BigTV English

Mokshagna New Look: ఎన్టీఆర్ బాట‌లో మోక్ష‌జ్ఞ‌.. అందుకేనా లుక్ మారింది!

Mokshagna New Look: ఎన్టీఆర్ బాట‌లో మోక్ష‌జ్ఞ‌.. అందుకేనా లుక్ మారింది!

Mokshagna New Look : నంద‌మూరి బాల‌కృష్ణ పుట్టిన రోజు (జూన్ 10)ని అభిమానులు ఘ‌నంగా సెల‌బ్రేట్ చేశారు. అయితే నందమూరి బాలకృష్ణ‌తో పాటు నెట్టింట వైర‌ల్ అయిన మ‌రో వ్య‌క్తి ఆయ‌న త‌న‌యుడు మోక్ష‌జ్ఞ‌. అందుకు కార‌ణం.. మోక్ష‌జ్ఞ న‌యా లుక్‌. కొన్నాళ్లు ముందు లావుగా క‌నిపించిన ఈ నంద‌మూరి న‌వ నాయ‌కుడు.. స‌న్న‌గా క‌నిపించ‌టంతో ఆ ఫొటో నెట్టింట తెగ వైర‌ల్ అయ్యింది. చాలా రోజుల నుంచి నంద‌మూరి అభిమానులు మోక్ష‌జ్ఞ ఎంట్రీ కోసం వెయిట్ చేస్తున్నారు. అయితే మోక్ష‌జ్ఞ లావుగా ఉన్నాడ‌నా, మ‌రేదైనా కార‌ణ‌మో తెలియ‌దు కానీ.. త‌న డెబ్యూ మూవీని వాయిదా వేస్తూ వ‌చ్చారు. ఎట్ట‌కేల‌కు ఇప్పుడు త‌ను స‌న్న‌బ‌డ్డాడు. అంటే త్వ‌ర‌లోనే త‌న సినీ రంగ ప్రేశం ఉంటుంద‌ని అంద‌రూ భావిస్తున్నారు.


అయితే మొన్న‌టి వ‌ర‌కు బొద్దుగా ఉన్న మోక్ష‌జ్ఞ ఇప్పుడు స్లిమ్‌గా క‌నిపించ‌టానికి కార‌ణం.. త‌ను జూనియ‌ర్ ఎన్టీఆర్‌లా బైరియాట్రిక్ ఆప‌రేష‌న్ చేయించుకోవ‌ట‌మే అని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. రాఖీ ముందు వ‌ర‌కు లావుగా క‌నిపించిన ఎన్టీఆర్ త‌ర్వాత య‌మ‌దొంగ చిత్రంలో స‌న్న‌గా క‌నిపించాడు. అప్ప‌ట్లో త‌ను కూడా బైరియాట్రిక్ ఆప‌రేష‌న్ చేయించుకుని స‌న్న‌బ‌డ్డాడు. త‌ర్వాత కాస్త వెయిట్ పెరిగి ఇప్పుడు ప‌క్కా లుక్‌లో క‌నిపిస్తున్నారు మ‌రి.

మ‌రో వైపు ఇప్పుడు అంద‌రి మ‌దిలో మెదులుతున్న ప్ర‌శ్న‌.. నంద‌మూరి మోక్ష‌జ్ఞ‌ను ఎవ‌రు డైరెక్ట్ చేస్తారా? అని. ఎందుకంటే ఇది వ‌ర‌కే చాలా మంది డైరెక్ట‌ర్స్ పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చాయి. ఆదిత్య 369 సీక్వెల్‌గా ఆదిత్య 999తో మోక్షు ఎంట్రీ ఉంటుంద‌ని అన్నారు. అదే క్ర‌మంలో డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, క్రిష్ జాగ‌ర్ల‌మూడి స‌హా చాలా మంది పేర్లు ప‌రిశీల‌న‌లోకి వ‌చ్చిన‌ట్లు కూడా వార్త‌లు హ‌ల్ చ‌ల్ చేశాయి. అలాగే సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీనివాస‌రావు ద‌ర్శ‌క‌త్వంలో ఆదిత్య 999 తెర‌కెక్కుతుంద‌ని అందులో బాల‌కృష్ణ‌, మోక్ష‌జ్ఞ క‌లిసి న‌టిస్తార‌ని కూడా అంద‌రూ అన్నారు. అయితే ఈ వార్త‌ల‌ను ఎప్పుడూ బాల‌య్య క‌న్‌ఫ‌ర్మ్ చేయ‌లేదు. అయితే మోక్ష‌జ్ఞ‌ను హీరోగా ఎంట్రీ చేయించ‌టానికి బాల‌య్య ఎప్ప‌టి నుంచో ప్ర‌య‌త్నాల‌ను చేస్తూనే ఉన్నారు


Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×