BigTV English

Nithin Robinhood: ‘రాబిన్‌హుడ్’ రికార్డ్ బిజినెస్‌.. నితిన్‌ ముందు భారీ టార్గెట్!

Nithin Robinhood: ‘రాబిన్‌హుడ్’ రికార్డ్ బిజినెస్‌.. నితిన్‌ ముందు భారీ టార్గెట్!

Nithin Robinhood: గత కొంత కాలంగా సరైన విజయాలు అందుకోలేకపోతున్నయంగ్ హీరో నితిన్‌.. ఈసారి ఎలాగైనా సరే సాలిడ్ హిట్ కొట్టాలనే కసితో ఉన్నాడు. నితిన్ (Nithin),శ్రీలీల (Sreeleela) జంటగా నటించిన ‘రాబిన్ హుడ్’ మార్చి 28న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. వెంకీ కుడుముల (Venky Kudumula) డైరెక్ట్ చేసిన ఈ సినిమా అదిదా సర్ప్రైజ్ సాంగ్‌తో కాస్త గట్టిగానే కాంట్రవర్సీ క్రియేట్ చేసింది. ఈ పాటలో కేతిక శర్మతో శేఖర్ మాస్టర్ చేయించిన స్టెప్స్ హాట్ టాపిక్ అయ్యాయి. దీనికి తోడు ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఈ సినిమాలో స్పెషల్ క్యారెక్టర్ చేశారు. చేయడమే కాదు.. సినిమా ప్రమోషన్స్ కోసం హైదరాబాద్‌కు కూడా వచ్చాడు. రాబిన్ హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రచ్చ చేశాడు. ఈ వేదిక మీద సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, ఒరేయ్ వార్నర్ అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. దీంతో.. జనాల్లో ఈ సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయింది. ఇదే బజ్‌తో మంచి హైప్‌తో థియేటర్లోకి రాబోతోంది. నితిన్, వెంకీ కుడుముల ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా గట్టిగా జరిగినట్టుగా తెలిసింది.


నితిన్ కెరీర్లోనే హైయెస్ట్ ప్రీ రిలీజ్ బిజినెస్!

ఈ సినిమా కోసం నితిన్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ ఖర్చు చేశారు. నితిన్‌,వెంకీ కుడుముల ‘బీష్మ’ కాంబినేషన్ రిపీట్ అవుతుండడంతో.. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో నిర్మించారు. దాదాపు 60 కోట్లు ఖర్చు చేసినట్టుగా టాక్. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకుతగ్గట్టే.. భారీగా ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా థియేట్రిక‌ల్ రైట్స్ 28 కోట్ల‌కు అమ్ముడుపోయిన‌ట్లు సమాచారం. నైజాం ఏరియా, ఆంధ్రాలో ప‌ది కోట్లకు అటు ఇటుగా బిజినెస్ జ‌రిగిన‌ట్లుగా తెలిసింది. దీంతో.. రాబిన్‌హుడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 29 కోట్లుగా ఫిక్స్ అయింది. ఇక గ్రాస్ ప్రకారం చూస్తే.. ఈ సినిమా 55 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంది. నితిన్ కెరీర్లోనే ఇది భారీ టార్గెట్ చిత్రంగా రాబోతోంది. ఈ సినిమాలో తెలుగు సినిమాల రీల్స్‌తో ఫేమస్ అయిన ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ కూడా ఉండడం ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. ఈ రేంజ్ బిజినెస్ జరగడానికి వార్నర్ కూడా ఒక కారణం అనే చెప్పాలి. ఈ సినిమా ఓటిటి డీల్ కూడా భారీగానే జరిగింది. రాబిన్‌హుడ్ ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ సంస్థ జీ5 తీసుకుంది.


నితిన్-శ్రీలీల.. ఈసారి ఏం చేస్తారో?

గతంలో నితిన్, శ్రీలీల కలిసి ఎక్స్టాడినరీమ్యాన్ అనే సినిమాలో నటించారు. వక్కంతం వంశీ తెరకెక్కించిన ఈ సినిమా ఫ్లాప్ అయింది. దీంతో.. ఈసారైనా ఈ క్రేజీ కాంబో హిట్ కొట్టేనా? అనేది ఆసక్తికరంగా మారింది. పైగా రాబిన్‌హుడ్ సినిమాలో ముందుగా నేషనల్ క్రష్ రష్మిక మందన్నను హీరోయిన్‌గా అనుకున్నారు. కానీ ఆమె డేట్స్ అడ్జెస్ట్ చేయలేక తప్పుకుంది. దీంతో.. ఈ ఆఫర్ శ్రీలీల దగ్గరికి రావడం, ఆమె ఓకె చెప్పడం జరిగిపోయింది. ఇక కేతిక శర్మ అదిదా సర్ప్రైజ్ స్పెషల్ సాంగ్ ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×