Tollywood Hero’s: వేసవికాలం రానే వచ్చింది.. సినీ ప్రేమికులంతా కొత్త సినిమాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈ సీజన్ లో ఎక్కువ సినిమాలు రిలీజ్ కి సిద్ధంగా ఉన్నాయి. పెద్ద హీరోల సినిమాల నుండి చిన్న హీరో సినిమాల వరకు అన్ని పట్టాలెక్కిస్తారు. వేసవి సెలవులకు యూత్ అంతా సినిమాల వేటలోనే ఉంటుంది. ఏ హీరో సినిమా రిలీజ్ అయిన అందరూ కలిసి వెళ్లి సినిమాని చూడడం వేసవిలో మాత్రమే సాధ్యమవుతుంది. గత ఏడాది కూడా అగ్ర హీరోల సినిమాలు అనుకున్నన్ని రాలేదు. ఈసారి మాత్రం స్టార్ హీరోలు వేసవిలోను రెస్టు లేకుండా సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ వేసవిలో మన ముందుకు బడా హీరోల సినిమాలు రానున్నాయి. ఈ సంవత్సరం సమ్మర్ కి బ్రేక్ తీసుకోకుండా నటిస్తున్న హీరోలు ఎవరు? బ్రేక్ తీసుకుంటున్న హీరోలెవరు? అసలు ఆ సినిమాలు ఏంటో చూద్దాం..
ప్రతి సంవత్సరం మలాగే ఈ సంవత్సరం కూడా మార్చి నుంచి తెలుగు సినిమాలు వేసవి కానుకగా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే నాని నిర్మాతగా రూపొందించిన కోర్టు సినిమా థియేటర్ల వద్ద సునామీ సృష్టించింది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వచ్చిన మ్యాడ్ స్క్వేర్, భారీ కలెక్షన్స్ ని వసూలు చేసింది. అలాగే రాబిన్ హుడ్ అంటూ వచ్చిన నితిన్ ఈసారి అనుకున్నంత స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. బాలీవుడ్ నుంచి డబ్బింగ్ అయిన జాట్, గుడ్ బ్యాడ్ అగ్లీ, సినిమాలు మంచి హిట్ తో దూసుకుపోతున్నాయి. ఇక ఇవే కాకుండా ఈ సమ్మర్ కి పెద్ద హీరోల సినిమాలు సందడి చేయనున్నాయి.
వేసవిలో రానున్న సినిమాలు..
సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్న డ్రాగన్ సినిమా ఈ సమ్మర్ లోనే పట్టాలెక్కనుంది. సమ్మర్ కి నో బ్రేక్ అంటూ ఎన్టీఆర్ షూటింగ్ ఈనెల 22వ తేది నుండి మొదలుపెట్టనున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీస్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు ఎన్టీఆర్ చేసిన సినిమాలకు భిన్నంగా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు డైరెక్టర్. ఈ సమ్మరంతా ఎన్టీఆర్ ఈ మూవీ షూటింగ్ లోనే ఉండబోతున్నారు.
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ విషయానికి వస్తే.. ప్రస్తుతం పెద్ది సినిమా తో బిజీగా ఉన్నారు. తాజాగా ఈ సినిమా నుండి రిలీజ్ అయిన గ్లిమ్స్, పోస్టర్ కు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. సినిమాపై ఇప్పటివరకు ఉన్న అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈ సినిమాని తొందరగా ముగించాలనుకుంటున్నాడు రామ్ చరణ్. సమ్మర్ లో పెద్దగా బ్రేక్ ఏమీ తీసుకోకుండా ఈ సినిమా పూర్తిగా కంప్లీట్ చేయాలని అనుకుంటున్నాడు. 2026 మార్చిలో ఈ సినిమా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు.
ఇక దర్శక ధీరుడు రాజమౌళి, మహేష్ బాబు కాంబినేషన్లో వస్తున్న సినిమా షూటింగ్ ఈ సమ్మర్ లో బ్రేక్ లేకుండా జరుగుతుంది. మహేష్ షూటింగ్ లేకుంటే హైదరాబాదులోనే ఉంటారు.. లేదంటే వెకేషన్స్ అంటూ టూర్ వెళ్తారు. ప్రస్తుతం సమ్మర్ వెకేషన్ లో ఉన్న మహేష్ ఈ నెల నుండి సినిమా షూటింగ్లో పాల్గొనున్నారు. మేనెల మొత్తం షూట్ చేస్తారన్నట్లు సమాచారం.
వేసవిలో రెస్ట్ అంటున్న హీరోలు..
