CM Revanth Reddy: ఈ కేటీఆర్ ఉన్నాడే.. ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టున్నాడు. సీఎం రేవంత్ రెడ్డిపై రోజుకో తరహా అసత్య ప్రచారం చేయిస్తున్నాడని కాంగ్రెస్ కస్సు మంటోంది. రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ చేసేలా.. కాంగ్రెస్ సర్కారును ప్రజల్లో అబాసుపాలు చేసేలా.. రకరకాల వీడియోలు, ఫోటోలు, పోస్టులతో అసత్యమేవ జయతే అనే అజెండాతో ముందుకు పోతున్నట్టున్నాడు.
పొలిటికల్ బ్లేమ్ గేమ్ కోసమే బీఆర్ఎస్ తరఫున స్పెషల్ టీమ్స్ పెట్టారని తెలుస్తోంది. కోట్లకు కోట్లు డబ్బులు కుమ్మరిస్తూ.. రేవంత్ ప్రభుత్వం టార్గెట్‌గా వైరల్ కంటెంట్ క్రియేట్ చేస్తూ.. పబ్లిక్ ను కన్ఫ్యూజ్ చేసే పనిలో బిజీగా ఉంది గులాబీ బ్యాచ్. యూట్యూబ్ లో పెయిడ్ యాంకర్స్‌తో తిట్టించడం.. సోషల్ పేజెస్‌లో కారుకూతలు కూయడం వాళ్ల డైలీ రొటీన్‌గా మారింది. ఇటీవలే రేవతి లాంటి కొందరు యూట్యూబర్స్‌పై కేసులు పెట్టి లోపలేసినా అలాంటి వారికి ఇంకా బుద్ధి వచ్చినట్టు లేదు. ఆ పెయిడ్ టీమ్స్ మరింత రెచ్చిపోతున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి ఫోటోలను మార్ఫింగ్ చేయడం.. అనని మాటలు అన్నట్టుగా ఫేక్ వీడియోలు వదులుతున్నారు.
ఆ మేటర్ ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కు చేరింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు మరో 8మందిపై కేసులు నమోదయ్యాయి.
ALSO READ : కేసీఆర్‌పై తిరుగుబాటు.. గజ్వేల్‌లో రచ్చ
రేవంత్ టార్గెట్‌గా మార్ఫింగ్ ఫోటోలు, ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తూ ముఖ్యమంత్రి ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారనేది కంప్లైంట్. మొయినాబాద్ పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మానయ్య ఫిర్యాదు చేశారు. కేటీఆర్‌తో పాటు.. విజయ్ రావు, కందుల మచ్చు, రవికిరణ్, అనిల్, యాదగిరి, వర్ధన్, అభి, మురళిలపై కేసులు పెట్టాలని పోలీసులను కోరారు. కేటీఆర్ సూచనలతోనే వాళ్లంతా సీఎం రేవంత్ రెడ్డిని బద్నామ్ చేసేలా ఫేక్ ఫోటోలు, వీడియోలు పెడుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్ద ఎత్తున కుట్ర జరుగుతోందని.. చట్టరరరిత్యా కఠిన చర్యలు తీసుకోవాలని తన కంప్లైంట్ లో తెలిపారు. పోలీసులు.. బీఎన్ఎస్ 196, 352 రెడ్ విత్ 3(5) సెక్షన్ల ప్రకారం కేసులు నమోదు చేసి ఎంక్వైరీ స్టార్ చేశారు.
మండల పోలీస్ స్టేషన్లో కేసే కదా అని లైట్ తీసుకోవడానికి లేదు. కేసు ఎక్కడ ఫైల్ అయిందనేది ముఖ్యం కాదు. ఆరోపణలు నిజమని విచారణలో తేలితే.. తాడే పామై మెడకు చుట్టుకుంటుంది. ఈ కేసులో ఉచ్చు బిగిస్తే.. బీఆర్ఎస్ నేతలు జైలు ఊచలు లెక్కబెట్టాల్సి రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు కాంగ్రెస్ నేతలు.