BigTV English
Advertisement

NTR: అభిమాని కోసం రూ. 12 లక్షల బిల్ కట్టిన ఎన్టీఆర్.. కౌశిక్ డిశ్చార్జ్

NTR: అభిమాని కోసం రూ. 12 లక్షల బిల్ కట్టిన ఎన్టీఆర్.. కౌశిక్  డిశ్చార్జ్

NTR: హీరోల కోసం అభిమానులు ఎన్నో చేస్తారు. తమ అభిమాన హీరో సినిమా వచ్చింది అంటే థియేటర్ ను పెళ్లి ఇల్లులా ముస్తాబు చేస్తారు. కటౌట్స్ కు పాలాభిషేకాలు, పూలాభిషేకాలు. హీరో బర్త్ డే లకు అన్నదానాలు, రక్తదానాలు.. ఇక తమ హీరోను ఎవరైనా ఏదైనా అంటే రక్తపాతాలే. అంతలా హీరోలను అభిమానులు ప్రేమిస్తారు.  వారు ఎంత అయితే ప్రేమిస్తున్నారో.. హీరోలు కూడా తమ ఫ్యాన్స్ ను ప్రేమిస్తూ ఉంటారు. అది అందరు చెప్పే విషయమే. కానీ, కొంతమంది హీరోలు మాత్రం అభిమానుల కష్టాలను కూడా తమ కష్టాలుగా భావించి వారికి అండగా నిలుస్తారు. అందులో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఒకరు. ఆ కుటుంబంలోనే ఆ మానవత్వం ఉంది అని చెప్పాలి.


ఇక కొన్ని నెలల క్రితం కౌశిక్ అనే  19 ఏళ్ల కుర్రాడు.. దేవర సినిమా చూసి చనిపోవాలనుంది. తనను బతికించండి అని డాక్టర్స్ ను వేడుకున్న  వీడియో ఒకటి సోషల్ మీడియాను షేక్ చేసింది. కౌశిక్ అనే 19 ఏళ్ళ కుర్రాడు రెండేళ్లుగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడు. ప్ర‌స్తుతం అత‌డు బెంగ‌ళూరులోని కిడ్‌వై హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు.పరిస్థితి విషమించడంతో ఆ కుర్రాడు రేపో మాపో చనిపోతారని డాక్టర్స్ తేల్చి చెప్పేశారు. కానీ, కౌశిక్ చిన్నతనం నుంచి ఎన్టీఆర్  కు పెద్ద ఫ్యాన్.  తన చివరి కోరికగా దేవర సినిమా చూసి  చనిపోవాలని అప్పటివరకు తనను  బతికించమని కోరాడు.

Manisha Koirala: 11 మందితో ఎఫైర్స్.. పెళ్లి చేసుకున్నా రెండేళ్లే.. ఈ స్టార్ హీరోయిన్ లైఫ్ గురించి తెలుసా..?


కొడుకు బాధను తట్టుకోలేని తల్లి సరస్వతి ఒక వీడియో ద్వారా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, హీరో జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల‌ను ప్రాధేయపడింది. తన కొడుకును బతికించమని కోరింది. ఇక వెంటనే ఎన్టీఆర్ ఆ వీడియోకు స్పందించాడు. అప్పటికప్పుడే కౌశిక్ తో వీడియో కాల్ లో మాట్లాడి దైర్యం చెప్పాడు. కౌశిక్ కోలుకోనేవరకు ఖర్చు మొత్తం తానే చూసుకుంటానని హామీ ఇచ్చాడు. అయితే నాలుగు నెలల తరువాత నిన్న సరస్వతి మరో వీడియోను రిలీజ్ చేసింది.

ఇక ఆ వీడియోలో హాస్పిటల్ బిల్స్ ఎక్కువ అయ్యాయని,  రూ.2.5 లక్షలు ఎన్టీఆర్ అభిమానులు  పంపించారని ,సి.ఎం.ఆర్.ఎఫ్ నుండి రూ.11 లక్షలు అందాయని, టీటీడీ నుండి రూ.40 లక్షలు వరకు అందినట్లు తెలిపింది. ఇంకా కౌశిక్ హాస్పిటల్ బిల్  రూ. 20 లక్షల వరకు చెల్లించాలని హాస్పిటల్ యాజమాన్యం ఒత్తడి తెస్తుందని,  ఎన్టీఆర్ పీఆర్ టీమ్ కు కాల్ చేస్తుంటే పట్టించుకోవడం లేదని ఆమె వీడియోలో తెలిపింది. ఈ వీడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఎన్టీఆర్ మాట తప్పాడని ట్రోల్స్ మొదలయ్యాయి.

Venkatesh Daggubati: నమ్మినవారే రామానాయుడును మోసం చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చిన వెంకీ మామ

ఇక తాజాగా ఎన్టీఆర్ టీమ్.. ఆ బిల్ మొత్తాన్ని క్లియర్ చేసినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కౌశిక్ ను డిశ్చార్జ్ కూడా చేశారు. ఇక ఈ సందర్భంగా  కౌశిక్ తల్లి సరస్వతి  మాట్లాడుతూ.. ” ఎన్టీఆర్ టీమ్ వచ్చి బిల్స్ క్లియర్ చేశారు. మా బాబుకు ఇప్పుడు 80 శాతం నయమయ్యింది. ఎన్టీఆర్ సర్ గురించి నేనెప్పుడూ  తప్పుగా మాటలాడలేదు.  వాళ్లు అడిగిన ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు చెప్పాను. మేము ఎప్పుడు  మీ గురించి తప్పుగా మాట్లాడలేదు సార్. ఆరోజు వీడియోలో మా అబ్బాయి కోలుకోవాలని కోరుకున్నారు. మీ మాట నిజమయ్యింది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా తప్పుగా అర్ధం చేసుకోకండి” అని ఆమె చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Related News

Tejaswini Nandamuri: నందమూరి వారసురాలు వైరల్ యాడ్ డైరెక్టర్ ఎవరో తెలుసా? ఇంత బ్యాక్గ్రౌండ్ ఉందా?

Film industry: ఘనంగా సినిమాటిక్ ఎక్స్ పో 3వ ఎడిషన్!

CM Revanth on Movie Tickets: సినిమా టికెట్ డబ్బుల్లో సినీ కార్మికులకు వాటా… సీఎం సంచలన ప్రకటన

Bandla Ganesh: బండ్ల గణేష్ ఇల్లు చూడండి.. ఎంత అద్భుతంగా ఉందో!

Telugu Heroes : సినిమాలతో పాటు హోటల్స్… లగ్జరీ రెస్టారెంట్స్ ఉన్న హీరోలు వీళ్లే

Salman Khan: పాక్ ను కెలికిన సల్లు భాయ్.. తెలుగు సినిమాలు బాగా చూస్తారంటూ..

Siva Jyothi: బేబీబంప్ తో పెళ్లి పీటలు ఎక్కిన శివ జ్యోతి.. ఇలా కూడా చేస్తారా?

Kantara 2: వైకల్యాన్ని జయిస్తూ.. నోటితోనే కాంతార బిజీఎం!

Big Stories

×