Nikhl: బుల్లితెర నటుడు, బిగ్ బాస్ విన్నర్ నిఖిల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గోరింటాకు సీరియల్ తో తెలుగు తెరపై పరిచమయ్యారు. అమ్మకు తెలియని కోయిలమ్మ, ఊర్వశివో రాక్షసివో వంటి పలు తెలుగు సీరియల్స్ లో నటించి మెప్పించాడు. తాజాగా చిన్ని సీరియల్ లో పోలీస్ ఆఫీసర్ విజయ్ గా నటించారు. కొన్ని ఎపిసోడ్స్ తర్వాత సీరియల్ నుండి నిఖిల్ తప్పుకున్నాడు. చాలా రోజుల తర్వాత నిఖిల్ కావ్య ఒకే స్క్రీన్ పై కనిపించడంతో అభిమానులు ఆనందించారు. ఇంతలోనే నిఖిల్ సీరియల్ నుంచి తప్పుకోవడంతో కాస్త నిరాశపడ్డారు ఫ్యాన్స్. ఇంకేదైనా సీరియల్ లో కానీ, ఏదైనా కొత్త ప్రాజెక్ట్ లో నిఖిల్ కనిపిస్తాడేమోనని ఈగర్ గా ఎదురు చూస్తున్నారు. తాజాగా నిఖిల్ అభిమానులకు ఒక శుభవార్తను పంచుకున్నాడు. అదేంటన్నది ఇప్పుడు చూద్దాం..
అలా మీ ముందుకు ..
బుల్లితెర ప్రేక్షకుల హృదయాలలో స్థానం సంపాదించిన నటుడు నిఖిల్. బిగ్ బాస్ సీజన్ 8 విజేతగా నిలిచి తానేంటో నిరూపించుకున్నాడు. సాధారణంగా బిగ్ బాస్ తర్వాత వరుసగా ఆఫర్లు క్యూ కడతాయి అని అందరూ అనుకున్నారు. కానీ నిఖిల్ చాలా రోజులు ఏ సీరియల లో నటించలేదు. ఇటీవల చిన్ని సీరియల్ లో ఇన్స్పెక్టర్ విజయ్ గా కొన్ని ఎపిసోడ్స్ కే పరిమితమయ్యారు. ఇప్పుడు ఆయన ఏ సీరియల్ చేస్తారా అని అభిమానులు ఎదురు చూస్తున్న టైం లో కొత్త ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తున్న అంటూ నిఖిల్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉంటారు నిఖిల్. షూటింగ్ సమయాలలో ఖాళీ దొరికినప్పుడు రీల్స్ చేస్తూ పోస్టులు పెడుతూ తన అభిమానులకి ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు నిఖిల్. తాజాగా చేసిన పోస్ట్ లో నేను చెప్పినట్లుగా మళ్లీ మీ ముందుకు వస్తున్నాను అని తెలిపాడు. ఇది చూసిన వారంతా నిఖిల్ ఎటువంటి క్యారెక్టర్ తో మన ముందుకు వస్తున్నాడా అని, ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. ఏది ఏమైనా నిఖిల్ ని మరోసారి అభిమానులను మంచి ట్రీట్ ఇవ్వబోతున్నాడని అర్థమవుతుంది.
ఆమె సహకారం తో ..
నిఖిల్ తల్లి కన్నడ నటి సులేఖ. ఆమె సహకారంతో 2016లో లూటీ అనే సినిమాతో కన్నడ ఇండస్ట్రీలో అడుగు పెట్టారు. ఈ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా మాత్రమే నటించాడు. ఈ సినిమా ఆశించినంత స్థాయిలో ఆడలేదు. దాంతో కన్నడలోనే సీరియల్ లో నటించాడు. ఆ తరువాత గోరింటాకు సీరియల్ ద్వారా తెలుగులో పరిచయం అయ్యాడు. బిగ్ బాస్ ముందు సీరియల్ నటుడిగా మాత్రమే పరిచయమైన నిఖిల్. టైటిల్ విన్నర్ అవడంతో, నిఖిల్ కి ఫాలోవర్స్ పెరిగి పోయారు. నిఖిల్ కావ్య గురించి అందరికీ తెలిసిందే. వీరిద్దరూ కొంతకాలం ప్రేమించుకొని, తరువాత విడిపోయారు. బిగ్ బాస్ తర్వాత మళ్లీ ఇద్దరూ కలుస్తారని అనుకున్నారు కానీ అటువంటిదేమీ జరగలేదు. తాజాగా చిన్ని సీరియల్ కావ్య హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సీరియలలో నిఖిల్ రావడంతో అందరూ మళ్లీ ఇద్దరు కలిసి పోయారు అని అనుకున్నారు. కానీ కొన్ని ఎపిసోడ్స్ తర్వాత నిఖిల్ ను ఆ సీరియల్ నుంచి తప్పించారు. దానికి కారణం కావ్య అని నిఖిల్ ఫ్యాన్స్ వాపోయారు. మళ్లీ వస్తాను అని ఆ సీరియల్ లో నిఖిల్ చెప్పడం, ఇప్పుడు మళ్లీ కొత్తగా మరో ప్రాజెక్టుతో రానుండడంతో, అభిమానులు నిఖిల్ చెప్పినట్లుగా మళ్లీ తిరిగి వస్తున్నాడు అని తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా పూర్తిగా వివరాలు తెలియాల్సి ఉంది.
The Raja Saab : ఇండియన్ హర్రర్ సినిమాల్లో ఇదే తోపు… పాన్ ఇండియా స్టార్ ఊరికే అవ్వరు కదా