Nidhi Aggarwal: నిధి అగర్వాల్ (Nidhi Aggarwal)టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకుని ప్రేక్షకులను సందడి చేస్తున్న వారిలో ఒకరు. సవ్యసాచి సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ మిస్టర్ మజ్ను, హీరో, ఇస్మార్ట్ శంకర్ వంటి సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈమె డేటింగ్ రూమర్లపై స్పందించారు.
సెలబ్రిటీల విషయంలో కామన్..
తెలుగులో హీరోయిన్ గా మంచి సక్సెస్ అందుకున్న నిధి అగర్వాల్ కోలీవుడ్ స్టార్ హీరో శింబు(Simbu)తో కలసి ఈశ్వరన్ సినిమా ద్వారా తమిళంలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇక ఈ సినిమా అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడ్డారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని గతంలో ఎన్నో రకాల వార్తలు వినిపించాయి. ఈ వార్తలపై పలు సందర్భాలలో స్పందించిన నిధి తాజాగా మరోసారి హీరో శింబుతో ప్రేమ వ్యవహారం గురించి స్పందించారు. ఈ సందర్భంగా నిధి అగర్వాల్ మాట్లాడుతూ సినిమా ఇండస్ట్రీలో ఉండే సెలబ్రిటీల గురించి ఇలాంటి వార్తలు రావడం సర్వసాధారణం అని తెలిపారు.
రూమర్ల పైన ఆసక్తి ఎక్కువ…
హీరోయిన్ల సినిమాల కంటే కూడా వారి వ్యక్తిగత విషయాల గురించి ప్రేక్షకులు, అభిమానులు ఆసక్తి చూపుతూ ఉంటారు. వారికి ఒక వ్యక్తి పట్ల ఏమనిపిస్తే దానిని బయటకు చెబుతూ ఉంటారు. ఇలాంటివన్నీ ఇండస్ట్రీలో ఉండే హీరోయిన్ల విషయంలో కామన్ అని వాటి గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని తెలిపారు. జనాలకు నిజం కంటే కూడా రూమర్లపైనే ఆసక్తి ఎక్కువగా ఉంటుందని ఈ విషయం గురించి పెద్దగా ఆలోచించాల్సిన పనిలేదని క్లారిటీ ఇచ్చారు. తన గురించి ఈ ఒక్క విషయం మాత్రమే కాదు నిత్యం ఏదో ఒక రూమర్ బయటకు వస్తూనే ఉంటుందని వాటిని చూసి చూడనట్టు వదిలేస్తానని తెలిపారు.
ఈ విధంగా నిధి అగర్వాల్ శింబుతో ప్రేమ వ్యవహారం గురించి క్లారిటీ ఇవ్వడంతో ఈ వార్తలకు చెక్ పెట్టినట్టు అయింది. హీరో శింబు ఇలాంటి వార్తలలో నిత్యం నిలుస్తూ ఉంటారు . ఈయన గతంలో నటి నయనతారతో పాటు హన్సిక వంటి పలువురు హీరోయిన్లతో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే వారందరితో కూడా శింబు బ్రేకప్ చెప్పుకొని ప్రస్తుతం కెరియర్ పై పూర్తిస్థాయిలో ఫోకస్ చేశారు. ఇక ఈనెల 5వ తేదీ కమల్ హాసన్ తో కలిసి నటించిన థగ్ లైఫ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక నిధి అగర్వాల్ సైతం హరిహర వీరమల్లు సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఏర్పడ్డాయి.