Nidhhi Agerwal : యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్ తాజాగా తీసుకున్న నిర్ణయం ఆమె అభిమానులకు షాకిస్తోంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) తో ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veeramallu) లాంటి పాన్ ఇండియా మూవీ చేస్తున్న ఈ బ్యూటీ మరో పాన్ ఇండియా సినిమాలో ఐటమ్ సాంగ్ చేయడానికి సిద్ధమవ్వడమే ఫ్యాన్స్ షాక్ అవ్వడానికి కారణం.
బాబీ డియోల్ తో ఐటమ్ సాంగ్ లో చిందేయనున్న నిధి
బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘జాట్’. ఈ యాక్షన్ ఓరియెంటెడ్ మూవీలో రెజీనా, నయామీ ఖేర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీని మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, టీజీ విశ్వప్రసాద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో రణదీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. గత ఏడాది ‘జాట్’ మూవీ టీజర్ రిలీజ్ కాగా, మంచి రెస్పాన్స్ దక్కింది. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుండగా, ఇందులో నిధి అగర్వాల్ ఐటమ్ సాంగ్ చేయబోతుందనే వార్త తాజాగా బయటకొచ్చింది.
వీరమల్లుపై హోప్స్ వదిలేసుకున్నట్టేనా?
నిధి అగర్వాల్ కి టాలీవుడ్లో ఇప్పటిదాకా మంచి ఆఫర్స్ వచ్చినప్పటికీ, చెప్పుకోదగ్గ హిట్టు మాత్రం పడలేదు. ఒక్క సూపర్ హిట్ కోసం ఈ బ్యూటీ చాలాకాలంగా ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆమె ‘హరిహర వీరమల్లు’, ‘ది రాజా సాబ్’ వంటి సినిమాలలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ ఈ రెండు సినిమాలు కూడా పలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ముందుగా ఇందులో ‘హరిహర వీరమల్లు’ మూవీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. కానీ ఈ సినిమా రిలీజ్ అయ్యాక నిధి అగర్వాల్ ఫేట్ మారుతుందా అంటే అనుమానమే.
ఎందుకంటే ప్రస్తుతానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ విపరీతంగా ఉంది. మూవీ రిలీజ్ అయ్యాక కూడా కంప్లీట్ గా క్రెడిట్ మొత్తం పవన్ కళ్యాణ్ కి మాత్రమే దక్కుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి ఈ విపరీతమైన ఫ్యాన్ డం ముందు నిధి అగర్వాల్ పేరు వినబడాలి అంటే ఆమె పాత్ర పవర్ ఫుల్ గా ఉండాలి. కానీ ఇందులో సున్నితమైన యువరాణిగా కనిపించబోతోంది నిధి. ఇక ఈ మూవీ రిలీజ్ అవుతున్న తరుణంలో ఆమె ‘జాట్’ మూవీలో ఐటమ్ సాంగ్ చేస్తోందనే వార్త బయటకు రావడంతో నిధి ‘వీరమల్లు’పై హోప్స్ వదిలేసుకుందా అనే అనుమానాలు మొదలవుతున్నాయి.
ఈ ఐటం సాంగ్ వార్త తెలిసిన ఆమె అభిమానులు చేతిలో రెండు పాన్ ఇండియా సినిమాలు పెట్టుకుని ఐటం సాంగ్ చేయడం అవసరమా ? అని నిధిని ప్రశ్నిస్తున్నారు. మరి నిధి అగర్వాల్ ఈ నిర్ణయం తీసుకోవడానికి గల కారణం ఏంటి? ఇది ఆమె కెరీర్ కు యూజ్ అవుతుందా? అన్నది ఆసక్తికరంగా మారింది.