Kannappa Dubbing: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa) ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. శివుడికి అత్యంత భక్తుడైన భక్తకన్నప్ప జీవితం ఆధారంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించగా మోహన్ బాబు నిర్మాణంలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఈ నెల 27వ తేదీ విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా ఏకకాలంలో తెలుగు, హిందీ ,తమిళ్,
కన్నడ, మలయాళ భాషలలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇతర భాష సెలబ్రిటీలు కూడా ఈ సినిమాలో భాగమయ్యారు.
టెక్నాలజీ వాడేస్తున్న విష్ణు..
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో కనిపించగా సీనియర్ నటి కాజల్ అగర్వాల్ పార్వతీ పాత్రలో సందడి చేశారు. ఇక ప్రభాస్ కూడా ఈ సినిమాలో రుద్ర పాత్ర ద్వారా ప్రేక్షకులను సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇక మోహన్ బాబు, బ్రహ్మానందం వంటి వారు కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదల కాబోతున్న నేపథ్యంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటూ వస్తున్నారు. ఈనెల 20వ తేదీలోపు ఫస్ట్ కాపీ కూడా వచ్చేస్తుందని మంచు విష్ణు తెలియజేశారు.
ఏఐ టెక్నాలజీ…
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా మంచు విష్ణు మాట్లాడుతూ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలదరూ కూడా బాగమయ్యారు. అయితే వీరి పాత్రలకు సంబంధించి ఇతర భాషలలో డబ్బింగ్ కూడా పూర్తి అయిందని, అయితే డబ్బింగ్ ఈసారి మనుషుల ద్వారా కాకుండా, అభివృద్ధి చెందిన టెక్నాలజీ ద్వారా డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్టు మంచు విష్ణు వెల్లడించారు. ఈ సినిమాలో లీడ్ క్యారెక్టర్లకు సంబంధించిన డబ్బింగ్ మొత్తం అడ్వాన్స్డ్ ఏఐ టెక్నాలజీని(AI Technology) ఉపయోగించుకొని డబ్బింగ్ పూర్తి చేసినట్టు విష్ణు తెలిపారు.
The voices of all lead actors in #Kannappa have been dubbed into other languages using advanced AI technology.
:- #VishnuManchu@iVishnuManchu pic.twitter.com/tSpk7Zw4AK
— Milagro Movies (@MilagroMovies) June 3, 2025
ఇలా ఏఐ టెక్నాలజీ ఉపయోగించి డబ్బింగ్ పనులు పూర్తి చేసినట్టు తెలియజేయడంతో మంచు విష్ణు టెక్నాలజీని భారీగా ఉపయోగిస్తున్నారు అంటూ కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇక ఈ సినిమాపై ఇప్పటికే ఒకవైపు మంచి పాజిటివ్ బజ్ ఏర్పడగా కొంతమంది మాత్రం ఈ సినిమా విషయంలో విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. ఇకపోతే గత కొద్ది రోజులుగా కన్నప్ప సినిమా ఏదో ఒక విషయం ద్వారా వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఇక ఈ సినిమాకి సంబంధించి ఒక హార్డ్ డిస్క్ కూడా మిస్ అయిందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ కూడా హార్డ్ డిస్క్ దొరకలేదని, అందులో ఉన్న కంటెంట్ బయటకు లీక్ చేయకుండా ఉంటే సినిమాకు ఏ విధమైనటువంటి సమస్య ఉండదని విష్ణు వెల్లడించారు. ఇటీవల కాలంలో మంచు విష్ణు తన సినిమాల ద్వారా సరైన సక్సెస్ మాత్రం అందుకు లేకపోయారు. మరి కన్నప్ప సినిమా మంచు విష్ణుకు పాన్ ఇండియా స్థాయిలో ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.