Nithiin: ప్రస్తుతం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న యంగ్ హీరోస్ లో నితిన్ ఒకరు. జయం అనే సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు నితిన్. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు వచ్చాయి నితిన్ కి. వివి వినాయక దర్శకత్వంలో చేసిన దిల్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాతోనే తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చారు దిల్ రాజు.
అయితే ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో నితిన్ సై అనే ఒక కాలేజ్ బ్యాక్ డ్రాప్ సినిమాను చేశాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన ఘన విజయాన్ని సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత దాదాపు ఒక పదేళ్ల వరకు నితిన్ కెరియర్ లో హిట్ సినిమా లేకుండా పోయింది. విక్రం కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఇష్క్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఈ సినిమాకి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆడియో లాంచ్ లో నితిన్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పైన తనకు ఉన్న ఇష్టాన్నంతా కూడా చెప్పుకొచ్చాడు. అక్కడితో చాలామంది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నితిన్ కి ఫ్యాన్స్ అయిపోయారు. నితిన్ సినిమా ని ఎంకరేజ్ చేయడం కూడా మొదలుపెట్టారు.
Also Read : Rohith Shetty : తెలుగు ఫిలిమ్స్ గురించి భారీ ఎలివేషన్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్
పవన్ కళ్యాణ్ ఇన్వాల్వ్మెంట్
ఇష్క్ సినిమా హిట్ అయిన తర్వాత గుండెజారి గల్లంతయింది అనే సినిమాను చేశాడు. ఈ టైటిల్ కూడా గబ్బర్ సింగ్ సినిమాలోని ఒక పాటలోనిది. కేవలం పవన్ కళ్యాణ్ పాటను టైటిల్ గా వాడుకోవడం మాత్రమే కాకుండా పవన్ కళ్యాణ్ పాటను కూడా ఈ సినిమాలో రీమేక్ చేశాడు. అంతేకాకుండా ఒకచోట పవన్ కళ్యాణ్ కూడా దీనిలో కనిపిస్తూ ఉంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ ను తన ప్రాజెక్టులో ఏదో ఒక విధంగా రిఫరెన్స్ ఇస్తూనే ఉంటాడు నితిన్. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్ టైటిల్ వాడుకున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో నితిన్ చేస్తున్న సినిమా తమ్ముడు. ఎప్పుడు ఎప్పుడు రిలీజ్ అవుతుందో అనుకున్న ఈ సినిమా ఎట్టకేలకు జూలై 4ని రాబోతున్నట్లు విశ్వసినీయ వర్గాల నుండి సమాచారం వినిపిస్తుంది. ఇదివరకే పవన్ కళ్యాణ్ హీరోగా చేసిన రీ ఎంట్రీ ఫిలిం వకీల్ సాబ్ సినిమాకి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించాడు. బాక్స్ ఆఫీస్ వద్ద ఆ సినిమా అద్భుతమైన సక్సెస్ సాధించింది. వకీల్ సాబ్ సినిమా తర్వాత వేణు శ్రీరామ్ దర్శకత్వంలో వస్తున్న ఈ తమ్ముడు సినిమా పైన మంచి అంచనాలు ఉన్నాయి.
Also Read : Ram Nithin : మా అమ్మ నాకు సినిమాలు చూపిస్తూ పెంచింది