Ram Nithin : ఒకప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో నటుడుగా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. కానీ ఈ రోజుల్లో టాలెంట్ ఉంటే నటుడుగా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. అలానే చాలామంది కొత్త కొత్త నటులు ఇప్పుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తమకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. షార్ట్ ఫిలిమ్స్ తో కెరియర్ మొదలుపెట్టిన రామ్ నితిన్ మ్యాడ్ సినిమాతో మంచి గుర్తింపు సాధించుకున్నాడు. మ్యాడ్ సినిమాలో రామ్ నితిన్ క్యారెక్టర్ చాలామందికి విపరీతంగా కనెక్ట్ అయింది. మ్యాడ్ స్క్వేర్ సినిమాలో చెప్పుకునే విధంగా క్యారెక్టర్ లేకపోయినా కూడా తన పరిధిలో తను చాలా బాగా చేశాడు. ఇక ప్రస్తుతం రామ్ నితిన్ కి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.
ఆ సినిమాలు చూస్తూ పెరిగాను
ఇక రామ్ నితిన్ రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఆ ఇంటర్వ్యూలో చాలా ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. రామ్ నితిన్ వాళ్ళ అమ్మ గురించి ప్రస్తావని తీసుకొస్తూ, మామ హౌస్ వైఫ్ ఎక్కువ సినిమాలు చూస్తూ ఉండేవాళ్ళు. మామూలుగా ఎవరైనా తమ పిల్లలకు చందమామ కథలు అవి ఇవి చెప్పి పెంచుతారు కానీ మా అమ్మ మాత్రం. నన్ను పిలిచి ఈ సినిమా చూడు అంటూ నాకు సినిమాలు చూపిస్తూ ఉండేది. అలా నేను ఖుషి ,ఒక్కడు వంటి చాలా సినిమాలు చూశాను అంటూ చెప్పుకొచ్చాడు. ఖుషి సినిమా నాకు విపరీతమైన ఇష్టం. నాకు ఇప్పటికీ గుర్తు అప్పట్లో నేను అమ్మాయే సన్నగా పాటకి డాన్స్ కూడా వేసేవాడిని అంటూ తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియోను ట్విట్టర్ వేదికగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ వైరల్ చేయడం మొదలుపెట్టారు.
Also Read : Nani : నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని గ్రేటెస్ట్ మూమెంట్ అది
గ్రేట్ ఎక్స్పీరియన్స్
అప్పుడు ఒక్కడు, ఖుషి ,తమ్ముడు, తొలిప్రేమ వంటి చాలా సినిమాలను ఇప్పుడున్న యూత్ అంతా కూడా టీవీల్లోనే చూశారు. కానీ థియేటర్ లో ఎవరు ఎక్స్పీరియన్స్ చేయలేదు. రీ రిలీజ్ పుణ్యమా అంటూ ప్రస్తుతం ఈ సినిమాలను థియేటర్లో చూసే భాగ్యం కలిగింది. ముఖ్యంగా ఆ రోజుల్లో ఇంత మంచి సినిమాను ఎలా తీశారు అని ఆశ్చర్యం కూడా కలుగుతుంది. డైరెక్టర్ బ్రిలియన్స్ కూడా అర్థమవుతుంది. ఇప్పటికీ ఒక్కడు సినిమా ఐదుసార్లు రీ రిలీజ్ అయింది. అయిన ప్రతిసారి ప్రేక్షకులు ఆ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇక ఖుషి సినిమా కూడా రీ రిలీజ్ అయినప్పుడు భారీ కలెక్షన్స్ వసూలు చేసింది.
Also Read : Rohith Shetty : తెలుగు ఫిలిమ్స్ గురించి భారీ ఎలివేషన్ ఇచ్చిన బాలీవుడ్ స్టార్ డైరెక్టర్