Single Movie Dialogues :..టాలీవుడ్ యంగ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న శ్రీ విష్ణు (Sri Vishnu) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కథ, కామెడీ ప్రధానంగా సాగే ఈయన సినిమాలు.. ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా తన ప్రతి చిత్రంతో కూడా భారీ హిట్ అందుకునే ప్రయత్నం చేస్తున్న ఈయన.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే చివరిగా ఓం భీమ్ భుష్, స్వాగ్ వంటి చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అటు ఈ చిత్రాలకు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. ఇకపోతే ఇప్పుడు కార్తీక్ రాజు (Karthik Raju) దర్శకత్వంలో ‘సింగిల్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు శ్రీ విష్ణు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీత ఆర్ట్స్, కల్యా ఫిలింస్ బ్యానర్లపై అల్లు అరవింద్ సమర్పించగా.. విద్య కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మించారు. ఈ చిత్రంలో శ్రీ విష్ణు సరసన యంగ్ బ్యూటీ కేతికా శర్మ (Kethika Sharma) తో పాటు లవ్ టుడే (Love Today) హీరోయిన్ ఇవానా (Ivana)కూడా నటించింది. ఇక ప్రముఖ నటుడు వెన్నెల కిషోర్ (Vennela kishor) కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే.
మంచు విష్ణు దెబ్బకు డైలాగ్స్ మార్చేసిన శ్రీ విష్ణు..
ఇదిలా ఉండగా ఈ సినిమా నుండి ట్రైలర్ విడుదల చేసినప్పుడు.. కొన్ని మెయిన్ చిత్రాలలోనే డైలాగ్స్ ట్రైలర్ చివర్లో చూపించడం జరిగింది. అందులో కన్నప్ప (Kannaappa ) సినిమా నుండి మంచు విష్ణు(Manchu Vishnu) ‘శివయ్యా ‘ అని అరిచే డైలాగ్ కూడా ఉంది. దానిని కామెడీగా చూపించారు. దీంతో హర్ట్ అయినా మంచు విష్ణు, ఆయన అభిమానులు పెద్ద ఎత్తున ఫైర్ అవుతూ కామెంట్లు చేశారు. దీంతో దిగివచ్చిన శ్రీ విష్ణు తన సినిమాలో వాడిన డైలాగ్స్ ని మార్చేశారు. “శివయ్యా అనే డైలాగు ప్లేస్ లో భగవంతుడా.. మంచు కురిసిపోతావ్ ప్లేస్ లో మట్టి కరిచిపోతావు” అంటూ డైలాగ్స్ ను మార్చేశారు. మొత్తానికైతే మంచు విష్ణు దెబ్బకు శ్రీ విష్ణు దిగివచ్చి తన సినిమాలో డైలాగ్స్ ని మార్చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
ట్రైలర్ లో ఏముందంటే..?
ట్రైలర్ విషయానికి వస్తే.. సింగిల్స్ కోసం ప్రత్యేకంగా ట్రైలర్ కట్ చేసినట్టు అనిపించింది. ఈ టైలర్ తోనే శ్రీ విష్ణు చిక్కుల్లో పడ్డారు. సింగిల్ ట్రైలర్లో పలు చిత్రాలకు సంబంధించిన రెఫరెన్స్లను వాడారు. యానిమల్ చిత్రంలోని చివర్లో రణబీర్ కపూర్ సీన్ తోపాటు బాలయ్య , హనీరోజ్ గురించి మాట్లాడిన మాటలు, కన్నప్పలో మంచు విష్ణు శివయ్య అని అరిచే అరుపులు, కమల్ హాసన్ గుణ కేవ్స్ చిత్రంలోని డైలాగు ఇలా చాలా సినిమాల నుండి చాలా రెఫరెన్స్లను తమ సినిమాలో వాడారు. అయితే అవన్నీ నార్మల్ యూత్ ని దృష్టిలో పెట్టుకొని, హెల్తీ కంటెంట్ ను, కామెడీని జనరేట్ చేసేందుకు మాత్రమే వాడామని , ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూలలో శ్రీవిష్ణు చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయినా సరే మంచు విష్ణు అభిమానులు చల్లారకపోవడంతో ఏకంగా ఆ డైలాగ్ లనే మార్చేశారు. ఇక ప్రస్తుతం మార్చిన డైలాగ్స్తోనే సినిమాను విడుదల చేయడం జరిగింది.