Big clash in 2026 : పొంగల్ సీజన్ సౌత్ సినిమా ఇండస్ట్రీకి ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. అలాగే సినిమా ఇండస్ట్రీలో కూడా తెలుగు వాళ్లకు, అటు తమిళ తంబీలకు స్పెషల్ పండగ సంక్రాంతి. కంటెంట్ కాస్త అటు ఇటుగా ఉన్నా పండగ మూడ్ లో సినిమాలకు మంచి కలెక్షన్స్ వస్తాయి. అందుకే ఈ టైంలో సినిమాలను రిలీజ్ చేసి క్యాష్ చేసుకోవాలనుకుంటారు మేకర్స్. అలా ప్రతి ఏడాది సంక్రాంతికి పలువురు బిగ్ స్టార్స్ సినిమాలు ఒకదానితో ఒకటి పోటీ పడతాయి అన్న విషయం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కానీ వచ్చే ఏడాది మాత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బిగ్ క్లాష్ నెలకొనబోతోంది. ఈ క్లాష్ ఏకంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్ (Vijay), పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ (Jr NTR) మధ్య జరగబోతోంది.
ఎన్టీఆర్ వర్సెస్ విజయ్
సోమవారం దళపతి విజయ్ హీరోగా నటిస్తున్న ‘జననాయగన్’ (Jananayagan) మూవీ రిలీజ్ డేట్ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ మూవీని 2026 పొంగల్ కు గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నట్టు అధికారికంగా ప్రకటించారు. హెచ్ వినోద్ ఈ మూవీకి దర్శకత్వం వహించగా, కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇందులో బాబి డియోల్ విలన్ గా నటిస్తుండగా, పూజ హెగ్డే హీరోయిన్ గా కనిపించబోతోంది. అయితే విజయ్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడానికి ముందు చేస్తున్న చివరి సినిమా ఇదే కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.
ఆయన ఇమేజ్ కు తగ్గట్టుగానే ‘జననాయగన్’ అంటే ‘ప్రజల నాయకుడు’ అనే అర్థం వచ్చే విధంగా ఈ మూవీకి టైటిల్ ని ఫిక్స్ చేశారు. కానీ ఈ మూవీ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయడానికంటే ముందే ఎన్టీఆర్ ‘డ్రాగన్’ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ వెల్లడించారు.
‘డ్రాగన్’ పోస్ట్ పోన్ అంటూ ప్రచారం
మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘డ్రాగన్’ (Dragon or NTR 31). ఈ మూవీకి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ఇంకా రావాల్సి ఉంది. ఇప్పటికే షూటింగ్ షురూ కాగా ఎన్టీఆర్ జపాన్ నుంచి వచ్చాక సెట్స్ లో జాయిన్ అవుతారు. అయితే ‘జననాయగన్’ మూవీని 2025 జనవరి 9న రిలీజ్ చేయబోతున్నారని అనౌన్స్మెంట్ వచ్చిన వెంటనే… ‘డ్రాగన్’ పోస్ట్ పోన్ కాబోతుందని వార్తలు మొదలయ్యాయి.
ఎందుకంటే చాలా రోజుల క్రితమే ఎన్టీఆర్ – నీల్ మూవీని 2026 జనవరి 9న రిలీజ్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. ఇక తాజాగా మూవీ పోస్ట్ పోన్ కాబోతుందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో మరోసారి మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని జనవరి 9న రిలీజ్ చేస్తామని ప్రకటించిన పోస్టర్ ప్రత్యక్షమైంది. దీంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొనబోతోందని అంటున్నారు. నిజానికి ‘ఎన్టీఆర్ 31’ మూవీని 2022 లోనే ప్రకటించారు. కానీ అప్పటికే ఎన్టీఆర్ కి ఉన్న కమిట్మెంట్ల కారణంగా ఈ మూవీ షూటింగ్ ఈ ఏడాది ఫిబ్రవరి 20న మొదలైంది. అయితే విజయ్ కి అది చివరి సినిమా, ఇటువైపేమో తారక్ కు పాన్ ఇండియా వైడ్ గా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ బాక్స్ ఆఫీస్ రేస్ నుంచి తగ్గేదెవరు? నెగ్గేదెవరు ? అన్నది ఆసక్తికరంగా మారింది.