మూవీ : మన ఇద్దరి ప్రేమ కథ
నటీనటులు : ఇక్బాల్, మోనికా, ప్రియా జస్పర్ తదితరులు
దర్శకత్వం : ఇక్బాల్
సంగీతం : రాయన్
Mana Iddari Prema Katha Review : ఎప్పటిలాగే ఈ శుక్రవారం కూడా పలు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. తాజాగా రిలీజ్ అయిన అరడజను సినిమాలలో ఇక్బాల్ దర్శకత్వం వహించిన ‘మన ఇద్దరి ప్రేమ కథ’ మూవీ కూడా ఒకటి. ఈ సినిమాలో స్వయంగా ఆయనే హీరోగా నటించడంతో పాటు, దర్శకత్వం వహించి, నిర్మించిన ఈ మూవీ ఎలా ఉందో రివ్యూలో తెలుసుకుందాం.
కథ
నాని (ఇక్బాల్) ఒక అనాథ. ఆయన శృతి (మోనికా) అనే అమ్మాయి ప్రేమలో పడతాడు. శృతికి నాని ప్రపోజ్ చేయడం, ఆమె యాక్సెప్ట్ చేయడం జరిగిపోతుంది. ఆ తరువాత ఇద్దరూ కలిసి బీచ్ కి వెళ్లాలని నిర్ణయించుకుంటారు. ఇక్కడే కథలో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంటుంది. లవ్ బర్డ్స్ నాని, శృతి బంధంలోకి అను (ప్రియా జస్పర్) అనే అమ్మాయి ఎంట్రీ ఇస్తుంది. ఆమె రాకతో ఇద్దరి మధ్య మనస్పర్థలు ఎదురవుతాయి. మరోవైపు నాని, అను కలిసి ఉన్న సన్నిహిత వీడియో లీక్ అయ్యి, వైరల్ అవుతుంది. దీంతో గ్రామస్తులు వీరిద్దరికీ పెళ్లి జరిపిస్తారు. మరి ప్రేమించిన శృతిని వదిలి అనును పెళ్లి చేసుకున్న నాని పరిస్థితి ఏంటి? పెళ్ళయింది కాబట్టి అనుతో కాపురం చేశాడా? శృతి పరిస్థితి ఏంటి ? క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఏంటి? అనే ఆసక్తికర అంశాలు తెలియాలంటే ఈ సినిమాను థియేటర్లలో చూడాల్సిందే.
విశ్లేషణ
డైరెక్టర్, హీరో అయిన ఇక్బాల్ కథను నడిపించిన తీరును మెచ్చుకోవాల్సిందే. పక్కింటి అబ్బాయి రోల్ లో ఇక్బాల్ నటన ఆకట్టుకుంటుంది. ఎమోషన్స్ ను బాగా పండించాడు. అలాగే సహజంగా నటించాడు. ఇక హీరోయిన్ ప్రియా జస్పర్ తెరపై అందంగా కన్పించింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించింది. మరో హీరోయిన్ మోనికా మాజీ ప్రేమికురాలి పాత్రలో పరవాలేదు అన్పించింది.
ఇక ఈ సినిమాలో మైనస్ పాయింట్స్, ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే… ఒకవైపు హీరోగా, మరోవైపు దర్శకుడిగానూ ఇక్బాల్ చేసిన ప్రయత్నం అభినందనీయం అని చెప్పాలి. ‘మన ఇద్దరి ప్రేమకథ’ అనేది మెసేజ్ ఓరియెంటెడ్ లవ్ స్టోరీ. క్లైమాక్స్ లో ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించే ప్రయత్నం చేశాడు. రియలిస్టిక్ స్టోరీతో సినిమాను తెరకెక్కించడం బాగుంది. సంగీత దర్శకుడు రాయన్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్. సినిమాటోగ్రఫీ పనితనం మెచ్చుకోవాల్సిందే. సహజమైన లొకేషన్లను చక్కగా తెరపై చూపించారు. ఎడిటర్ కత్తెరకు ఇంకాస్త పదును పెడితే బాగుండేది. లో బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నిర్మాణ విలువలు పర్లేదు అన్పిస్తుంది.
Read Also : ‘జువెల్ థీఫ్- ది హీస్ట్ బిగిన్స్’ మూవీ రివ్యూ
చివరగా
లవ్ స్టోరీలను ఇష్టపడే వారు ఈ వారం వచ్చిన అరడజను సినిమాలలో ఓసారి చూడాల్సిన చిత్రం ‘మన ఇద్దరి ప్రేమకథ’.
Mana Iddari Prema Katha Rating : 2.5/5