BigTV English

Venkatesh Daggubati: నమ్మినవారే రామానాయుడును మోసం చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చిన వెంకీ మామ

Venkatesh Daggubati: నమ్మినవారే రామానాయుడును మోసం చేశారు.. వెక్కి వెక్కి ఏడ్చిన వెంకీ మామ

Venkatesh Daggubati: తెలుగు ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలు పరిపాలిస్తున్న విషయం తెల్సిందే. కొణిదెల, నందమూరి, దగ్గుబాటి, అక్కినేని.. ఈ నాలుగు కుటుంబం నుంచి తరతరాలుగా కొత్త హీరోలు ఇండస్ట్రీకి పరిచయమవుతూనే ఉన్నారు. ఇక ఇండస్ట్రీ అంటే మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణ, విక్టరీ వెంకటేష్, అక్కినేని నాగార్జున.. ఈ నలుగురు సీనియర్ హీరోల చుట్టూనే  టాలీవుడ్ తిరుగుతూ ఉంటుంది. వీరికి ఉన్న ఫ్యాన్ బేస్ అంతా ఇంతా కాదు.


ఇప్పుడంటే ఒక హీరో ఇంకో హీరో కలవడానికి యుద్దాలు జరుగుతున్నాయి కానీ, అప్పట్లో ఈ నలుగురు హీరోలు ఏకతాటిపై ఉండి ఇండస్ట్రీని నడిపించేవాడు. ఇప్పుడు కూడా అలానే ఉన్నా కూడా  లోపల లోపల విభేదాలు ఉన్నాయి అనేది నమ్మదగ్గ నిజం. ఇక ఇదంతా పక్కన పెడితే.. ఈ స్టార్ హీరోలు నలుగురు కాదు.. అందులో ఏ ఇద్దరు కలిసినా కూడా ఫ్యాన్స్ కు పండగే. అలా ఇద్దరు స్టార్ హీరోల కలయికకు వేదికగా నిలిచింది  అన్‌స్టాపబుల్ షో.

Dil Raju About Sri Tej: శ్రీతేజ్ తండ్రికి పర్మినెంట్ జాబ్… హామీ ఇచ్చిన దిల్ రాజు


నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్న  అన్‌స్టాపబుల్ షో సీజన్ 4 ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న విషయం తెల్సిందే. గత మూడు సీజన్స్ ఎంతో మంచి హిట్ అయ్యాయి. ఈ సీజన్ కూడా అలానే కొనసాగుతోంది. లాస్ట్ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ సందడి చేసిన విషయం విదితమే. ఇక ఇప్పుడు బాలయ్య.. తన కోస్టార్, తనతో పోటీకి నిలబడుతున్న  దగ్గుబాటి వారసుడు విక్టరీ వెంకటేష్ ను  అన్‌స్టాపబుల్ షోకు ఆహ్వానించాడు.

వెంకటేష్ నటించిన  తాజా చిత్రం సంక్రాంతికి వస్తున్నాం సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కు రెడీ అవుతుంది.  ప్రమోషన్స్ లో భాగంగా వెంకీ మామ.. ఈ  అన్‌స్టాపబుల్ షోలో సందడి చేశాడు. వెంకీ మామ తో పాటు ఆయన అన్న సురేష్ బాబు కూడా బాలయ్యతో ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇప్పటివరకు వెంకీ మామ ఎక్కడ ఉంటే అక్కడ సందడి మాములుగా ఉండదు.

Hero Yash: హీరో కాదు ఈ విలన్ రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్.. ఏకంగా అన్ని వందల కోట్లా..?

ఇండస్ట్రీలో ఎలాంటి వివాదాలు కానీ, విమర్శలు కానీ లేని హీరో ఎవరైనా ఉన్నారంటే అది వెంకీ మామ మాత్రమే అని చెప్పొచ్చు. ఇక ఈ దగ్గుబాటి బ్రదర్స్ ఇండస్ట్రీకి రావడానికి కారణం.. వారి తండ్రి, లెజండరీ నిర్మాత రామానాయుడు. ఎన్ని హిట్ సినిమాలు ఆయన  తెరకెక్కించారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రామానాయుడు  స్టూడియోస్, సురేష్ ప్రొడక్షన్స్ ఆయన స్థాపించినవే. ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించిన రామానాయుడు  2015 లో అనారోగ్య సమస్యలతో  మరణించారు. ప్రస్తుతం ఆయన మన మధ్య లేకపోయినా.. ఆయన తెరకెక్కించిన సినిమాలతో నిత్యం బతికేఉంటారు.

ఇక వెంకటేష్ కానీ, సురేష్ బాబు కానీ ఏరోజు .. తన తండ్రి  గురించి కూడా బయట చెప్పుకోలేదు. ఎందుకంటే వారు ఎక్కువ సోషల్ మీడియాలో కానీ, ఇంటర్వ్యూస్, ఈవెంట్స్ లో  కనిపించరు. ఇక తన  షోకు వచ్చే ఏ ఒక్కరిని వదలని బాలయ్య .. దగ్గుబాటి బ్రదర్స్  ను కూడా వదలలేదు.  మళ్లీ మీరు కావాలనుకునే మూమెంట్.. మీ డాడ్ అని అడగ్గానే.. వెంకటేష్, సురేష్ ఇద్దరూ తండ్రిని తలుచుకొని కంటతడి పెట్టుకున్నారు.

Pushpa 2: దమ్ముంటే పట్టుకోరా షెకావత్.. ఏం టైమింగ్ రా బాబు.. రెచ్చగొట్టడానికేనా.. ?

తండ్రి గురించి వెంకటేష్ మాట్లాడుతూ.. ” ఆయన చివరి రోజుల్లో నాకు అనిపించింది ఏంటంటే.. అరే ఏదో ఒకటి చేసి ఉంటే పోయేది” అని ఎమోషనల్ అయ్యాడు. ఇక సురేష్ బాబు మాట్లాడుతూ.. ” ఆయన ఎంత మంచి చేసినా.. చివరి రోజుల్లో భలే బాధపడ్డారు. చాలా నిరాశకు గురయ్యారు. నేను నమ్ముకున్నవాళ్లే నన్ను ఇలా మోసం చేశారు అని ఎంతో బాధపడ్డారు.  అప్పుడప్పుడు అది మేము  తీసుకోలేకపోతాము” అని చెప్పుకొచ్చారు. ఇక సురేష్ వ్యాఖ్యలు విన్నాక  రామానాయుడును  అంతలా  నమ్మించి మోసం చేసినది ఎవరు.. ? అని నెటిజన్స్ ఆరాలు తీయడం మొదలుపెట్టారు. ఇకపోతే ఈ  ఎపిసోడ్ 27 వ తేదీన స్ట్రీమింగ్ కానుంది.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×