Nidhi Aggarwal: సవ్యసాచి సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయమైన నటి నిధి అగర్వాల్ (Nidhi Aggarwal) ప్రస్తుతం పలు సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఈమె పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హీరోగా నటించిన హరిహర వీరమల్లు (Harihara Veeramallu)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సినిమా జూన్ 12వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం కూడా ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే నిధి అగర్వాల్ వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ సందడి చేస్తున్నారు.
హార్స్ రైడింగ్ నేర్చుకున్నాను…
ఇకపోతే ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె హరిహర వీరమల్లు సినిమాలో నటించడం కోసం ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు ఏంటి అనే విషయాలను బయట పెట్టారు. ఈ సినిమా కోసం తాను భరతనాట్యం కూడా నేర్చుకున్నానని తెలిపారు. మొదట్లో నాకు భరతనాట్యం పెద్దగా వచ్చేది కాదు కానీ ఈ సినిమా కోసం నేర్చుకున్నానని తెలిపారు. అదేవిధంగా హార్స్ రైడింగ్ కూడా నేర్చుకున్నానని నిధి అగర్వాల్ వెల్లడించారు. ఇక షూటింగ్ సమయంలో ఏమాత్రం బోర్ కొట్టకుండా ఉండేది. షూటింగ్ లొకేషన్లోకి రాగానే అక్కడ ఉన్న సెట్టింగ్ చూడగానే కొత్త ప్రపంచంలోకి వెళ్లిపోయామని భావన వస్తుందని తద్వారా షూటింగ్ లో ఇబ్బందులు ఎదుర్కోలేదని తెలిపారు.
అన్ని బంగారు నగలే…
ఈ సినిమాలో నిధి అగర్వాల్ వేసుకున్న నగల గురించి కూడా ప్రశ్నలు ఎదురయ్యాయి. సాధారణంగా ఇలాంటి సినిమాల షూటింగ్ కోసం గోల్డ్ నగలను తీసుకురారు కానీ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన బంగారు ఆభరణాలనే తాను వేసుకున్నానని తెలిపారు. ఇక పవన్ కళ్యాణ్ గారితో నటించడం గురించి కూడా ఈమె స్పందించారు. పవన్ కళ్యాణ్ గారు చాలా అద్భుతమైన నటులు. ఆయన సినిమాలంటే ఎంత డెడికేషన్ చూపిస్తారో చెప్పాల్సిన పనిలేదని, ఏదైనా ఒక సీన్ షూట్ జరుగుతుంది అంటే ఆయన ఫోకస్ మొత్తం కెమెరా వైపే ఉంటుంది తప్ప పక్కన ఎవరు ఏం చేస్తున్నారనే విషయాలు గురించి పట్టించుకోరని తెలిపారు. ఒక సీన్ షూటింగ్ చేసేటప్పుడు వందలాది మంది ఆర్టిస్టులు అటు తిరగడం, ఇటు తిరగడం వారి వారి పనులు చేసుకుంటూ ఉంటారు కానీ, పవన్ కళ్యాణ్ ఫోకస్ మాత్రం కెమెరా పైనే ఉంటుందని తెలిపారు.
పవన్ కళ్యాణ్ షూటింగ్లో పాల్గొన్నప్పుడు చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్న ఆయన ఫోకస్ మాత్రం పక్కకు మల్లదని, అలాంటి ఒక గొప్ప నటుడు పవన్ కళ్యాణ్ అని తెలిపారు. ఇలా నటించడం అందరి వల్ల కాదు. ఇలా నటించాలి అంటే దేవుడి ఆశీస్సులు కూడా ఉండాలని అందుకే పవన్ కళ్యాణ్ గారు పవర్ స్టార్ అయ్యారని తెలిపారు. ఊరకనే ఎవరు పవర్ స్టార్లు కారని అలాంటి బిరుదులు రావడం వెనుక ఎంతో కష్టపడాల్సి ఉంటుందని నిధి వెల్లడించారు. పవన్ కళ్యాణ్ నటన, సినిమాల పట్ల ఆయన చూపించే డెడికేషన్ గురించి నిధి చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి