BigTV English

Bumrah Inhuman Act: బుమ్రాకు మానవత్వం లేదు మ్యాచ్‌లో అలాగేనా ప్రవర్తించేది.. నెటిజెన్లు ఫైర్

Bumrah Inhuman Act: బుమ్రాకు మానవత్వం లేదు మ్యాచ్‌లో అలాగేనా ప్రవర్తించేది.. నెటిజెన్లు ఫైర్

Bumrah Inhuman Act| ఇండియన్ క్రికెట్ లో మంచి క్రేజ్ ఉన్న బౌలర్ జస్ప్రీత్ బుమ్రాపై తాజాగా వివర్శలు వెలువెత్తుతున్నాయి. ఇటీవల జరుగుతున్న ఐపిఎల్ టోర్నమెంట్ లో అతని ప్రవర్తన అమానవీయంగా ఉందని నెటిజెన్లు పోస్ట్ లు చేస్తున్నారు. ప్రస్తుతం ముంబై ఇండియన్స్ జట్టులో కీలక బౌలర్ గా రాణిస్తున్న బుమ్రా చాలా కాలం గాయాల కారణంగా క్రికెట్ కు దూరంగా ఉంటూ ఐపిఎల్ తో రీ ఎంట్రీ ఇచ్చాడు.


బుమ్రా ఆడిన ఐపిఎల్ 2025 మ్యాచ్‌లలో ముంబై ఇండియన్స్ మూడు మ్యాచ్ లు గెలిచింది. అయితే బుధవారం ముంబై ఇండియన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య జరిగిన మ్యాచ్ లో బుమ్రా బౌలింగ్ చేశాక అతను సదరు బ్యాటర్ కు గాయమైతే కనీసం వెళ్లి చూడకుండా ఏమీ పట్టనట్లు తిరిగి తన బౌలింగ్ మార్క్ కు వచ్చేశాడు. ఇదే అతడు చేసిన తప్పుగా క్రికెట్ అభిమానులు దుమ్మెత్తి పోస్తున్నారు.

మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటింగ్ చేస్తుండగా.. ముంబై ఇండియన్స్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ నేపథ్యంలో తొలి ఇన్నింగ్స్ 13వ ఓవర్ బౌలింగ్ కు పేస్ బౌలర్ బుమ్రా వచ్చాడు. అవతల క్రీజ్ లో బ్యాటింగ్ చేస్తున్నది హైదరాబాద్ బ్యాటర్ అభినవ్ మనోహర్. తొలి బంతి వేయగానే అభినవ్ సిక్స్ కొట్టాడు. రెండో బాల్ బుమ్రా చాలా ఫాస్ట్ గా నడుము ఎత్తులో హై ఫుల్ టాస్ బాల్ వేశాడు. బాల్ నేరుగా వెళ్లి అభినవ్ కడుపుకి బలంగా తాకింది. దీంతో ఒక్కసారిగా అభినవ్ కుప్పకూలిపోయాడు. కానీ బుమ్రా మాత్రం తనకేమీ పట్టన్నట్లు వెనుతిరిగాడు. కనీసం అతని ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ లో కూడా మార్పు రాలేదు. బుమ్రా వెనక్కు వచ్చి నేరుగా తన బౌలింగ్ మార్క్ వద్ద నిలుచున్నాడు.


సాధారణంగా అలా బలంగా బ్యాటర్ కు గాయమైతే బాల్ వేసిన బౌలర్ వెంటనే వెళ్లి పరామర్శిస్తాడు. అయితే బుమ్రా అలా చేయలేదు. ఇదే క్రికెట్ అభిమానులకు కోపం తెప్పించింది. అందుకే సోషల్ మీడియా వేదికగా బుమ్రా తీరుపై మండిపడుతున్నారు. సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్ లో దీనిపై చాలా మంది పోస్ట్ లు చేశారు.

