Nithiin Vikram Kumar Film : ప్రతి హీరో కెరియర్ కి కొన్ని ప్రత్యేకమైన సినిమాలు ఉంటాయి. ఆ సినిమాలో ఆ హీరోని కెరియర్ లో ఎక్కడికో తీసుకెళ్తాయి. వరుసగా డిజాస్టర్ లో వచ్చిన తర్వాత ఒక హిట్ సినిమా పడితే ఆ ఉపశమనం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలా యంగ్ హీరోస్ కి ఇలా జరుగుతూనే ఉంటుంది. జయం సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన నితిన్ వరుసగా మూడు హిట్ సినిమాలు అందుకున్నాడు. ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన సై సినిమా తర్వాత బాక్సాఫీస్ వద్ద వరుసగా దాదాపు 10 సంవత్సరాలకు పైగా ప్లాప్ సినిమాలు చూస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇసుక సినిమా నితిన్ కెరియర్ కి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ఆ సినిమా ఆడియో లాంచ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా నితిన్ సినిమాలను ఎంకరేజ్ చేయడం మొదలుపెట్టారు.
ఇష్క్ సినిమాను విక్రమ్ కె కుమార్ తీసిన విధానం చాలా మందిని విపరీతంగా ఆకట్టుకుంది. ఒక క్యూట్ లవ్ స్టోరీ గా ఆ సినిమాను చూపించాడు విక్రమ్. అలానే పిసి శ్రీరామ్ విజువల్స్, అనూప్ రూబెన్స్ మ్యూజిక్ ఇవన్నీ కూడా సినిమాకి ప్లస్ పాయింట్స్. ముఖ్యంగా నితిన్ మరియు నిత్యామీనన్ మధ్య కెమిస్ట్రీ కూడా బాగా వర్కౌట్ అయింది. నితిన్ కెరియర్ కి ముఖ్యంగా ఆ సినిమా ఒక కం బ్యాక్ ఫిలిం అయింది. ఆ సినిమా తర్వాత నితిన్ మార్కెట్ కూడా విపరీతంగా పెరిగింది. దాదాపు కెరియర్ అయిపోయింది అనుకునే టైంలో ఆ సినిమా తన కెరీర్ కు బూస్టప్ ఇచ్చింది. రీసెంట్ టైమ్స్ లో సినిమాలు రీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇష్క్ సినిమా రి రిలీజ్ కి నితిన్ తో పాటు ఆ చిత్ర యూనిట్ కూడా హాజరైంది. రీసెంట్ గా ఈ సినిమా చూసిన టీం ఫుల్ జోష్ లో ఉంది. మళ్లీ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నితిన్ సినిమాలు చేయనున్న సంగతి తెలిసిందే.
జబర్దస్త్ షో తో కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న వేణు బలగం సినిమాతో దర్శకుడుగా మారిపోయాడు. సినిమాకు దర్శకత్వం వహించడం వేరు, ఒక మంచి దర్శకుడుగా పేరు తెచ్చుకోవడం వేరు. వేణు విషయానికొస్తే ఒక మంచి దర్శకుడుగా బలగం సినిమాతో పేరు సాధించుకున్నాడు. ఆ తర్వాత నాని హీరోగా ఎల్లమ్మ అనే సినిమాను చేయనున్నట్లు కూడా అనౌన్స్ చేశారు. ఇక ప్రస్తుతం నాని ఆ సినిమా కాకుండా నితిన్ ఆ సినిమాను చేస్తున్నాడు. త్వరలో ఎల్లమ్మ సినిమా మొదలుకానుంది. ఎల్లమ్మ సినిమాతో పాటు విక్రం కే కుమార్ దర్శకత్వంలో కూడా సినిమాను ఒకేసారి నితిన్ మొదలు పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీని గురించి అధికారిక ప్రకటన త్వరలో రావాల్సి ఉంది.
Also Read : Lucky Baskhar OTT: భాస్కర్ బ్యాంక్ బ్యాలెన్స్ పెరిగినట్లు, ఓటీటీ లో వ్యూస్ పెరుగుతున్నాయి