Trinath Rao nakkina:తెలుగు సినీ పరిశ్రమ.. ఒకప్పుడు తెలుగు సినిమా పరిశ్రమ అంటే చిన్నచూపు చూసిన ఎన్నో పరిశ్రమలు నేడు తెలుగు సినిమాలో ఒక్కసారైనా నటించాలని, అలా నటిస్తే జీవితం ధన్యం అవుతుంది అనే భావించేవారు కోకొల్లలు. ముఖ్యంగా బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో బడా స్టార్ హీరోలుగా పేరు దక్కించుకొని, ఇండియన్ బాక్సాఫీస్ వద్ద వేలకోట్ల రూపాయల కలెక్షన్స్ వసూలు చేస్తూ.. సరికొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న వారు కూడా.. తెలుగు సినిమాలో నటించడానికి తాపత్రయపడుతున్నారు. దీనికి తోడు మన టాలీవుడ్ డైరెక్టర్లు తమకోసం కాకుండా.. తెలుగు సినిమా పరిశ్రమ ఖ్యాతిని పెంచేలా కష్టపడుతూ.. తెలుగు సినిమా ఖ్యాతిని.. ప్రపంచం సైతం అభిమానించేలా తమ సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ అంటేనే మహిళలకు భద్రత ఉండదు అని ఎంతోమంది జస్టిస్ హేమా కమిటీ లాంటివి వేసి మరీ తమ సమస్యలను చెప్పుకుంటుంటే.. టాలీవుడ్ సినీ పరిశ్రమ మాత్రం ఆడవారికి గౌరవాన్ని ఇస్తూ.. అసలు ఆడవారు తల్లులతో సమానం అనేలా వారికి అన్ని మర్యాదలు కలిగిస్తోంది. అందుకే తెలుగు సినీ ఇండస్ట్రీలో పనిచేయడానికి ఎంతో మంది ఆడవారు కళ్ళు మూసుకొని మరీ వచ్చేస్తున్నారు. ఒక ఇండియా నుంచే కాదు.. హాలీవుడ్ హీరోయిన్స్ సైతం తెలుగులో నటించడం కోసం ఎన్ని కష్టాలు పడుతున్నారో అర్థం అవుతోంది. ఇలాంటి ఎంతో గుర్తింపు ఉన్న తెలుగు పరిశ్రమలో.. కొన్ని చీడపురుగులు తెలుగు సినిమా పరిశ్రమను ఉన్నఫలంగా దిగజార్చుతున్నాయి అని చెప్పవచ్చు.
అలాంటి వారిలో డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న త్రినాథ రావు నక్కిన (Trinadha Rao Nakkina)ఒకరు. తాజాగా ఇతడు దర్శకత్వం వహించిన ‘మజాకా’ సినిమా టీజర్ లాంచ్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సినిమాలో సందీప్ కిషన్ (Sandeep Kishan) హీరోగా నటిస్తూ ఉండగా.. రీతూ వర్మ (Rithu Varma) హీరోయిన్గా నటిస్తోంది. అంతేకాదు నాగార్జున (Nagarjuna) హీరోగా నటించిన ‘మన్మధుడు’ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో కనిపించిన అన్షు అంబానీ(Anshu Ambani) కూడా రీఎంట్రీ ఇచ్చింది. ఈమెకు జోడిగా రావు రమేష్ (Rao Ramesh) నటిస్తున్నారు. ఇకపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఉన్న గౌరవంతోనే దాదాపు 22 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు తెరకు రీ ఎంట్రీ ఇస్తున్న ఈమె గురించి, ఈ డైరెక్టర్ చేసిన కామెంట్లు నెటిజన్స్ లోనే కాదు ఈ కామెంట్స్ విన్న ప్రతి ఒక్కరిలో కూడా రక్తం మరిగేలా చేస్తున్నాయి.
