BigTV English

Niharika : డాడీ ఎమ్మెల్సీ అయ్యాడు… డాటర్ దూకుడు పెంచింది..

Niharika : డాడీ ఎమ్మెల్సీ అయ్యాడు… డాటర్ దూకుడు పెంచింది..

Niharika ..ప్రముఖ మెగా డాటర్ నిహారిక (Niharika)గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. మెగా కుటుంబం నుండి హీరోయిన్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఏకైక అమ్మాయిగా పేరు సొంతం చేసుకుంది నిహారిక. ఇకపోతే హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది కానీ అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేదు.దాంతో ఇప్పుడు నిర్మాతగా మారిపోయింది.. ‘పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్’ అనే పేరుతో ఒక సొంత నిర్మాణ సంస్థను స్థాపించిన ఈమె.. ఇప్పటికే ‘కమిటీ కుర్రోళ్ళు’ అనే సినిమా చేసి మంచి విజయాన్ని అందుకుంది.అయితే ఇప్పుడు తాజాగా తన బ్యానర్ లో ఇంకో సినిమా చేయడానికి సిద్ధమవుతోంది నిహారిక.


భారీ బడ్జెట్ తో సినిమా నిర్మించబోతున్న నిహారిక..

ముఖ్యంగా ఈ సినిమాను భారీ బడ్జెట్లో నిర్మించడానికి సిద్ధమవుతోంది. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. తన తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు ఎమ్మెల్సీగా పదవీ బాధ్యత చేపట్టిన వెంటనే ఈమె ఇలా భారీ బడ్జెట్లో సినిమా ప్రకటించడం పై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. డాడీ ఎమ్మెల్సీ అయ్యాడు డాటర్ ఏమో దూకుడు పెంచేసి.. భారీ బడ్జెట్లో సినిమా నిర్మించడానికి సిద్ధం అయిపోతుంది అంటూ కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఈ సినిమా కోసం ఎంత బడ్జెట్ అయితే కేటాయిస్తోందో అంతకుమించి పట్టు ఉన్న కథనే ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్స్ లో మానస (Manasa) 2 సిరీస్ లను దర్శకత్వం చేసిన విషయం తెలిసిందే. ‘బెంచ్ లైఫ్’ , ‘ఒక చిన్న ఫ్యామిలీ’ ఈ రెండూ కూడా మంచి ఆదరణ సొంతం చేసుకున్నాయి. అయితే ఇప్పుడు ఆమె డైరెక్షన్లోనే మరో ఫీచర్ ఫిలిం రాబోతుందని సమాచారం. ఇక అందులో భాగంగానే ఇందులో నటించడానికి త్వరలోనే నటీనటులను కూడా ఫైనల్ చేయబోతున్నారట. ముఖ్యంగా నిహారిక ఈ సినిమాను చాలా ప్రత్యేకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. అందులో భాగంగానే ఇందులో పెద్ద నటులు ఉండేలా ప్లాన్ చేస్తోందట. ఒకవేళ ఈ సినిమా గనుక హిట్ అయితే నిహారిక కూడా టాలీవుడ్ ప్రొడ్యూసర్స్ లో ఒకరిగా నిలదొక్కుకుంటుందని నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి నిహారిక కు ఈ కొత్త సినిమా ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి.


ALSO READ:Manchu Manoj: మిస్ అవుతున్నా నాన్న… ఉండలేకపోతున్నా… మంచు మనోజ్ ఎమోషనల్..!

నిహారిక కెరియర్..

ఇండస్ట్రీలోకి యాంకర్ గా అడుగుపెట్టి, సినిమా ఇండస్ట్రీలో తన నటనతో ప్రేక్షకులను మెప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది నిహారిక . అందులో భాగంగానే ‘ఒక మనసు’ సినిమా ద్వారా హీరోయిన్గా తన అదృష్టాన్ని పరీక్షించుకుంది. నాగశౌర్య (Naga Sourya) ఇందులో హీరోగా నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలోని పాటలు కూడా క్లాసికల్ గా మంచి హిట్ అందుకున్నాయి. కానీ సినిమా మాత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఇక తర్వాత ‘సూర్యకాంతం ‘ వంటి సినిమా చేసింది కానీ సక్సెస్ అవ్వలేదు. ఇక తర్వాత పెద్దల కోరిక మేరకు పెద్దలు కుదర్చిన వివాహాన్ని చేసుకుంది కానీ అతడితో ఎక్కువ రోజులు ఉండలేక విడాకులు తీసుకుంది. ప్రస్తుతం కుటుంబంతోనే కలిసి ఉంటున్న నిహారిక ఇలా సొంతంగా సినిమాలు నిర్మిస్తూ.. నిర్మాతగా సెటిల్ అయ్యే ప్రయత్నం చేస్తోంది.

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×