BigTV English

Balakrishna : ఛీ ఛీ బాలయ్య ఇవేం పనులు.. పద్మభూషణ్ వెంటనే వెనక్కి తీసుకోవాలి..!

Balakrishna : ఛీ ఛీ బాలయ్య ఇవేం పనులు.. పద్మభూషణ్ వెంటనే వెనక్కి తీసుకోవాలి..!

Balakrishna : ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత, హోస్ట్ గా పేరు సొంతం చేసుకున్న బాలకృష్ణ (Balakrishna) కు ఇటీవల ‘పద్మభూషణ్’ అవార్డు వచ్చి చేరిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. భారత ప్రభుత్వం అందించే అత్యుత్తమ పౌర పురస్కారాలలో పద్మభూషణ్ మూడవ స్థానాన్ని సొంతం చేసుకుంది. ఏ రంగంలోనైనా సరే ఉన్నత స్థాయి విశిష్ట సేవలకు గానూ ఈ అవార్డుతో కేంద్ర ప్రభుత్వం సత్కరిస్తుంది. అలా దేశంలో మూడో అత్యున్నత అవార్డు అందుకున్న బాలయ్య తాజాగా ఒక మద్యం కంపెనీకి సంబంధించిన యాడ్లో నటించడంతో ఆయనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. ఇకపోతే బాలయ్య ఇప్పటికే పలు వేదికల మీద తాను మద్యం తీసుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే.


బాలయ్య పై ట్రోల్స్.. పద్మ భూషణ్ వెనక్కి తీసుకోవాలంటూ..

అంతేకాదు ఎన్నోసార్లు ఆయన కుర్చీ పక్కనే మద్యం మిక్స్ చేసిన బాటిల్ కనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి అని నెటిజెన్స్ కామెంట్లు చేస్తూ ఉంటారు. అటు ఓటీటీలో కూడా బాలయ్య చేసిన టాక్ షో కి తనకు ఇష్టమైన బ్రాండ్ కంపెనీని ఆయన స్పాన్సర్ చేశారు. అలా బాలయ్యకి ఆ బ్రాండ్ తో మంచి అనుబంధము ఉంది. అంతవరకు పర్వాలేదు అయితే ఇప్పుడు అదే బ్రాండ్ కి ఆయన ప్రచారకర్తగా ఒక యాడ్ షూట్ చేసి, సంతోషంగా దిల్ ఓపెన్ చేసి మద్యం తాగేయండి అంటూ వీడియో విడుదల చేశారు. సాధారణంగా సినీ నటులు ఇలాంటి యాడ్స్ చేస్తే ఎవరూ పెద్దగా తప్పుపట్టారు. ఎందుకంటే ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు ఇలా బ్రాండ్స్ ని ప్రమోట్ చేశారు. కానీ వారందరితో బాలయ్యను ప్రస్తుతం పోల్చలేము కదా.. ఎందుకంటే ఆయన ఒక ఎమ్మెల్యే అంతకుమించి పద్మభూషణ్ అవార్డు గ్రహీత కూడా.. పేరు పక్కన అంతటి గౌరవం లభించిన తర్వాత కొంతైనా బాధ్యతగా వ్యవహరించాలని అటు అభిమానులతో పాటు ఇటు ప్రజలు కూడా కోరుకుంటున్నారు. బాలయ్యను అభిమానించేవారు ఎంతోమంది ఆయన అడుగుజాడల్లోనే నడవాలని కోరుకుంటూ ఉంటారు. అయితే అలాంటి ఈయన సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి బ్రాండ్లకు ప్రమోటర్ గా మారారు అని ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంకొంతమంది బాలయ్యకు కావాల్సినంత డబ్బు, పేరు, పలుకుబడి, హోదా అన్నీ ఉన్నాయి కదా.. అయినా సరే ఇలాంటి హానికరమైన ఉత్పత్తులను ఆయన ఎందుకు ప్రమోట్ చేస్తున్నారు.. దీన్ని బట్టి చూస్తే ఆయన బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తున్నారు. వెంటనే పద్మభూషణ్ వెనక్కి తీసుకోండి అంటూ మరికొంతమంది కాస్త ఘాటుగానే స్పందిస్తున్నారు. మరి ఇప్పటికైనా బాలయ్య ఇలాంటివి ప్రమోట్ చేయకుండా ఉంటారేమో చూడాలి.


బాలకృష్ణ సినిమాలు..

ఇక బాలకృష్ణ సినిమాల విషయానికి వస్తే.. ఈ ఏడాది ‘డాకు మహారాజ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బాలయ్య.. ఇప్పుడు ‘అఖండ 2’ సీక్వెల్ షూటింగ్ లో బిజీగా పాల్గొంటున్నారు. దీనికి తోడు కోలీవుడ్లో రజనీకాంత్ (Rajinikanth) హీరోగా నటిస్తున్న ‘జైలర్ 2’ లో కూడా కీలక పాత్ర పోషిస్తున్న బాలయ్య.. అలాగే అధిక్ రవిచంద్రన్ తో కూడా సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక అన్ని నిజమైతే బాలయ్య ఇటు టాలీవుడ్ కంటే అటు కోలీవుడ్ లోనే ఎక్కువ అవకాశాలు అందుకునేటట్టు కనిపిస్తోందని చెప్పవచ్చు.

ALSO READ:Bollywood: రామాయణలో టాలీవుడ్ బ్యూటీ.. ఎవరు? పాత్ర ఏంటో తెలుసా?

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×