Jabardast Rohini..సాధారణంగా మిగతా ఇండస్ట్రీలతో పోల్చుకుంటే సినిమా రంగం ఎప్పటికప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. కాబట్టి ఈ రంగానికి చెందిన ఏ విషయమైనా సరే ఇట్టే వైరల్ అవుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా హీరోయిన్స్, నటీనటులు ఎదుర్కొనే క్యాస్టింగ్ కౌచ్ సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జూనియర్ ఆర్టిస్టు మొదలుకొని సీనియర్ స్టార్ హీరోయిన్స్ వరకు ఇలా ఎంతోమంది ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సమస్యలు ఎదుర్కొన్నవారే. అయితే అందులో కొంతమంది ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి తమ ఇబ్బందులను చెప్పుకుంటుంటే.. మరికొంతమంది అలా చెప్పుకుంటే అవకాశాలు రావేమో అని భయపడి వెనక్కి తగ్గుతున్నారు. ఇంకొంతమంది వారు అడిగిన కమిట్మెంట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన వారు కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ ఒక నటి తనకు కూడా క్యాస్టింగ్ కౌచ్ సమస్య ఎదురయిందని , కాకపోతే తాను స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చానని కూడా తెలిపింది. ఆమె ఎవరో కాదు జబర్దస్త్ రోహిణి (Jabardast Rohini).
ALSO READ:HBD Rithu Varma: రీతు వర్మ ఎన్ని కోట్ల ఆస్తి కూడబెట్టిందో తెలుసా?
కాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ కామెంట్..
ఒకప్పుడు పలు సీరియల్స్ చేస్తూ భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న ఈ అమ్మడు.. జబర్దస్త్ లోకి వచ్చి లేడీ కమెడియన్ గా భారీ గుర్తింపును అందుకుంది. ఇక తర్వాత స్టార్ హీరోల సినిమాలలో లేడీ కమెడియన్ గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో లేడీ కమెడియన్స్ కి చాలా కొరత ఏర్పడింది. ఇప్పుడు ఆ కొరతను కొంత భాగం తీర్చే ప్రయత్నం చేస్తోంది రోహిణి. సీరియల్స్ సినిమాలే కాదు బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో కూడా సందడి చేసింది
ఏకంగా రెండుసార్లు బిగ్ బాస్ లో కి అడుగుపెట్టిన ఈమె.. అక్కడ కూడా తన ఆట, మాట తీరుతో అందరినీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే. బిగ్ బాస్ ద్వారా వచ్చిన డబ్బుతో ఇటీవలే కొత్త ఇల్లు కూడా కట్టుకుంది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె సినీ ఇండస్ట్రీలో జరిగే క్యాస్టింగ్ కౌచ్ పై ఓపెన్ కామెంట్ చేసింది.
ఆ నిర్మాతలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాను – జబర్దస్త్ రోహిణి..
ఇంటర్వ్యూలో భాగంగా రోహిణి మాట్లాడుతూ..కెరియర్ ఆరంభంలో నేను ఇలాంటి చేదు అనుభవాలు ఎదుర్కొన్నాను. ఒక సీరియల్ ఆడిషన్ కోసం వెళ్తే.. నీకు అవకాశం ఇస్తే కమిట్మెంట్ ఇవ్వాలని ఒక ప్రొడ్యూసర్ కి సంబంధించిన మేనేజర్ అడిగారు. అప్పట్లో నాకు తెలియకపోవడంతో ఎంతైనా కష్టపడతానని చెప్పాను. కానీ అసలు విషయం తెలిసాక బాధ వేసింది. ఇక ఈ విషయాన్ని నాకు తెలిసిన ఒక అంకుల్ కి చెబితే, ఆ ప్రొడ్యూసర్ పైన ఆయన సీరియస్ అయ్యారు. అయితే ఆ ప్రొడ్యూసర్ మాత్రం నేను నిన్ను అడిగానా ?అంటూ పెద్ద గొంతు వేసుకొని అరిచాడు .అయినా సరే నేను ఏమాత్రం భయపడకుండా నాకు ఎదురైన చేదు అనుభవాన్ని తిప్పి కొట్టాను” అంటూ రోహిణి తెలిపింది. అంతేకాదు మరోసారి ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి సీరియల్స్ లో అవకాశానికి వెళ్తే .. ప్రముఖ చానల్లో నీకు ఏ సీరియల్ లో కావాలన్నా.. అవకాశం ఇస్తాను. కానీ నాకు కమిట్మెంట్ కావాలి అని అడిగారు. ఇక దాంతో చిర్రెత్తుకుపోయిన నేను ఆ నిర్మాతకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వచ్చేసాను అంటూ తెలిపింది. మొత్తానికైతే కమిట్మెంట్ అనే భూతాన్ని తరిమే రోజులు ఎప్పుడు వస్తాయో అని రోహిణి బాధపడుతూ తనకు ఎదురైనా చేదు అనుభవం గురించి చెప్పి ఆశ్చర్యపరిచింది.