త్రినాథ రావు నక్కిన ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ లో అన్షు అంబానీని ఉద్దేశిస్తూ చేసిన కామెంట్లకు నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు. త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ.. “ఒకప్పుడు అన్షు అంబానీ చాలా బొద్దుగా ఉండేది. కానీ ఇప్పుడు చాలా బక్కగా మారిపోయింది. కొంచెం తిని బాగా పెంచమ్మా.. తెలుగు వాళ్లకు అన్నీ పెద్దవిగా ఉండాలి అని నేను చెప్పాను” అంటూ చాలా వల్గర్ గా మాట్లాడారు. ఇది విన్న నెటిజన్స్ ఒక్కసారిగా ఊగిపోతూ..ఇతడిని తెలుగు ఇండస్ట్రీ నుంచి అర్జెంటుగా బహిష్కరించాలి. ఆడవారిని చులకనగా చేసి మాట్లాడుతున్న నేపథ్యంలో కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని, ఇతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు తెలుగు సినీ పరిశ్రమ నేడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్న నేపథ్యంలో తెలుగు నుంచి వచ్చే సినిమాలు భారతీయ సినిమా ఇండస్ట్రీ రూపురేఖలు మారుస్తున్న నేపథ్యంలో.. ఇలాంటి పనికిమాలిన వ్యక్తుల వల్ల టాలీవుడ్ పరిశ్రమ అంతకంతకు దిగజారిపోతోంది . అసలు వీడిని మనిషి అనడానికి కూడా నోరు రావడం లేదు. వీడికంటే పశువు నయం..అని కామెంట్లు చేస్తున్నారు. అక్కడితో ఆగకుండా..” నువ్వు పంది బలిసినట్టు బలిసినా.. ఇండస్ట్రీలో నిన్ను ఎవరు ఏమి అనలేదు.నిన్ను బాడీ షేమింగ్ కూడా చేయలేదు. అది తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న సంస్కారం. కానీ నువ్వు మాత్రం తెలుగు ఇండస్ట్రీలో గౌరవం లభిస్తుంది అని వచ్చిన ఒక అమ్మాయి పట్ల ఇంత నీచంగా దిగజారిపోయి మాట్లాడటం ఏంటి? అంటూ నెటిజన్లు త్రినాధరావును తమదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు
అసలు వీడు మనిషేనా ? ఇలాంటి మాటలు ఎలా వస్తాయి.. ఒక అమ్మాయి గురించి మాట్లాడేటప్పుడు నీ తల్లి కూడా ఒక ఆడదే అని మరిచిపోయావా.. ? తూ..నీది ఒక బ్రతుకేనా.. తెలుగు ఇండస్ట్రీ అంటే సంస్కారానికి పుట్టినిల్లు. అలాంటి ఈ తెలుగు సినిమా పరిశ్రమలో నువ్వు ఒక కలుపు మొక్కలా అవతరించావు. తక్షణమే ఇలాంటి కలుపు మొక్కను తొలగించకపోతే తెలుగు సినిమా పరిశ్రమకే కళంకం. నీలాంటి వాళ్ల వల్ల ఎవరికి ప్రయోజనం లేదు పైగా నీలాంటి వాళ్ల వల్ల తెలుగు సినిమా సంస్కారం కోల్పోతోంది. దిగజారి పోతోంది. తక్షణమే ఇలాంటి వాళ్లను బహిష్కరించండి అంటూ ఒక రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నెటిజన్స్.<V
హీరోయిన్ అన్షుపై డైరెక్టర్ అసభ్యకర వ్యాఖ్యలు… వైరల్..!
‘మన్మథుడు’ ఫేమ్ అన్షుపై అసభ్యకర వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ త్రినాథరావు నక్కిన
తాజాగా ‘మజాకా’ సినిమా ఈవెంట్లో మాట్లాడిన డైరెక్టర్ త్రినాథరావు
అన్షు సన్నబడింది.. తిని పెంచమ్మా.. కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పానంటూ… pic.twitter.com/ScOWMIIZIT
— BIG TV Breaking News (@bigtvtelugu) January 12, 2025
/p>