BigTV English

Gaganyaan : గగన్‌యాన్‌కు రష్యన్ స్పేస్ సూట్లు..!

Gaganyaan : గగన్‌యాన్‌కు రష్యన్ స్పేస్ సూట్లు..!
Gaganyaan

Gaganyaan : భారత్ తొలి మానవ సహిత స్పేస్‌క్రాఫ్ట్ మిషన్ గగన్‌యాన్‌ కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ముగ్గురు వ్యోమగాములను 400 కిలోమీటర్ల కక్ష్యలో 3 రోజులు ఉంచి.. తిరిగి వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడం ఈ మిషన్ లక్ష్యం. రష్యా తయారు చేసిన స్పేస్‌సూట్లను భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(Isro) వ్యోమగాములకు అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి.


వాస్తవానికి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వారి కోసం ఇంట్రా వెహిక్యులర్ యాక్టివిటీ(IVA) సూట్లను ప్రత్యేకంగా అభివృద్ధి చేసింది. వీటిని ఇస్రో పరీక్షించడమూ పూర్తయింది. గగన్‌యాన్ మిషన్‌లో ఆస్ట్రోనాట్లు వీటినే ధరిస్తారని అందరూ భావించారు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలిస్తే.. ఐవీఏ సూట్లను వినియోగించే అవకాశాలు కనిపించడం లేదు. వాటికి బదులుగా రష్యన్ స్పేస్‌సూట్లను ఇవ్వొచ్చనే సంకేతాలు వెలువడుతు న్నాయి.

మిషన్ అవసరాల రీత్యా వ్యోమనౌక సిబ్బందికి రెట్టింపు భద్రత ఇవ్వాల్సి ఉన్నందున రష్యన్ సూట్లకే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. గగన్ యాన్ విజయవంతం కోసం ఇస్రో పలు దఫాలుగా పరీక్షలు, కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. ఇంటిగ్రేటెడ్ ఎయిర్ డ్రాప్ టెస్ట్, ప్యాడ్ అబార్ట్ టెస్ట్, టెస్ట్ వెహికల్ ఫ్లయిట్స్ వంటివి వీటిలో ఉన్నాయి. మానవసహిత రోదసి యాత్ర కన్నా ముందు అన్‌మ్యాన్డ్ మిషన్లను చేపడుతోంది.


ముగ్గురు భారత ఆస్ట్రోనాట్లు స్పేస్ సూట్ ట్రయల్స్ కోసం ఇప్పటికే రష్యా వెళ్లినట్టు ఇస్రో వర్గాల ద్వారా తెలియవస్తోంది. అయితే స్పేస్‌సూట్ల విషయమై తుది నిర్ణయం వెలువడకపోయినా.. రష్యన్ సూట్ల వైపు మొగ్గు చూపే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు ఆ వర్గాలు చెబుతున్నాయి. ఐదు దశాబ్దాల క్రితం అభివృద్ధి చేసిన సోకల్ ప్రెషర్ సూట్‌నే నేటికీ రష్యా వినియోగిస్తోంది. తొలిసారిగా 1973లో సోవియట్ కాస్మొనాట్లు ధరించారు. స్పేస్ వాక్ చేసేందుకు ఈ సూట్ ఉపయోగపడదు. వ్యోమనౌకలో మాత్రమే దీనిని వాడాల్సి ఉంటుంది. ఈ సూట్ బరువు పది కిలోలు.

Related News

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Donald Trump: ట్రంప్ టారీఫ్ బాంబ్.. ఏ రంగాలపై ఎఫెక్ట్..?

Big Stories

×