BigTV English
Advertisement

Rana Daggubati: రానా భార్య ఫుడ్ స్టోర్.. టమాటా కిలో రూ.4250.. అవేం రేట్లు అన్నా.. చంపేస్తావా జనాలను

Rana Daggubati: రానా భార్య ఫుడ్ స్టోర్.. టమాటా కిలో రూ.4250.. అవేం రేట్లు అన్నా.. చంపేస్తావా జనాలను

Rana Daggubati:  ఇండస్ట్రీలోని సెలబ్రిటీలు దీపం ఉండగానే  ఇల్లు చక్కబెట్టుకుంటున్నారు. సినిమాల్లో నటిస్తూనే ఇంకోపక్క హోటల్స్, జిమ్స్, రియల్ ఎస్టేట్స్ లలో పెట్టుబడులు పెట్టి రెండు చేతులా సంపాదిస్తున్నారు. ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు హోటల్స్ నడుపుతున్నారు.  అలా నడుపుతున్నవారిలో దగ్గుబాటి వారసుడు రానా ఒకడు. ఆయన కాలు పెట్టని బిజినెస్ లేదు అంతే అతిశయోక్తి లేదు. రామానాయుడు పాత ఇంటిని ఒక రెస్టారెంట్ గా మార్చేశారు.


ఇక రానా తమ్ముడు అభిరాం.. ది రైటర్స్ రూమ్ అని ఒక కేఫ్ నడుపుతున్నాడు. అందరు ఫుడ్ బిజినెస్ లో ఉంటే ఎలా అనుకున్నదో ఏమో.. రానా  భార్య మిహీకా.. ఆమె మాత్రం రెస్టారెంట్ కాకుండా ఒక ఫుడ్ స్టోర్ ను ఓపెన్ చేసింది. దాని పేరే ఫుడ్ స్టోరీస్. రానా  తన భార్య మిహీకాతో కలిసి ఈ ఫుడ్ స్టోరీస్ ను బంజారా హిల్స్ లో ప్రారంభించాడు. ఈ మధ్యనే స్టార్ సెలబ్రిటీలు అందరూ కలిసి  ఈ ఫుడ్ స్టోరీస్ ను ప్రారంభించారు.  ఇక్కడ దొరకని ఐటెం అంటూ ఉండదు. కూరగాయలు, పండ్లు, స్నాక్స్, ఫుడ్, తాగేవి.. అన్ని ఇక్కడ దొరుకుతాయి.

ఇక రానా ఫుడ్ స్టోర్ కదా.. వెళ్లి  మనం కూడా కొనేద్దాం అనుకుంటే జేబులకు చిల్లు పడడం ఖాయం. ఇది సాదాసీదా ప్రజల కోసం పెట్టిన ఫుడ్ స్టోర్ లా కనిపించడం లేదు. సాధారణంగా ఎంత పెద్ద ఫుడ్ స్టోర్  అయినా.. బయట మార్కెట్ అమ్మేదానిపై ఒక రూ. 50 రూపాయలు ఎక్కువ  ఉంటాయి. పోనీ.. ఇది ఎంతో  మంచిగా పండించి తెచ్చింది .. ఆర్గానిక్ అయితే.. ఇంకో రూ. 100 ఎక్కువ ఉంటాయి. కానీ రానా ఫుడ్ స్టోర్  లో రేట్లు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి.


The Paradise: ది ప్యారడైజ్.. రా స్టేట్మెంట్ ఇచ్చిన నాని

అంతలా రేట్లు ఉన్నాయి. ఒక కిలో టమోటా.. బయట  రూ. 20 నుంచి రూ 50 ఉంటే.. ఫుడ్ స్టోరీస్ లో కిలో టమోటా అక్షరాలా రూ.4250 ఉంది.  ఏంటి.. టమాటాలు కిలో నాలుగు వేలా.. ? ఇదెక్కటి విడ్డూరం అమ్మా అని నోళ్లు నొక్కుకుంటే ఎలా.. ఇంకా ఉన్నాయి. ఒక కొబ్బరిబొండం  రూ. 1000 అంట. ఒక గ్లాస్ చెరుకురసం రూ.250 అంట. ఇక చాలు. ఇప్పటికే మా గుండెలు పగిలిపోతున్నాయి అని అంటారా.. ?  అందుకే ఈ ఫుడ్ స్టోరీస్ కేవలం సెలబ్రిటీలకు మాత్రమే అని చెప్పింది.

ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు హెల్త్ మీద చాలా ఫోకస్ పెడుతున్నారు. బయట ఏది కొనకుండాస్ ఆర్గానిక్ మాత్రమే తీసుకుంటున్నారు. అలాంటివారి కోసమే ఈ  స్టోర్ ను ఓపెన్ చేసినట్లు కనిపిస్తుంది రానా. ఎంతమందిరం సెలబ్రిటీలు తీసుకున్నా.. కనీసం ఆ స్టోర్ కు చుట్టుపక్కల ఉన్నవారు అయినా తీసుకోవడానికి లేకపోయింది. మరీ ఇంత ఇంత రేట్లు పెట్టి జనాలు కొనగలరా రానా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×