BigTV English

Extra Ordinary Man : ఓటీటీలోకి నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..

Extra Ordinary Man : ఓటీటీలోకి నితిన్ ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే ..
Extra Ordinary Man

Extra Ordinary Man : యువ హీరో నితిన్ , డైనమిక్ హీరోయిన్ శ్రీలీల నటించిన “ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్” ఓటీటీ లోకి వచ్చేస్తుంది. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ యాక్షన్ కామెడీ మూవీ డిసెంబర్ 8 న విడుదలై.. ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఇప్పుడు ఓటీటీలో నైనా విజవంతం అవుతుందేమోనని అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.ఈ యాక్షన్ కామెడీ మూవీ జనవరి 19 డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వేదికగా ప్రసారం కానుంది. ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ లో భిన్నమైన కోణాలు చూసేందుకు సిద్ధంగా ఉండండి అని ఈ సంస్థ పేర్కొంది.


యాంగ్రీ హీరో రాజశేఖర్ మొదటిసారిగా ఓ కీలక పాత్రలో ఆకట్టుకున్నారు. నితిన్ సినిమాకు హరీష్ జైరాజ్ సంగీతం అందిచడం కూడా ఇదే మొదటిసారి . ఈ మూవీ కథేంటంటే అభయ్ (నితిన్) కు చిన్నప్పటి నుంచి మరో వ్యక్తిలా ఉండటం ఇష్టం. ఆ వ్యక్తిత్వమే జూనియర్ ఆర్టిస్టుగా మారుస్తుంది. సాదాసీదాగా సాగిపోతున్నఅతని జీవితంలోకి లఖిత (శ్రీలీల) ప్రవేశిస్తుంది.

ధనవంతురాలైన ఆమెతో అభి ప్రేమలో పడిన తర్వాత అతని జీవితం పూర్తిగా మారిపోతుంది. యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి ఆమె కంపెనీలో ఐదంకెల జీతానికి ఉద్యోగంలో చేరిపోతాడు. సరిగ్గా అదే సమయంలో ఒక కొత్త డైరక్టర్ అభి దగ్గరికి వచ్చి ఒక కథ చెప్పి , తనని హీరోగా పెట్టి మూవీ తీస్తానంటాడు. దాంతో అతని లో మళ్ళీ సినీ ఆశలు చిగురిస్తాయి. రావణుడిలాంటి నీరో అలియాస్‌ నిరంజన్‌ (సుదేవ్‌ నాయర్‌) అనే రియల్ విలన్ ఆటకట్టించడానికి సైతాన్‌ అనే పోలీస్‌ ఎలాంటి సాహసాలు చేశాడన్నది ఆ కథలో కీలకాంశం.


తర్వాత ఆ సినిమా చేయకూడదనుకున్నా, కథ నచ్చడంతో ఆ తర్వాత మనసు మార్చుకుంటాడు అభి. సినిమా కోసం ఉద్యోగాన్ని, లవ్ చేసిన అమ్మాయిని వదులుకొని కష్టపడతాడు. కానీ, తీరా సినిమా సెట్స్‌ పైకి వెళ్లే సమయానికి డైరక్టర్ అతన్ని కాదని మరో హీరోతో ఆ మూవీ పట్టాలెక్కించాలని నిర్ణయించుకుంటాడు. అయినప్పటికీ ఆ కథలో ఉన్న విధంగా చేసుకుంటూ పోయిన అభికి ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి . విలన్ కి ఎలా చెక్ పెట్టాడు . ఒక జూనియర్ ఆర్టిస్ట్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్‌గా ఎలా పేరు తెచ్చుకున్నాడు? అనేది మిగతా కథాంశం .

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×