Nidhi Agerwal..ప్రముఖ హీరోయిన్ నిధి అగర్వాల్ (Nidhi Agerwal)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు . 2017లో టైగర్ ష్రాఫ్ (Tiger Shroff)హీరోగా వచ్చిన ‘మున్నా మైఖేల్’ సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె.. 2018లో వచ్చిన ‘సవ్యసాచి’ సినిమాతో తెలుగు రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది. ఇక తర్వాత ‘మిస్టర్ మజ్ను’ సినిమా చేసినా..ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ సెలబ్రిటీ అయిపోయింది. ఇక ఇప్పుడు ప్రముఖ టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో హీరోయిన్ గా అవకాశం దక్కించుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే మరొకవైపు రెబెల్ స్టార్ ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న ‘రాజాసాబ్’ సినిమాలో కూడా అవకాశం అందుకుంది.
సూర్య సినిమాలో అవకాశం అందుకున్న నిధి అగర్వాల్..
ప్రస్తుతం ఈ రెండు సినిమాలు షూటింగ్ దశలో ఉండగానే మరో జాక్పాట్ కొట్టేసింది ఈ ముద్దుగుమ్మ. అసలు విషయంలోకి వెళ్తే.. చివరిగా ‘లక్కీ భాస్కర్’ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న వెంకీ అట్లూరి(Venky Atluri) తనదైన రీతిలో సినిమాలు చేసి మంచి విజయాన్ని అందుకున్నారు అంతేకాదు సక్సెస్ దిశగా అడుగులు వేస్తూ ముందుకు సాగుతున్న సూర్య(Suriya) తో సినిమా ప్లాన్ చేస్తున్న విషయం తెలిసిందే.కోలీవుడ్లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న సూర్యకి ముందు నుండి తెలుగులో సినిమా చేయాలని కోరిక ఉందట, మంచి కథ దొరికితే చేస్తానని ఇప్పటికే ఎన్నోసార్లు పలు ఈవెంట్లలో కూడా తెలిపారు. అయితే ఇప్పుడు వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్య సినిమా దాదాపు ఖరారు అయింది. త్వరలోనే ఈ విషయాన్ని మేకర్స్ కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఇక ఈ సినిమాని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాలో సూర్య వెనుకబడిన కులాలకు చెందిన యువకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇంకా ఇందులో ఇద్దరు హీరోయిన్స్ నటించే అవకాశం ఉండగా.. అందులో ఒకరు భాగ్యశ్రీ బోర్సే (Bhagya Shri Borse) ను తీసుకోవాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇక మరొకవైపు రెండవ హీరోయిన్ గా నిధి అగర్వాల్ కి అవకాశం ఇచ్చినట్లు సమాచారం . ఇకపోతే టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి నిధి అగర్వాల్ ను సంప్రదించి మరి ఈ సినిమా స్టోరీ వినిపించగా.. ఇందులో తన పాత్రకు స్కోప్ ఉందని తెలుసుకున్న ఈ ముద్దుగుమ్మ వెంటనే ఓకే చెప్పిందని తెలుస్తోంది. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ALSO READ: Jabardast Rohini: కాస్టింగ్ కౌచ్ పై నిర్మాతకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన రోహిణి..!
పవన్ కళ్యాణ్ మూవీ నిధికి కలిసొస్తోందా..?
ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాలో అవకాశం లభించిందో ఇకప్పటినుంచి ఈమె రాత మారిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ పాత్ర చాలా స్ట్రాంగ్ అని , ఒక బ్యాక్ స్టోరీ కూడా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఇప్పుడు సినిమా విడుదల కానేలేదు అప్పుడే వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు లభిస్తున్నాయి. మరి ఈ చిత్రాలన్నీ నిధి అగర్వాల్ కు ఎలాంటి విజయాన్ని అందిస్తాయో చూడాలి.