BigTV English

Rashmika Mandanna: రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఇంతవరకు చూడని సరికొత్త లుక్!

Rashmika Mandanna: రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో.. ఇంతవరకు చూడని సరికొత్త లుక్!

Rashmika mandanna.. ఛలో సినిమా ద్వారా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన కన్నడ బ్యూటీ రష్మిక మందన్న అతి తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజీ సొంతం చేసుకుంది. ముఖ్యంగా కిరిక్ పార్టీ అనే సినిమాలో నటించి కన్నడ నాట మంచి పేరు దక్కించుకున్న.. ఈమె అదే ఫేమ్ తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి ఇప్పుడు నేషనల్ క్రష్ గా మారిపోయింది. తెలుగు, తమిళ్, హిందీ భాషలలో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్న రష్మిక , తాజాగా అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2 సినిమాలో కీలకపాత్ర పోషిస్తుంది.


స్టార్ హీరోలతో జతకట్టిన రష్మిక..

ముఖ్యంగా టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ, మహేష్ బాబు, విజయ్ దళపతి, రణబీర్ కపూర్, సిద్దార్థ్ మల్హోత్రా, అల్లు అర్జున్ వంటి స్టార్ హీరోల సినిమాలలో నటించి మెప్పించిన ఈమె .. ఇప్పటికీ ప్రస్తుతం చేతినిండా సినిమాలు ఉన్నాయని చెప్పవచ్చు. ఎలాంటి పాత్రనైనా సరే అద్భుతంగా చేయగలదు. ఎలాంటి డైలాగ్ అయినా సరే చాలా చక్కగా పలకగలదు కూడా. అయితే రష్మిక అంత ఈజీగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టలేదు. ఎన్నో ఆడిషన్స్ కూడా ఇచ్చింది. ముఖ్యంగా అప్పట్లో ఒక్క డైలాగ్ చెప్పడానికి ఆమె ఎంత అవస్థపడిందో ప్రస్తుతం అందుకు సంబంధించిన ఆడిషన్ వీడియో కూడా ఇప్పుడు వైరల్ గా మారుతోంది.


రష్మిక ఫస్ట్ ఆడిషన్ వీడియో..

ఇక రష్మిక ఇండస్ట్రీలోకి రావడానికి ఎన్నో ఆడిషన్స్ ఇచ్చింది. అందులో తన మొదటి ఆడిషన్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడం గమనార్హం. ప్రస్తుతం ఈ వీడియోలో కన్నడలో రష్మిక మాట్లాడడానికి ఇబ్బంది పడినట్టు మనకు అనిపిస్తుంది. అందులో రష్మిక నా పేరు రష్మిక. నా వయసు 19 సంవత్సరాలు. ఎత్తు 5.5. నేను బిఏ రెండవ సంవత్సరం చదువుతున్నాను. అంతేకాదు నేను ఆడిషన్ కి రావడం ఇదే మొదటిసారి అంటూ రష్మిక మందన్న చెబుతుంది. ఈమె ఇంగ్లీష్ లోనే ఇంట్రడక్షన్ చెప్పగా.. కన్నడలోనే మాట్లాడడానికి ప్రయత్నించండి అంటూ అక్కడి స్టాఫ్ అడుగుతుంది. ఫస్ట్ టైం ఆడిషన్ అంటూ తడబడుతూ నెక్స్ట్ డైలాగ్ చెప్పింది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ ఆడిషన్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏదేమైనా రష్మిక ఫస్ట్ ఆడిషన్ కోసం ఎంత కష్టపడిందో ఆ వీడియో చూస్తే ఇట్టే అర్థమవుతుంది. ఇకపోతే ఇందులో రష్మిక లుక్ చూసి అచ్చం పక్కింటి అమ్మాయిలా ఉందే అంటూ నేటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు

రష్మిక మందన్న కెరియర్..

ఇక రష్మిక మందన్న విషయానికి వస్తే.. కన్నడ ఇండస్ట్రీకి చెందిన ఈమె అక్కడ పలు సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించి, తెలుగులోకి అడుగుపెట్టి ఇక్కడ కూడా వరుస సినిమాలతో అలరిస్తోంది. ఒకవైపు తెలుగు మరొకవైపు తమిళ్ చిత్రాలతో అలరిస్తున్న రష్మిక ఇటీవలే హిందీలో కూడా అవకాశాన్ని దక్కించుకొని ప్రస్తుతం నేషనల్ క్రష్ గా పేరు సొంతం చేసుకుంది. ఏది ఏమైనా ఒక సినిమా తర్వాత ఇంకొకటి సినిమా చేస్తూ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోయిన్ గా చలామణి అవుతూ దూసుకుపోతోంది ఈ ముద్దుగుమ్మ.

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×