే అవకాశం ఉందని అంటున్నారు. మరోవైపు అల్లు అర్జున్ తరఫున న్యాయవాదులు లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.


మరోవైపు అల్లు అర్జున్ తనపై ఈ కేసును కొట్టివేయాలంటూ హైకోర్టులో క్యాష్ పిటిషన్ ను దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు నుంచి అల్లు అర్జున్ కేసు విషయంలో ఎలాంటి తీర్పు వస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు ఆయన అభిమానులు. ఈరోజు సాయంత్రం 4 గంటలకు అల్లు అర్జున్ కేసు విషయంలో న్యాయస్థానం తీర్పును వెల్లడించనుంది. మరోవైపు అల్లు అర్జున్ వస్తున్నారన్న సంగతి పోలీసులకు ముందుగానే తెలియజేస్తూ, ప్రొటెక్షన్ కావాలని కోరామంటూ ఒక లెటర్ ని రిలీజ్ చేశారు సంధ్య థియేటర్ వారు.

కొద్దిసేపటి క్రితమే పోలీసులు భారీ బందోబస్తుతో అల్లు అర్జున్ ను నాంపల్లి మెజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరు పరిచారు. మేజిస్ట్రేట్ కేసును పరిశీలిస్తోంది. అల్లు అర్జున్ అభిమానులు కూడా నాంపల్లి కోర్టు దగ్గరకు భారీగా చేరుకున్నారు. అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా భారీగా మోహరించారు. అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కేసు విషయమై ఎలాంటి తీర్పు రానుంది ? బెయిల్ వస్తుందా? లేదంటే అల్లు అర్జున్ కు 14 రోజుల రిమాండ్ తప్పదా? అనేది ఆసక్తికరంగా మారింది.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×