Niranjan Reddy : ప్రస్తుత కాలంలో ఎవరు ఎప్పుడు ఎలా పాపులర్ అవుతారో తెలియకుండా పోయింది. కొన్నిసార్లు గుర్తింపనేది ప్రయత్న పూర్వకంగా రాదు. మనకు తెలియకుండా కూడా కొన్నిసార్లు వచ్చే సందర్భాలు ఉంటాయి. ఇక ఈరోజు సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటన గురించి పోలీసులు అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లను సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అల్లు అర్జున్ ను 14 రోజులపాటు రిమాండ్ కు తరలించబోతున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. అయితే అల్లు అర్జున్ కు ఉన్న సర్కిల్ వలన మధ్యంతర బెయిల్ లభించింది. అల్లు అర్జున్ ని అరెస్టు చేశారు అని తెలియగానే మొత్తం మెగా ఫ్యామిలీ అంతా రంగంలోకి దిగింది. ఇక అల్లు అర్జున్ తరఫున కేసును లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు.
నిరంజన్ రెడ్డి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్షణం, ఘాజి వంటి సినిమాలను నిర్మించారు. ఈరోజుల్లో కేవలం సినిమా హీరో దర్శకుడు పేర్లు మాత్రమే పాపులర్ అవుతుంటాయి. నిర్మాతల పేర్లు అంతగా తెలియదు. కేవలం దిల్ రాజు, నాగ వంశీ, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాతలు మాత్రమే తెలుగు ప్రేక్షకులకు పరిచయం. ఎందుకంటే వాళ్లు కూడా పదేపదే స్టేజ్ పై మాట్లాడటం వలన, ప్రెస్ మీట్స్ కి హాజరవడం వల్ల గుర్తింపు సాధిస్తూ ఉంటారు. ఇకపోతే నిరంజన్ రెడ్డి ఈరోజు నుంచి బాగా పాపులర్ అయ్యారు. దీనికి కారణం అల్లు అర్జున్ తరఫున కేసును వాదించటం. అంతేకాకుండా రాజ్యసభ మెంబెర్ అని, జగన్ కేసులను కూడా ఈయనే డీల్ చేశారు అని చాలా విషయాలు ఒక్కసారిగా తెలిసి వచ్చాయి. ఇక ప్రస్తుతం హైకోర్టు కు నిరంజన్ రెడ్డి ఇచ్చిన క్లారిటీ మామూలుది కాదు. ఈయన వాదించే తీరు చాలామందిని కట్టిపడేసింది.
ఈ సందర్భంలో నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పైన ఆ తల్లి, అబ్బాయి పడిపోయిన కూడా చాలామంది పోలీసులు పై ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసారు. అంటే పోలీసులు కూడా అల్లు అర్జున్ చూడడానికి కిందకు వచ్చేసారు. అంతేకాకుండా ఇండియాలో క్రికెట్ మ్యాచెస్ జరిగితే పోలీస్ ఆఫీసర్లంతా మ్యాచ్ చూస్తారు. కానీ బయట దేశాల్లో మ్యాచ్ జరిగితే వాళ్లంతా క్రౌడ్ ను చూస్తారు. అంటూ తనదైన శైలిలో ఒక లాజిక్ చెప్పాడు నిరంజన్ రెడ్డి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై పలు రకాల కామెంట్స్ వస్తున్నాయి. ఇంత తెలివిగా ఆలోచించే మీరు ఆచార్య లాంటి సినిమా ఎలా తీశారు అంకుల్ అంటూ కొంతమంది కామెంట్ చేయడం మొదలుపెట్టారు. మెగాస్టార్ చిరంజీవి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో అంచనాలతో వచ్చి డిజాస్టర్ అయింది. ఈ సినిమాకి కూడా నిర్మాతగా వ్యవహరించారు నిరంజన్ రెడ్డి.
Also Read : Allu Arjun Arrest: బన్నీ అరెస్ట్ అయ్యినప్పుడు వేసుకున్న టీ షర్ట్.. ఇది గమనించారా.. ?