Hyderabad Crime: జల్సాలకు అలవాటు పడ్డాడు. సులువుగా డబ్బు సంపాదించాలని ఆశపడ్డాడు. కష్టపడటానికి ఇష్టపడలేదు. ఫలితంగా అతడి జీవితాన్ని నాశనం చేసింది. డ్రగ్స్ అమ్ముతూ అడ్డంగా దొరికిపోయాడు ఓ ఎన్నారై. సంచలనం రేపిన ఈ ఘటన హైదరాబాద్‌లో వెలుగుచూసింది.
అసలే కలికాలం.. ఎవర్ని నమ్మాలో తెలియని రోజులివి. పైన కనిపిస్తున్న యువకుడి పేరు తేజస్ కట్ట. వయస్సు 29 ఏళ్లు. పుట్టింది ఇండియాలో అయినా, పెరిగిందంతా అమెరికాలో. సింపుల్‌గా చెప్పాలంటే అతడొక ఎన్నారై మాట. ఏడాది వయస్సులో పేరెంట్స్‌తో కలిసి అమెరికా వెళ్లిపోయాడు. అక్కడే పెరిగి పెద్దవాడయ్యాడు.
చివరకు ఏమైందో తెలియదు. కొడుకు బేగంపేట్‌లో తల్లిదండ్రులు మరో చోట నివాసం ఉంటున్నారు. అమెరికా నుంచి ఇండియాకు తిరిగి వచ్చాడు. ఆ తర్వాత ముంబైలో ఉద్యోగం చేశాడు. చాలా మందితో పరిచయాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. డ్రగ్స్ తీసుకునే స్థాయి నుంచి అమ్మే వ్యక్తిగా మారిపోయాడు.
ముంబై నుంచి హైదరాబాద్‌కు వచ్చిన తర్వాత రీగాక్స్ కంపెనీలో ప్రస్తుతం ఉద్యోగం చేస్తున్నాడు తేజస్ కట్ట. అతడితపాటు సోహెల్ అహ్మద్ డ్రగ్స్ అలవాటు పడ్డాడు. చివరకు వీరిద్దరు కలిసి డ్రగ్స్ అమ్మకానికి తెరలేపారు. రెండువారాలకు ఒకసారి ముంబైకి వెళ్లి చెరస్, ఎల్‌ఎస్‌డి బ్లాస్ట్, ఓజి కుష్ లాంటి డ్రగ్స్‌ను తీసుకొచ్చేవారు.
ALSO READ: సుత్తితో కొట్టి భార్యను చంపేశాడు.. పోలీసులకు ఏం చెప్పాడంటే
హైదరాబాదులోని సన్ సిటీ ప్రాంతంలో అమ్మకాలు జరుపుతూ ఉండేవారు. కొన్నాళ్లుగా డ్రగ్స్ కదలికలపై నిఘా పెట్టారు హైదరాబాద్ పోలీసులు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఇద్దర్ని సన్ సిటీలో అరెస్టు చేశారు. వారి నుంచి 21 గ్రాముల ఓ జి కుష్, 32.5 గ్రాముల చెరస్, 56 గ్రాముల ఎల్‌ఎస్‌డి బ్లాస్ట్ లను స్వాధీనం చేసుకున్నారు.
డ్రగ్స్‌తో పాటు నిందితుల నుంచి రూ. 1,00,000 నగదు సీజ్ చేశారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ మార్కెట్లో అక్షరాలా రూ. 2.75 లక్షలుగా ఉంటుందని అధికారుల అంచనా. ఒక కారును సీజ్ చేశారు. వీరిద్దరిని పోలీసులు విచారిస్తున్నారు. హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకున్నవారెవరు? ముంబైలోని ఏ ప్రాంతంలో వాటిని కొనుగోలు చేస్తున్నారు అనేదానిపై ఆరా తీస్తున్నారు. ఈ వ్యవహారంలో తీగ లాడితే డొంకంతా కదలడం ఖాయం.
డ్రగ్స్ కేసులో ఎన్ఆర్ఐ అరెస్టు.. భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం..
అమెరికా పౌరసత్వం కలిగిన బేగంపేటలో నివాసం ఉంటున్న తేజస్ కట్ట (29)
డ్రగ్స్ విక్రయిస్తూ పట్టుబడ్డ తేజస్ కట్ట
తేజస్ తో పాటు సోహెల్ అహ్మద్ (29) అరెస్ట్
నిందితుల నుంచి 21 గ్రాముల ఓజీ కుష్, 32.5 గ్రాముల చెరస్, 56… pic.twitter.com/CFe8AFq2ze
— BIG TV Breaking News (@bigtvtelugu) April 5, 2025