NTR – Prashanth Neel:యంగ్ టైగర్ ఎన్టీఆర్ (NTR), రాజమౌళి(Rajamouli ) దర్శకత్వంలో ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చేసి ఏకంగా గ్లోబల్ స్టార్ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత కొరటాల శివ (Koratala Shiva) దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేసి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు అటు బాలీవుడ్ లో హ్రుతిక్ రోషన్ (Hrithik Roshan) తో కలిసి ‘వార్ -2’ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాతో బాలీవుడ్ రంగ ప్రవేశం చేయడమే కాకుండా ఇందులో తొలిసారి విలన్ గా నటించబోతున్నారు. ఇక మరొకవైపు తెలుగులో కేజిఎఫ్ సిరీస్ లతో భారీ సంచలనం సృష్టించిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్ (Prashanth Neel) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే .ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. ఇక ఈ సినిమా షూటింగ్లోకి ఎన్టీఆర్ ఎప్పుడెప్పుడు అడుగుపెడతారు అని అభిమానులు సైతం ఆతృతగా ఎదురుచూస్తున్న వేళ.. తాజాగా చిత్ర బృందం అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్ చేశారు.
ఆ రోజు నుంచి ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్లో పాల్గొనబోతున్న ఎన్టీఆర్..
“మ్యాన్ ఆఫ్ మోసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఏప్రిల్ 22వ తేదీ నుండి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ మూవీ షూటింగ్ సెట్లో పాల్గొనబోతున్నారు” అంటూ అనౌన్స్మెంట్ పోస్టర్ తో ప్రకటించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇకపోతే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ సినిమాకి ‘డ్రాగన్’ అనే టైటిల్ ను అనుకుంటున్న విషయం తెలిసిందే. ఇక వచ్చే ఏడాది ఏప్రిల్ 9వ తేదీన ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నట్లు వార్తలు కూడా వినిపిస్తున్నాయి. గత ఏడాది సినిమాను ప్రకటించారు. పైగా పూజా కార్యక్రమాలు కూడా లాంచనంగానే పూర్తయ్యాయి. ఇక ఈ సినిమాను ఈ ఏడాది జనవరిలో సెట్స్ పైకి తీసుకెళ్లారు. రామోజీ ఫిలిం సిటీ లో దాదాపు 3,000 మంది జూనియర్ ఆర్టిస్టులతో కూడిన ఒక భారీ యాక్షన్ సన్నివేశాన్ని ప్రశాంత్ నీల్ చిత్రీకరించారు. ఇక నెక్స్ట్ షెడ్యూల్ లోనే ఎన్టీఆర్ జాయిన్ కాబోతున్నారు.
Pawan Kalyan: మార్క్ శంకర్ కు వైద్య పరీక్షలు.. మార్క్ ఆరోగ్యంపై వైద్యులు ఏమన్నారంటే.?
రిలీజ్ డేట్ పై అనుమానాలు..
ఇకపోతే ఈ సినిమాను వచ్చే యేడాది జనవరి 9వ తేదీన రిలీజ్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. కానీ ఇప్పుడు మేకర్స్ ఈ మూవీ రిలీజ్ డేట్ ను మార్చే ఆలోచనలో ఉన్నట్లు కూడా తెలుస్తోంది. తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో విడుదల కాబోతున్న ఈ సినిమాతో ప్రశాంత్ నీల్ ఎలాంటి సంచలనం క్రియేట్ చేస్తారో చూడాలి. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ల పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రవి బస్రూర్ ఈ సినిమాకి సంగీతం అందిస్తూ ఉండగా.. టాప్ టెక్నీషియన్స్ ఇందులో భాగమవుతున్నట్లు సమాచారం.
#NTRNeel is entering its most explosive phase 💥💥
Man of Masses @Tarak9999 steps into the destructive soil from April 22nd ❤️🔥❤️🔥#PrashanthNeel @MythriOfficial @NTRNeelFilm pic.twitter.com/sm31n9CSGc
— NTR Arts (@NTRArtsOfficial) April 9, 2025