BigTV English

Nithiin: నితిన్ సినిమాలకు రిలీజ్ డేట్ కష్టాలు.. ‘తమ్ముడు’ పోస్ట్‌పోన్ అవ్వక తప్పదా.?

Nithiin: నితిన్ సినిమాలకు రిలీజ్ డేట్ కష్టాలు.. ‘తమ్ముడు’ పోస్ట్‌పోన్ అవ్వక తప్పదా.?

Nithiin: చాలావరకు సినిమాలు ముందు ప్రకటించిన రిలీజ్ డేట్‌‌కే ప్రేక్షకుల ముందుకు రాకపోవచ్చు. దానికి అనేక కారణాలు ఉంటాయి. షూటింగ్ ఆలస్యం అవ్వడం, అదే రోజు మరికొన్ని సినిమాలు రిలీజ్ ఉండడం.. ఇలా పలు కారణాల వల్ల సినిమాల విడుదల తేదీలు వాయిదా పడుతుంటాయి. ప్రస్తుతం నితిన్ సినిమాలకు బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ డేట్ కష్టాలు వస్తున్నాయి. ప్రస్తుతం నితిన్ ఒకటి కాదు.. ఏకంగా రెండు సినిమాల షూటింగ్స్‌లో బిజీగా ఉన్నాడు. ఆ రెండిటినీ గతేడాదిలోనే విడుదల చేయాలని అనుకున్నాడు. కానీ రోజురోజుకీ ఈ మూవీ రిలీజ్‌లపై క్లారిటీ లేకుండా పోతోంది. తను హీరోగా నటిస్తున్న ‘తమ్ముడు’ సినిమా కూడా పోస్ట్‌పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


అప్డేట్స్ లేవు

ప్రస్తుతం నితిన్.. వెంకీ కుడుముల దర్శకత్వంలో ‘రాబిన్‌హుడ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. అసలైతే ఈ మూవీ 2024 డిసెంబర్‌లోనే విడుదల కావాల్సింది. కానీ పలు కారణాల వల్ల విడుదల పోస్ట్‌పోన్ అయ్యిందని చివరి నిమిషంలో ప్రకటించారు మేకర్స్. చాలాకాలం ఆలోచించిన తర్వాత మార్చికి ఈ మూవీని వాయిదా వేస్తున్నట్టుగా తెలిపారు. ఇప్పటికీ ఈ మూవీ మార్చికి వస్తుందా లేదా అనే సందేహాలు ప్రేక్షకుల్లో ఉన్నాయి. దీంతో పాటు నితిన్ (Nithiin).. ‘తమ్ముడు’ అనే మరో మూవీలో నటిస్తున్నాడు. ఇప్పటికీ ఈ సినిమా నుండి ఒకట్రెండు పోస్టర్లు తప్పా పెద్దగా అప్డేట్స్ ఏమీ బయటికి రాలేదు. ఇప్పటికీ అసలు ఈ సినిమా రిలీజ్ ఎప్పుడూ అనే విషయంపై క్లారిటీ లేదు.


షూటింగ్ పూర్తికాలేదు

‘తమ్ముడు’ సినిమా శివరాత్రికి విడుదల అవుతుందని మొదట్లో ప్రకటించారు మేకర్స్. కానీ శివరాత్రికి ఇంకా కొన్నిరోజులే ఉంది. ఇప్పటికీ ఈ మూవీ షూటింగ్ పూర్తికాలేదని, అందుకే అప్పుడే విడుదల చేయడం కష్టమని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. కాబట్టి ‘రాబిన్‌హుడ్’ లాగానే ‘తమ్ముడు’ కూడా పోస్ట్‌పోన్ అవ్వక తప్పదని తెలుస్తోంది. చాలావరకు ‘తమ్ముడు’కు సంబంధించిన మేజర్ షూటింగ్ పూర్తయినా కూడా ఇంకా బ్యాలెన్స్ షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌కు చాలా సమయం పడుతుంది. అందుకే అన్నీ సరిగ్గా పూర్తిచేసి ఈ సినిమాను మే లేదా జూన్‌కు పోస్ట్‌పోన్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు సమాచారం.

Also Read: దర్శకుడు అలా చూపించమన్నాడు, డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా.. ప్రియాంక చోప్రా కామెంట్స్

లయ రీఎంట్రీ

‘వకీల్ సాబ్’ ఫేమ్ వేణు శ్రీరామ్.. ‘తమ్ముడు’ (Thammudu) సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు. ‘కాంతార’ ఫేమ్ సప్తమి గౌడ ఈ మూవీలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఒక సిస్టర్ సెంటిమెంట్‌తో ఈ సినిమా తెరకెక్కుతుందని ఇప్పటికే టైటిల్ చూస్తే అర్థమవుతోంది. సీనియర్ హీరోయిన్ లయ ఈ మూవీతో అయినా తన సెకండ్ ఇన్నింగ్స్‌కు బ్రేక్ పడుతుందని ఆశిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీపై ఫ్యాన్స్‌లో మంచి బజ్ ఉంది. కానీ ఇలాగే పోస్ట్‌పోన్ అవుతూ ఉంటే ‘తమ్ముడు’ మూవీ గురించి చాలామంది ప్రేక్షకులు మర్చిపోయే ఛాన్స్ ఉంది. అందుకే నితిన్‌కు సరైన హిట్ పడాలంటే ప్రస్తుతం తన చేతిలో ఉన్న రెండు సినిమాల రిలీజ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×