Virupaksha Sequel Update:మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అద్భుతమైన నటనతో ఎన్నో చిత్రాలలో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈయన సడన్గా యాక్సిడెంట్ కి గురైన విషయం తెలిసిందే. ఇక ఆ యాక్సిడెంట్ తో కొద్దిరోజులు కోమాలోకి కూడా వెళ్లిపోయారు. ఆ తర్వాత అభిమానులు, సన్నిహితులు , శ్రేయోభిలాషులు, కుటుంబ సభ్యుల ప్రార్ధనల మేరకు దేవుడి దయతో సురక్షితంగా ఇంటికి చేరుకున్నారు. ఇక తర్వాత తన మేనమామ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో కలిసి బ్రో(BRO )సినిమా చేశారు. కానీ ఇది ఆకట్టుకోలేదు. ఇక తర్వాత విరూపాక్ష (Virupaksha) అనే సినిమా చేసి భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు సాయి ధరంతేజ్ .ఇందులో ప్రముఖ బ్యూటీ సంయుక్త మీనన్ (Samyuktha Menon) హీరోయిన్గా నటించింది. ఇకపోతే విరూపాక్ష సక్సెస్ కావడంతో ఈ సినిమా సీక్వెల్ కూడా మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ సీక్వెల్ కి సంబంధించిన అప్డేట్ ఒకటి సోషల్ మీడియాలో ఆసక్తికరంగా మారింది.
విరూపాక్షా సీక్వెల్ లో అవకాశం..
అసలు విషయంలోకి వెళ్తే.. కార్తీక్ వర్మ దండు (Karthik Varma Dandu) దర్శకత్వంలో సాయిధరమ్ తేజ్ నటించిన మిస్టికల్ థ్రిల్లర్ మూవీ విరూపాక్ష. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్లు కాబట్టి సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar ) స్క్రీన్ ప్లే అందించగా.. ఎస్ వి సి సి బ్యానర్ పై బి వి ఎస్ ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మించారు. అజనీష్ లోకనాథ్ ఈ సినిమాకు స్వరాలు అందించారు. ఇప్పుడు ఈ బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ ని మేకర్స్ ధ్రువీకరించారు. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయి. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం..ఇందులో ప్రముఖ నటి భాగ్యశ్రీ బోర్సే (Bhagya Sri Borse) ఆన్ బోర్డులో ఉన్నట్లు సమాచారం. రానున్న రోజుల్లో ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ వెల్లడించే అవకాశం ఉంది. ఏది ఏమైనా భాగ్యశ్రీ బోర్సేకి ఇప్పుడు ఈ సినిమాలో అవకాశం లభించింది అంటూ వస్తున్న వార్తలలో నిజానిజాలు తెలియాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే అమ్మడి అదృష్టం మారిపోవడం ఖాయమని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. ఇక సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం ‘సంబరాల యేటిగట్టు’ అనే సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు.
భాగ్యశ్రీ సినిమాలు..
ఒక భాగ్యశ్రీ సినిమాల విషయానికి వస్తే.. పూణేకి చెందిన ఈమె మోడల్ గా కెరియర్ ఆరంభించి, ఆ తర్వాత హిందీ చిత్రం ‘యారియన్ 2’ సినిమాతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఇక తెలుగులో ప్రముఖ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) దర్శకత్వంలో మాస్ మహారాజా రవితేజ (Raviteja) కాంబినేషన్లో 2024లో విడుదలైన ‘మిస్టర్ బచ్చన్’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమాలో తన పాత్రకు తానే స్వయంగా డబ్బింగ్ చెప్పుకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) సరసన కింగ్డమ్ (Kingdom) అనే సినిమాలో నటిస్తోంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కాబోతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సినిమా విడుదల కాకముందే అప్పుడే మరో సినిమాలో అవకాశం వచ్చినట్లు సమాచారం.
ALSO READ:Hyper Aadi: ఆది మోసం చేశాడు.. పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన దీపు..!