BigTV English

Sreeleela : మెగా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. విజిల్స్ పడటం పక్కా..

Sreeleela : మెగా మూవీలో ఛాన్స్ కొట్టేసిన శ్రీలీల.. విజిల్స్ పడటం పక్కా..

Sreeleela : టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలంలోనే పాపులర్ అవ్వడంతో పాటుగా కుర్రాళ్ల క్రష్ గా మారిపోయింది. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోల సినిమాల్లో నటించే అవకాశాన్ని అందుకుంది. గత ఏడాది పుష్ప 2 లో ఐటమ్ సాంగ్ లో నటించింది. ఆ సాంగ్ ఎంత ట్రెండ్ అయ్యింది తెలిసిందే. ప్రస్తుతం కేవలం సినిమాల పై మాత్రమే కేర్ తీసుకుంది. అందుకే వరుస సినిమాలను అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు నాలుగు సినిమలు చేతిలో పెట్టుకుంది. అందులో రెండు సినిమాలను అనౌన్స్ చేసింది. త్వరలోనే ఆ మూవీలు ప్రేక్షకులను పలకరించందుకు రెడీగా ఉంది. ఇప్పుడు ఈమె గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. అదేంటంటే మెగా మూవీలో ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. అందులో నిజమేంత ఉందో తెలియదు కానీ నెట్టింట మాత్రం ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది.


పెళ్లి సందడి మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె అనతి కాలంలోనే బడా హీరోలతో నటించే ఛాన్స్ కొట్టేసింది. నటిగా శ్రీలీలాకు ఆడియన్స్ వందకు వందశాతం మార్కులు వేశారు. ఆమె అందం, అభినయం, డాన్స్ కు తెలుగు ప్రేక్షకులు ఎంతలా ఫిదా అయ్యారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. స్టార్ హీరోయిన్లను మించి క్రేజ్ ను సొంతం చేసుకుంది. బాలయ్య కూతురుగా, మహేష్ బాబుకు ప్రేయసిగా నటించి మెప్పించిన విషయం తెలిసిందే. మాస్ మహారాజ్ రవితేజ, ఉస్తాద్ రామ్ పోతినేని, పంజా వైష్ణవ తేజ్, నితిన్ వంటి హీరోలకు జోడిగా నటించి ప్రేక్షకులను ఫిదా చేసింది.. నితిన్ మూవీ విడుదలకీ సిద్ధంగా ఉంది.

Also Read :నన్ను తొక్కడానికి పెద్ద కుట్ర.. అంత మోసం జరిగిందా..?


శ్రీలీలా డాన్స్ తో యువతను ఉర్రూతలూగిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సెన్సేషనల్ మూవీ పుష్ప2 : ది రూల్లో  కిసిక్ సాంగ్ తో వచ్చేసింది. ఆ పాట తర్వాత ఫ్యాన్స్ అభిప్రాయం కూడా మారేలా చేసుకుంది.. ఆ సాంగ్ తర్వాత మరో సాంగ్ చెయ్యనని ఆమె వెల్లడించింది. కానీ ఇప్పుడు మరో మెగా తో స్టెప్పులు వెయ్యబోతుంది. టాలీవుడ్ స్టార్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న సోషియో ఫాంటసీ విత్ యాక్షన్ జొన్నర్ లో రూపుదిద్దుకుంటున్న ‘ విశ్వంభర’ చిత్రంలో నటించబోతోంది. మెగాస్టార్ సరసన స్పెషల్ సాంగ్లో చిందులు వేయబోతుందని తెలుస్తోంది.. అయితే విశ్వంభర సినిమాలో శ్రీలీల ఐటమ్ సాంగ్ గురించి మరింత స్పష్టత రావాల్సి ఉంది. రీసెంట్ గా అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి శ్రీలీలకు దుర్గాదేవి విగ్రహాన్ని బహుకరించాడు. ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నసాయి. శ్రీలీలా మరోవైపు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు హీరోయిన్ గా ‘ ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు బాలీవుడ్ పైన ఈ ముద్దుగుమ్మ కన్నేసింది.. చూడాలి మరి ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో..

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×