SS Stanley : ప్రముఖ దర్శకులు మహేంద్ర, శశి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా 12 ఏళ్ల పాటు పనిచేసి ఏప్రిల్ మాధతిల్ సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చారు ఎస్ఎస్ స్టాన్లీ. ఆ తరువాత ‘పుదుకొట్టయిరుందు శరవణన్’, ‘ఏప్రిల్ మంత్’, ఈస్ట్ కోస్ట్ రోడ్’ వంటి చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించారు. అలాగే స్టాన్లీ పలు తమిళ హిట్ సినిమాల్లోనూ నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సాధించుకున్న ఎస్ఎస్ స్టాన్లీ ఇప్పుడు మనమధ్య లేరు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని ఓ ఆస్పత్రిలో మరణించారు. ఆయన మరణం వార్తతో కోలీవుడ్ ఇండస్ట్రీ అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది.
ఎస్.ఎస్. స్టాన్లీ మొదటి సినిమా “ఏప్రిల్ మాధతిల్” 2002లో విడుదలైన భారతీయ తమిళ భాషా రొమాంటిక్ డ్రామా చిత్రం. ఇందులో శ్రీకాంత్ మరియు స్నేహ నటించారు , గాయత్రి జయరామన్ , వెంకట్ ప్రభు , దేవన్ మరియు కరుణాస్ తదితరులు ఈ సినిమాలో నటించారు యువన్ శంకర్ రాజా సంగీతం అందించగా,ఎం.వి. పన్నీర్‌సెల్వం సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రం 29 నవంబర్ 2002న విడుదలైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా డీసెంట్ హిట్ అనిపించుకుంది.
పుదుకొట్టయిరుందు శరవణన్ సినిమాలో ధనుష్ , అపర్ణ పిళ్ళై నటించారు. ఈ సినిమా 2004లో విడుదలైంది. ఈ సినిమా కథ విషయానికి వస్తే.. పుదుకొట్టె జిల్లాకు చెందిన శరవణన్ (ధనుష్) తన కుటుంబం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడటానికి సింగపూర్ లో ఉద్యోగానికి వెళతాడు. అక్కడ అతను ఒక సింగిలింగ్ లో ఉంటున్నాడు, అక్కడ ఒక చైనా వ్యక్తితో గొడవ పడతాడు. ఈ గొడవలో అతని పాస్‌పోర్ట్ కూడా తగలబడిపోతుంది. ఆ గొడవలో ఊహించని విధంగా చైనా వ్యక్తి మరణిస్తాడు.
కొన్ని సినిమాలకు దర్శకత్వం వహించి, ఎన్నో మంచి సినిమాల్లో నటించిన స్టాన్లీ మనమధ్య లేకపోవడం బాధాకరం.