 

సోషల్ మీడియాలో నెటిజెన్లు రియాక్షన్స్

“సారీ బుమ్రా అది సోర్స్ స్పిరిట్ కాదు. ఇంతకుముందు కూడా చాలా సార్లు చూశాను. ఎదుటి బ్యాటర్ సిక్స్ కొడితే బుమ్రాకు కోపం వచ్చేస్తుంది. ఇంతకుముందు కరుణ్ నాయర్, ఇప్పుడు అభినవ్ మనోహర్. ఇది కరెక్ట్ కాదు.” అని ఒక అభిమాని కామెంట్ చేశాడు.

మరొక ఐపిఎల్ మహిళఆ ఫ్యాన్ అయితే.. ” మిగతా బౌలర్లు అలా చేయరు. బ్యాటర్ గాయపడితే వెంటనే వెళ్లి అతడిని పరామర్శిస్తారు. బుమ్రా కూడా అలా చేయాల్సింది. చాలా తప్పు.” అని పోస్ట్ పెట్టింది. ఇలా చాలా మంది బుమ్రా తీరుని విమర్శించారు.

Also read: హైదరాబాద్ మెట్రోలో రోహిత్ శర్మ ఫ్యాన్స్ రచ్చ…హిట్ మ్యాన్ అంటూ

మరోవైపు బుమ్రా టి20 క్రికెట్ లో 300 వికెట్లు తీశాడు. దీంతో ఈ రికార్డ్ సాధించిన నాలోగో బౌలర్ గా నిలిచాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో సన్ రైజర్స్ హైదరాబాద్ తో జరిగిన ఐపిఎల్ మ్యాచ్ లో బుమ్రా ఈ రికార్డ్ సాధించాడు. అయితే ఈ రికార్డ్ సాధించడానికి బుమ్రాకు 238 మ్యాచ్ లు ఆడాల్సి వచ్చింది. ఇప్పటివరకు 300 వికెట్లు తీసిన బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ (315 వికెట్లు -331 మ్యాచ్ లలో), భువనేశ్వర్ కుమార్ (318 వికెట్లు – 302 మ్యాచ్ లు), యుజ్వేంద్ర చాహల్ (300 వికెట్లు – 373 మ్యాచ్ లలో) ఉండగా.. ఈ జాబితా లో బుమ్రా కూడా చేరాడు. ఈ మ్యాచ్ లో బుమ్రాలో నాలుగు ఓవర్లు బౌల్ చేసి 39 పరుగులు ఇచ్చాడు. అయితే మ్యాచ్ లో ప్రమాదకరంగా మారిన క్లాసెన్ వికెట్ పడగొట్టాడు. ఇప్పటివరకు బుమ్రా ముంబై ఇండియన్స్ తరపున ఐపిఎల్ 2025లో మొత్తం 5 వికెట్లు తీయగా.. అతని యావరేట్ 31.60 ఉంది. బెస్ట ఫిగర్ ఒక మ్యాచ్ లో 25 రన్స్ ఇచ్చి రెండు వికెట్లు తీశాడు.

ముంబై ఇండియన్స్ జట్టు కోసం అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా లసిత్ మలింగా (170 వికెట్లు) తీశాడు. అతని రికార్డుని బుమ్రా సమం చేశాడు.

Related News

Nitish Kumar Reddy Injury: ఆస్పత్రి బెడ్‌పై నితీశ్ కుమార్ రెడ్డి.. అసలేం ప్రమాదమంటే

MS Dhoni : ధోని ఎందుకు భిన్నమైన ప్యాడ్స్ వాడుతాడు.. అందుకే సిక్సులు బాగా కొడుతున్నాడా!

Shivashankara : ఒక చేయి లేదు.. అయిన అదరగొడుతున్న సింగిల్ హ్యాండ్ గణేష్… 29 సెంచరీలు కూడా

Gill – Abhishek : యువరాజ్ స్కూల్ లో ట్రైనింగ్.. నెంబర్ వన్ ర్యాంక్ లో గిల్, అభిషేక్

KL Rahul: ఇంగ్లాండ్ ప్లేయర్లకు యముడిలా మారిన kl రాహుల్.. ఔట్ చేస్తే గాయాలే

Rishabh Pant : రిషబ్ పంత్ గొప్పోడయ్యా.. కష్టాల్లో ఉన్న ఓ లేడీకి.. ఆ గుండె బతకాలి

Big Stories

×