NTR birthday wished to Mokshajna Teja: నందమూరి ఫ్యామిలీ నుంచి మరో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కుమారుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా తన సినీ కెరీర్ ప్రారంభించాడు. ‘హనుమాన్’ మూవీతో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ డైరెక్షన్‌లో మోక్షజ్ఞ కొత్త సినిమా షురూ అయింది. అయితే వీరి కాంబో ఫిక్స్ అయినట్లు ఎప్పటి నుంచో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ వార్తలు నిజమయ్యాయి. మోక్షజ్ఞ, ప్రశాంత్ వర్మ కాంబినేషన్‌లో రూపొందుతున్న కొత్త సినిమాకి సంబంధించి మేకర్స్ తాజాగా అదిరిపోయే అప్డేట్ అందించారు.
ఇవాళ మోక్షజ్ఞ బర్త్ డే కావడంతో ఈ సినిమా నుంచి మెస్మరైజింగ్ పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. అందులో మోక్షు లుక్ అదిరిపోయిందనే చెప్పాలి. స్పెట్స్ పెట్టుకుని కూల్‌గా నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ నందమూరి ఫ్యాన్స్‌ని విపరీతంగా ఆకట్టుకుంది. ఈ స్టిల్ చూసి సినీ ప్రియుల్లో ఉత్సాహం మొదలైంది. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో తరం హీరోగా ఎంట్రీ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కాగా దర్శకుడు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత సుధాకర్ చేరుకూరి తన ఎస్‌ఎల్‌వి సినిమాస్ బ్యానర్‌పై లెజెండ్ ప్రొడక్షన్‌తో కలిసి నిర్మిస్తున్నాడు. ఈ చిత్రానికి ఎం తేజస్విని నందమూరి సమర్పకూరాలిగా ఉన్నారు.
కాగా ఈ చిత్రం ఒక సోషియో ఫాంటసీగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మోక్షజ్ఞ మొదటి సినిమానే సోషియో ఫాంటసీగా వస్తుండటంతో.. ఇది అందరిలోనూ గుర్తుండిపోతుందని అభిమానులు చర్చించుకుంటున్నారు. కాగా మోక్షు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేస్తూ దర్శకుడు ప్రశాంత్ వర్మ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మోక్షజ్ఞను సినిమాల్లో తీసుకురావడం చాలా బాధ్యతతో కూడుకున్న గౌరవం అని అన్నాడు. తనపై, తన కథపై నమ్మకం ఉంచి ఈ అద్భుతమైన అవకాశాన్ని తనకు అందించిన బాలకృష్ణకు తానెప్పుడూ కృతజ్ఞుడినే అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read: మోక్షజ్ఞ బర్త్‌డే స్పెషల్ పోస్టర్.. ఫస్ట్ మూవీ లుక్స్.. అదుర్స్ కదూ!
ఈ సినిమా స్క్రిప్ట్ ఇతిహాసాల నుండి ప్రేరణ పొంది తీసుకున్నదే అంటూ తెలిపాడు. అంటే ఇది కూడా ‘హనుమాన్’ లాంటి సినిమా తరహాలోనే ఉంటుందని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చాడు. కాగా ఇది పివిసియులో ఒక భాగమని చెప్పుకొచ్చాడు. అతడి వ్యాఖ్యలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. అలాగే నిర్మాత సుధాకర్ చేరుకూరి కూడా మాట్లాడారు. మోక్షజ్ఞ సినిమాను గ్రాండ్ లెవెల్లో లాంచ్ చేయడం తనకెంతో ఆనందంగా ఉందని అన్నారు. ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన బాలకృష్ణకు ధన్యవాదాలు తెలిపారు.
ఇదిలా ఉంటే అతడి బర్త్ డే సందర్భంగా పలువురు మోక్షజ్ఞకు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ తనదైన శైలిలో అతడికి విషెస్ తెలిపాడు. ‘‘ సినిమా ప్రపంచలోకి ఎంట్రీ ఇచ్చినందుకు అభినందనలు. మీ జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించేటప్పుడు తాత గారితో పాటు అన్ని దైవ శక్తులు మీపై ఆశీర్వాదాలు ఉంటాయి’’ అంటూ ట్వీట్ చేశాడు. దీంతో ఈ ట్వీట్ వైరల్‌గా మారడంతో నందమూరి ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ అవుతున్నారు. తమ్ముడికి విషెస్ చెప్పిన అన్నయ్య అంటూ కామెంట్లు చేస్తున్నారు.
Congratulations on your debut into the world of cinema!
May all the divine forces along with Thatha garu, shower blessings upon you as you begin a new chapter in your life!Happy birthday Mokshu @MokshNandamuri pic.twitter.com/5LOBVLn862
— Jr NTR (@tarak9999) September 6, 2024