Nidhhi Agerwal: ప్రస్తుతం టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ ఎవరు అంటే చాలామందికి గుర్తొచ్చే పేరు శ్రీలీల. హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించిన కొన్ని నెలల్లోనే బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు అందుకుంటూ చాలామంది స్టార్ హీరోలతో సైతం జోడీకట్టింది. శ్రీలీల ఎంటర్ అవ్వకముందు టాలీవుడ్‌లో కొందరు యంగ్ హీరోయిన్ల హవా నడిచింది. కానీ తను ఎంటర్ అయిన తర్వాత యంగ్ హీరోలు, స్టార్ హీరోలు అందరూ తనతో కలిసి నటించడానికి ఆసక్తి చూపిస్తున్నారు. అలా చాలామందిని వెనక్కి నెట్టేసింది ఈ ముద్దుగుమ్మ. ఆ లిస్ట్‌లో నిధి అగర్వాల్ కూడా ఉంటుంది. తాజాగా నిధి అగర్వాల్‌ను శ్రీలీలతో పోలిస్తూ ఒక నెటిజన్ ట్వీట్ చేయగా దానిపై నిధి రియాక్ట్ అయ్యింది.
గట్టి పోటీ
హీరోల మధ్య మాత్రమే కాదు.. హీరోయిన్ల మధ్య కూడా పోటీ గట్టిగానే ఉంటుంది. ముఖ్యంగా హీరోలకు వరుసగా ఫ్లాపులు వచ్చినా వారికి అవకాశాలు ఇవ్వడానికి మేకర్స్ రెడీగా ఉంటారు. కానీ హీరోయిన్ల పరిస్థితి అలా ఉండదు. వరుసగా ఫ్లాప్స్ వస్తే మాత్రం ఐరెన్ లెగ్ అంటూ తనను పక్కకు పెట్టేస్తారు. పైగా ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్ ఎంటర్ అయ్యిందంటే తనకు బ్యాక్ టు బ్యాక్ ఆఫర్లు ఇవ్వడానికి అందరూ సిద్ధంగా ఉంటారు. అలా శ్రీలీల ఎంటర్ అయ్యే ముందు పూజా హెగ్డే, నిధి అగర్వాల్ వంటి హీరోయిన్లు కాస్త బిజీగానే ఉన్నారు. కానీ శ్రీలీల ఎంట్రీతో చాలామంది చాప్టర్ క్లోజ్ అయిపోయింది. దానిపై ‘హరి హర వీరమల్లు’ ఫేమ్ నిధి అగర్వాల్ స్పందించింది.
శ్రీలీలతో పోలిక
నాగచైతన్యతో చేసిన ‘సవ్యసాచి’ అనే సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన తర్వాత బాలీవుడ్‌లో హీరోయిన్‌గా నిధికి మొదటి అవకాశం వచ్చింది. ‘ఇస్మార్ట్ శంకర్’తో నిధికి టాలీవుడ్‌లో మంచి ఫ్యూచర్ ఉంటుందని ప్రేక్షకులు భావించారు. కానీ అలా జరగలేదు. దీంతో తనను శ్రీలీలతో పోలుస్తూ ఒక నెటిజన్ ట్వీట్ చేశారు. ‘2019లో ఇస్మార్ట్ శంకర్ తర్వాత నిధి అగర్వాల్ ఏం చేసింది? ఎన్ని చేసింది?’ అని అడగడంతో పాటు శ్రీలీల (Sreeleela) 2021లో వచ్చి 20కు పైగా సినిమాలు చేసింది అన్నాడు. దానికి నిధి అగర్వాల్ (Nidhhi Agerwal) ఫ్యాన్స్ సపోర్ట్‌గా ముందుకొచ్చారు. ఫ్యాన్స్ మాత్రమే కాదు.. నిధి సైతం తనను తాను సపోర్ట్ చేసుకుంటూ ట్వీట్ చేసింది.
Also Read: పట్టపగలు.. కుర్ర హీరోయిన్‌తో అలా.. మీకో దండంరా అంటూ తప్పించుకుంది
అందుకే లేటు
‘ఇస్మార్ట్ తర్వాత హీరో మూవీ చేసింది. 3 తమిళ సినిమాలు చేసింది. హరి హర వీరమల్లు సైన్ చేసింది. నేను సమయం తీసుకొని మంచి స్క్రిప్ట్స్ అనిపించిన సినిమాలు మాత్రమే నేను సైన్ చేస్తా. ఒక మంచి సినిమాలో భాగమవ్వాలి అనే నా అంచనా కొన్నిసార్లు తప్పు కావచ్చు. కానీ నేనేం కంగారు పడడం లేదు. నేను ఇక్కడ ఉండిపోవడానికే వచ్చాను. నా గురించి ఆందోళనపడకండి’ అని చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. ప్రస్తుతం నిధి అగర్వాల్.. పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘హరి హర వీరమల్లు’తో పాటు ప్రభాస్‌తో కలిసి ‘రాజా సాబ్’ కూడా చేస్తోంది. కానీ ఈ రెండు సినిమాలు రోజురోజుకీ విడుదలను వాయిదా వేసుకుంటూ ప్రేక్షకుల ముందుకు రావడానికి లేట్ చేస్తున్నాయి.
Ismart tarwata hero movie chesindi, 3 Tamil films chesindi AND hhvm film sign chesindi. I take my time and sign films that I feel are good scripts, sometimes I might be wrong but my intention is to be a part of good cinema. I’m in no hurry.. I’m here to stay brother don’t worry…
— Nidhhi Agerwal 🌟 Panchami (@AgerwalNidhhi) April 13, 2025