ఇక సీనియర్ హీరోల విషయానికి వస్తే.. మెగాస్టార్ చిరంజీవి నుండి రాబోతున్న సినిమా విశ్వంభర. ఈ సినిమా షూటింగ్ దాదాపు పూర్తయిందని సమాచారం. ఒకటి, రెండు పాటలు మినహాయించి షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలో బ్యాలెన్స్ ఉన్న పార్ట్ ను కంప్లీట్ చేయనున్నారు మెగాస్టార్. జూన్ 24న విశ్వంభరా రిలీజ్ కానునట్టు సమాచారం. ఈ వేసవిలో కాస్త రెస్ట్ తీసుకొని ఆ తరువాత షూట్ కంప్లీట్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత అనిల్ రావిపూడి తో చేయబోయే సినిమా గురించి మార్పులను చేర్పులను, చర్చించడం సమ్మర్ లో ప్లాన్ చేసుకోనున్నారు మెగాస్టార్.
ఇక మరో సీనియర్ హీరో నాగార్జున ఈ వేసవిలో ఎటువంటి షూటింగ్స్ కి ఒప్పుకోవడం లేదు. కుబేర, కూలి సినిమాలు కంప్లీట్ అయ్యాయి. ఇప్పటివరకు నాగార్జున నుండి సోలో సినిమా ప్రకటించలేదు. దాదాపుగా ఒక కథను ఫైనల్ చేశారని టాక్. పూరి జగన్నాథ్ తో నాగార్జున సినిమా అంటూ ప్రచారం జరుగుతుంది. కానీ పూరి, విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నారని విషయం తెలిసిందే. నూతన దర్శకుడితో నాగ్ కొత్త సినిమా అని ఇండస్ట్రీలో టాక్. సమ్మర్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేసి ఆ తర్వాత షూటింగ్ చేయనున్నట్లు సమాచారం.
ఇక విక్టరీ వెంకటేష్ ఈ సంక్రాంతికి మన ముందుకు వచ్చి భారీ బ్లాక్ బస్టర్ ని అందించాడు. 300 కోట్ల కలెక్షన్స్ తో ఈ సినిమా సెన్సేషన్ సృష్టించింది. ఈ సమ్మర్లో వెంకటేష్ ఎటువంటి సినిమా ఒప్పుకోలేదు. అయితే త్రివిక్రమ్ తో సినిమా ఉంటుందని ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు ఏ సినిమాను చేస్తున్నట్లు ప్రకటించలేదు. ఈ వేసవి కంప్లీట్ గా రెస్ట్ తీసుకోనున్నారు వెంకటేష్.
ఇక నటసింహ నందమూరి బాలకృష్ణ బోయపాటి శ్రీను కాంబినేషన్లో వస్తున్న అఖండ 2 సినిమా షూటింగ్ జరుగుతోంది. గ్యాప్ లేకుండా బాలకృష్ణ షూటింగ్లో పాల్గొంటున్నారు. ఈ సినిమా దసరాకి సెప్టెంబర్ 25వ తేదీన రిలీజ్ అవుతుందని ప్రకటించారు. దాంతో షూటింగ్ కంప్లీట్ చేయాలని చిత్ర యూనిట్ వేసవిలోనూ నో రెస్ట్ అంటూ సినిమాను చేస్తున్నారు.
సినిమాల జాతర..
ఇక నాగచైతన్య సమ్మర్లో రెస్ట్ తీసుకోకుండా సినిమా చేస్తున్నారు. తండేల్ సక్సెస్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఈ హీరో నెక్స్ట్ మూవీ ని విరూపాక్ష డైరెక్టర్ కార్తీక్ దండుతో చేస్తున్నారు. ఈ సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ గా రానుంది. ఈ సినిమాలో నాగచైతన్య క్యారెక్టర్ డిఫరెంట్ గా ఉంటుందని అంటున్నారు. ఈ సమ్మర్ లో నో బ్రేక్ అంటూ నాగచైతన్య సినిమా కంప్లీట్ చేసే పనిలో ఉన్నారు.
ఇక వీరితో పాటు టాలీవుడ్ లో రామ్, అక్కినేని అఖిల్,హీరో నాని కూడా వేసవిలో బ్రేక్ లేకుండా షూటింగ్స్ లో బిజీగా గడుపుతున్నట్లు సమాచారం. ఇక ఇప్పటికే కంప్లీట్ అయినా విజయ్ దేవరకొండ కింగ్ డం సినిమా మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు మే 9వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏది ఏమైనా ఈ సమ్మర్ కి బడా హీరో సినిమాలతో పాటు చిన్న హీరో సినిమాలు కూడా రిలీజ్ కానున్నాయి.
Kalyan Ram : 20 ఏళ్ల తర్వాత ఆ సెంటిమెంట్… మళ్లీ అలాంటి యూనిక్ హిట్ వస్తుందా..?