BigTV English

Nirupam : భార్యకు బర్త్ డే గిఫ్ట్… ఈ ఒక్క దాంతో నిరుపమ్ ప్రేమ మొత్తం చూపించాడు

Nirupam : భార్యకు బర్త్ డే గిఫ్ట్… ఈ ఒక్క దాంతో నిరుపమ్ ప్రేమ మొత్తం చూపించాడు

Nirupam: నిరుపమ్ పరిటాల అంటే తెలియని వారు ఉంటారేమో కానీ డాక్టర్ బాబు అంటే అందరికీ పరిచయమే, ఫ్యాన్స్ ఇష్టపడితే అది బుల్లితెర వెండితెర అని చూడకుండా అభిమానిస్తారని నిరుపమ్  ఫ్యాన్సీ ను చూస్తే తెలుస్తుంది. డాక్టర్ బాబుగా సౌందర్య సుపుత్రుడిగా, కార్తీకదీపం సీరియల్ తో పాపులర్ అయ్యారు. ఆయన భార్య మంజుల బుల్లితెర అభిమానులకు సుపరిచితమే, చంద్రముఖి సీరియల్ తో ఇద్దరి ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత ఇద్దరు వివాహం చేసుకున్నారు. ఇద్దరు ఎవరు సీరియల్స్ లో వారు బిజీగా గడుపుతున్నారు. తాజాగా నిరుపమ్ తన భార్య మంజుల పుట్టిన రోజు సందర్భంగా, ఆమెకు ఓ గిఫ్ట్ ను ప్రెసెంట్ చేసి ఆమె పై ప్రేమను తెలిపారు.


భార్యకు బర్త్ డే గిఫ్ట్..

నీరూపమ్ తాజాగా తన భార్య మంజుల పుట్టినరోజు మే 9న సందర్భంగా ఆమెకి గిఫ్టుగా, తన చేతిపై ఆమె నేమ్ నీ టాటూ వేయించుకున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా నిరుపమ్ పోస్ట్ చేశారు. ఇది నా భార్య పుట్టిన రోజుకు బహుమతిగా సప్రైజ్ గా అందించనున్నాను అని ఆయన టాటూ వేయించుకున్న వీడియోను తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా నిరూపమ్  తన భార్యపై చూపిస్తున్న ప్రేమకు గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మీపెయిర్ క్యూట్ అంటూ కామెంట్ చేస్తున్నారు. భార్యకు బర్త్ డే కు ఇచ్చే గిఫ్ట్ తో నిరుపమ్ ప్రేమ మొత్తం చూపించాడు.


డాక్టర్ బాబు ..గా గుర్తింపు ..

నిరుపమ్, మంజులా ఇద్దరు చంద్రముఖి సీరియల్ ద్వారా ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. ఈ సీరియల్ తో కెరియర్ని మొదలుపెట్టడంతో పాటు వారి జీవితాన్ని కూడా మొదలుపెట్టారు. మంజుల చంద్రముఖి, తరంగాలు, లేత మనసులు ఆకాశమంత, కృష్ణవేణి, నీలాంబరి, చంద్రలేఖ, గోకులంలో సీత, ఇద్దరమ్మాయిలు, జానకి కలగనలేదు సీరియల్స్ లో నటించి మెప్పించారు. సీరియల్స్ కాకా స్టార్ మహిళ మోడ్రన్ మహాలక్ష్మి అభిరుచి భలే ఛాన్స్ వంటి ప్రోగ్రామ్స్ లో కూడా మంజుల పాల్గొని అలరించారు. ఇక నిరూపమ్, కుంకుమపువ్వు మూగమనసులు, అత్తారింటికి దారేది, కలవారి కోడలు, కాంచనగంగా, ప్రేమ, రాధక నీవే రా ప్రాణం వంటి సీరియల్స్ లో నటించారు. 2009లో ఫిట్టింగ్ మాస్టర్ సినిమాలో నిరుపమ్ వెండితెరపై అడుగు పెట్టారు. 2014లో రభస సినిమాలో నటించారు. నిరుపమ్  తండ్రి ఓంకార్ ఎన్నో సినిమాలలో నటించారు. ఇక ప్రస్తుతం నిరుపమ్ బ్యాక్ టు బ్యాక్ సీరియల్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తున్నారు. ప్రస్తుతం కార్తీకదీపం 2 సీరియల్ లో కార్తీక్ క్యారెక్టర్ లో నటిస్తున్నారు. ఈ సీరియల్ మొదటి భాగంలో కార్తీక్ బాబుగా పాపులర్ అయ్యారు. ఈ సీరియల్ లో దీప ,కార్తీక్ జంటకు ఫ్యాన్ బేస్ వుంది .సీరియల్ స్టార్ మా లో టాప్ రేటింగ్ లో దూసుకుపోతుంది.

?igsh=ZjFkYzMzMDQzZg==

 

Related News

Film industry: కన్న తండ్రే కసాయి.. కొట్టి ఆ గాయాలపై కారం పూసేవాడు.. హీరోయిన్ ఆవేదన!

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Big Stories

×