BigTV English

Prabhas-NTR: ప్రభాస్‌తో పోటీ పడుతున్న ఎన్టీఆర్.. ఎత్తిన కాలర్ దించెదేలే!

Prabhas-NTR: ప్రభాస్‌తో పోటీ పడుతున్న ఎన్టీఆర్.. ఎత్తిన కాలర్ దించెదేలే!

Prabhas-NTR: అప్పటి వరకు వరుస ఫ్లాప్‌లో ఉన్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. టెంపర్ (Temper) సినిమా ఈవెంట్‌లో ఫ్యాన్స్‌కు ఒక సాలిడ్ ప్రామిస్ చేశాడు. ఇక నుంచి కాలర్ ఎత్తుకునేలా సినిమాలు చేస్తానని మాటిచ్చాడు. అక్కడి నుంచి ఎత్తిన కాలర్ దించకుండా సినిమాలు చేస్తు వస్తున్నాడు ఎన్టీఆర్. నాన్నకు ప్రేమతో (Nannaku Prematho), జనతా గ్యారేజ్ (Janatha Garage), జై లవకుశ (Jai Lava Kusa), అరవింద సమేత వీర రాఘవ (Aravinda Sametha Veera Raghava), ఆర్ఆర్ఆర్ (RRR), దేవర (Devara) సినిమాలతో డబుల్ హ్యాట్రిక్ కొట్టాడు. ఇదే జోష్‌లో నెక్స్ట్ సినిమాలు చేయబోతున్నాడు. ఏకంగా నాలుగైదు సినిమాలు లైన్లో పెట్టాడు ఎన్టీఆర్. ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోలలో ఒక్క ప్రభాస్ తప్పితే.. మిగతా హీరోలంతా ఒకటి రెండు సినిమాలు మాత్రమే చేస్తున్నారు. కానీ ప్రభాస్ చేతిలో ఏకంగా అరడజను వరకు సినిమాలున్నాయి. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రభాస్‌తో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నాడు. ఆర్ఆర్ఆర్ సమయంలో వచ్చిన గ్యాప్ రిపీట్ కాకుండా దూసుకుపోతున్నాడు.


నాలుగు సినిమాలు ఫిక్స్.. ఐదో సినిమా కూడా..!

ప్రస్తుతం ఉన్న పాన్ ఇండియా స్టార్ హీరోలలో ప్రభాస్‌తో పోటీ పడేలా సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నాడు ఎన్టీఆర్. దేవర తర్వాత ఏకంగా నాలుగు సినిమాలు లైన్లో పెట్టాడు యంగ్ టైగర్. దేవర సెట్స్ పై ఉండగానే.. బాలీవుడ్ డెబ్యూ మూవీ హృతిక్ రోషన్‌ (Hrithik Roshan)తో కలిసి వార్ 2 (War-2) స్టార్ట్ చేశాడు. ఈ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ కావొచ్చింది. ఇక వార్ 2 కంప్లీట్ అవకముందే.. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) సినిమా స్టార్ట్ చేశాడు. త్వరలోనే ఈ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమా తర్వాత వెంటనే కొరటాల శివతో దేవర 2 (Devara 2) మొదలు కానుంది. ప్రజెంట్ కొరటాల స్క్రిప్ట్ పై కసరత్తులు చేస్తున్నాడు. ఇక తాజాగా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్‌లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. దేవర-2 లేదని అనుకున్న వారందరికీ చెబుతున్నా.. కచ్చితంగా ఉంటుంది. ప్ర‌శాంత్ నీల్ సినిమా వల్ల దేవ‌ర 2కి కాస్త పాజ్ ఇచ్చామ‌ని అన్నాడు. ఇదే వేదిక పై నాగవంశీ (Naga Vamshi) నిర్మాతగా ఓ సినిమా చేయబోతున్నట్టుగా వెల్లడించాడు. ఎన్టీఆర్ చెప్పకపోయినా.. ఇది కోలీవుడ్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా అంతా ఫిక్స్ అయ్యారు. ఇక ఈ సినిమాలతో పాటు మరో కోలీవుడ్ దర్శకుడు వెట్రిమారన్‌తో కూడా సినిమా చేస్తానని గతంలోనే చెప్పాడు తారక్. మొత్తంగా.. ప్రస్తుతానికి ప్రభాస్‌ తర్వాత ఇన్ని సినిమాలు చేస్తున్న పాన్ ఇండియా స్టార్ ఎన్టీఆర్ మాత్రమే అని చెప్పాలి.


ప్రభాస్ లైనప్

సలార్ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన రెబల్ స్టార్ ప్రభాస్ (Prabash).. ఏకంగా ఐదారు సినిమాలు లైన్లో పెట్టాడు. అందులో రెండు మూడు సినిమాలు ప్యారలల్‌గా రూపొందుతున్నాయి. ఓ వైపు మారుతి రాజసాబ్ (The Rajasaab) పూర్తి కాకముందే.. మరోవైపు హను రాఘవపూడితో ఫౌజీ (Fauji) మొదలు పెట్టేశాడు డార్లింగ్. ఇప్పటికే ఫౌజీ షూటింగ్‌ను జెట్ స్పీడ్‌లో పరిగెత్తిస్తున్నాడు. నెక్స్ట్ టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ (Spirit) షూటింగ్ స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. జూన్ జూలైలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రజెంట్ సందీప్ రెడ్డి ప్రీ ప్రొడక్షన్ వర్క్‌తో బిజీగా ఉన్నాడు. ఇక ఆ తర్వాత నాగ్ అశ్విన్ కల్కి 2 (Kalki 2), ప్రశాంత్ నీల్ సలార్ 2 (Salaar 2) ప్రభాస్ డేట్స్ కోసం వెయిట్ చేస్తున్నాయి. ఇవే కాదు.. ప్రభాస్ లైన్‌లో ప్రశాంత్ వర్మ లాంటి యంగ్ డైరెక్టర్, కోలీవుడ్ సెన్సేషన్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ వంటి వారు ఉన్నారు. ఏదేమైనా.. ప్రభాస్, ఎన్టీఆర్ ఇద్దరి షెడ్యూల్‌లు చూస్తే, వీరు టాలీవుడ్ నుంచి భారతీయ సినిమా స్థాయిని మరో లెవెల్‌కి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారని చెప్పడంలో ఎలాంటి సందేహాలు అక్కర్లేదు.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×