BigTV English

The Raja Saab : ఇండియన్ హర్రర్ సినిమాల్లో ఇదే తోపు… పాన్ ఇండియా స్టార్ ఊరికే అవ్వరు కదా

The Raja Saab : ఇండియన్ హర్రర్ సినిమాల్లో ఇదే తోపు… పాన్ ఇండియా స్టార్ ఊరికే అవ్వరు కదా

The Raja Saab: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీ.జీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న సినిమా ‘ది రాజా సాబ్. మారుతి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ హర్రర్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిధి అగర్వాల్, మాళవిక మోహన్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. సంజయ్ దత్, అనుపం కేర్, మురళీ శర్మ, యోగిబాబు ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తారు. ఇకపోతే ఈ సినిమా పోస్టర్ రిలీజ్ అయినప్పటి నుండి అభిమానులు సినిమాపై భారీ అంచనాలే పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా నుండి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి బయటికి వచ్చింది. అభిమానులకు ఆశలు రేపుతున్న అప్డేట్ ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


సినిమాలో ఇదే వండర్ ..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ మొదటిసారి హర్రర్ కామెడీ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో పూర్వీకుల స్థిరాస్తి కి సంబంధించిన అంశంతో రూపొందిస్తున్నారు. ఒక థియేటర్ యజమాని మనవడు, తాత రెండు క్యారెక్టర్స్ లో ప్రభాస్ కనిపిస్తున్నట్లు సమాచారం. రొమాన్స్, హాస్యం,హర్రర్ అన్నీ కలిపి ఒకే సినిమాలో ఉంటాయని.. ఊహించని సంఘటనల నడుమ కథను ముందుకు నడిపిస్తాయని టాక్.. ఇకపోతే ఇప్పుడు బయటకు వచ్చిన అప్డేట్ ఏంటంటే.. ఈ సినిమా టీజర్ లో ఇండియన్ స్క్రీన్ మీద ఎప్పుడు చూడని విజువల్ ఎఫెక్ట్స్ చూస్తారని, హర్రర్ లో ఇలాంటి రేంజ్ లో విజువల్ ఎఫెక్ట్స్ ఇంతవరకు తెలుగు సినిమాలో రాలేదనేది టాక్.. హర్రర్ సినిమాలు చాలానే తెలుగులో రిలీజ్ అయ్యాయి. కానీ, రాజా సాబ్ రేంజ్ విజువల్ ఎఫెక్ట్స్ ఏ సినిమాలో ఉండవనేది టాక్. అదే నిజమైతే త్వరలోనే టీజర్ రిలీజ్ కు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తుంది. ఇదే నిజమైతే తెలుగు ఇండస్ట్రీలోనే హర్రర్ సినిమాల్లో ప్రభాస్ సినిమా మొదటి ప్లేస్ లో ఉంటుందన్నది వాస్తవం. ఇది ప్రభాస్ ఫ్యాన్స్ కు పండగలాంటి వార్త. ఇది విన్న అభిమానులు పాన్ ఇండియా స్టార్ వూరికే అయిపోయారు అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.


డ్యూయల్ రోల్ ..

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ డ్యూయల్ రోల్ లో నటిస్తారని టాక్. బాహుబలి తో పాన్ ఇండియా స్టార్ గా మారారు ప్రభాస్. ఆ తరువాత సలార్ తో బ్లాక్ బాస్టర్ సక్సెస్ ని అందుకున్నాడు. ఆది పురుష్, కల్కి 2898 AD సినిమాల తరువాత ప్రభాస్ నుంచి వస్తున్న సినిమా కావడంతో అభిమానులు ఈ సినిమా కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో సంజయ్ దత్ ఒక కీలక పాత్రలో కనిపిస్తారని సమాచారం. ఈ సినిమాకు సంగీతం థమన్ అందించనున్నారు. తమన్ ఈ సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో భయపెడతారని టాక్. ఈ సినిమాకి విజువల్ ఎఫెక్ట్స్ తో అభిమానులకు గ్రాండ్ విజువల్ వండర్ గా సినిమాని రూపొందిస్తున్నారు. మారుతి సినిమా అంటేనే కామెడీ ఎక్కువగా ఉంటుంది. భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, బాబు బంగారం, మంచి రోజులు ఈ రోజుల్లో వంటి సినిమాలతో సక్సెస్ అందుకున్నారు. ఈ మూవీ రిలీజ్ అయిన తర్వాత ఎటువంటి వండర్స్ ని క్రియేట్ చేస్తుందో చూడాలి.

Karan Johar: నా వెయిట్ లాస్ సీక్రెట్ ఇదే.. మీరు ఫాలో అవ్వండన్నా కరణ్ జోహార్

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×